E-Paper
Advertisement

iQOO 13 Leaks: హా..హా..హా.. ఇదేమి ఫోనబ్బా.. ఫీచర్లు అదిరిపోయాయి..!

iQOO 13 Leaks: హా..హా..హా.. ఇదేమి ఫోనబ్బా.. ఫీచర్లు అదిరిపోయాయి..!
Advertisement

iQOO 13 Leakes: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు మరొక ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉంది. iQOO తన తదుపరి స్మార్ట్‌ఫోన్ iQOO 13ని త్వరలో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించి లీకులు బయటకొచ్చి వైరల్ అయ్యాయి. ఇది గత సంవత్సరం వచ్చిన iQOO 12కి అప్డేటెడ్ వెర్షన్‌ అని తెలుస్తోంది. దీనికి ముందు మోడల్‌తో పోలిస్తే iQOO 13 ఫోన్‌లో మేజర్ అప్‌గ్రేడ్‌లను చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయి ఇప్పుడు తాజాగా మరికొన్ని లీక్‌లు బయటకొచ్చి ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

iQOO 13 స్మార్ట్‌ఫోన్ నవంబర్ 2024లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ చిప్ సెటప్ అందించబడుతుందని సమాచారం. ఇది Snapdragon 8 Gen 4 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు గ్రాఫిక్స్ కోసం మరొక ప్రత్యేకమైన చిప్‌సెట్‌ను అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందించడానికి ఈ ఫోన్‌లో పవర్ ప్యాక్ చేయబడుతుందని అంటున్నారు.

Also Read: క్రేజీ అప్‌డేట్.. ఐక్యూ నుంచి రెండు ఫోన్లు.. మాములు జాతర కాదుగా!

Advertisement

ఈ ఫోన్ మాక్రో లెన్స్‌తో వచ్చే ఛాన్స్ ఉంది. 100X హైబ్రిడ్ జూమ్ ఇందులో అందించే అవకాశం ఉంది. ఇది అద్భుతమైన డిజైన్, లుక్‌తో అందరినీ అట్రాక్ట్ చేస్తుందని చెప్పబడింది. అంతేకాకుండా కెమెరా పరంగా కూడా ఈ ఫోన్ అదిరిపోతుందని తాజా లీక్‌లు చెప్పబడ్డాయి. iQOO 13 ఫోన్ ఫ్లాట్ OLED ప్యానెల్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది 2K రిజల్యూషన్‌తో రావచ్చు. అలాగే సింగిల్ పాయింట్ అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ ప్రూఫ్ కోసం IP68 రేటింగ్‌తో వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Tags

Related News

రూ. 20 వేల బడ్జెట్‌లో బెస్ట్ వాషింగ్ మెషిన్! మీ ఇంటికి పర్ఫెక్ట్

రూ. 16,499 కే సామ్‌సంగ్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ! ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

జేబులో పట్టే సైజులో పవర్ బ్యాంక్.. ధర కూడా చాలా తక్కువ తెలుసా ?

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

మీ టీవీకి పర్‌ఫెక్ట్ జోడీ!హోమ్ థియేటర్ ఫీల్ ఇచ్చే.. టాప్ సౌండ్‌బార్స్

తాగునీరు విషయంలో కాంప్రమైజ్ వద్దు ! వీటితో హెల్దీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్

అమ్మో..ఈ మిక్సర్ గ్రైండర్స్ ఇంత స్మార్టా? మీ టైమ్, మనీ ఆదా చేసే టాప్ 5 మిక్సర్లు ఇవే!

Big Stories

Advertisement
×