BigTV English

Fast Battery Draining: మీ మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఇవిగో మీ సమస్యకు పరిష్కార మార్గాలు!

Fast Battery Draining: మీ మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఇవిగో మీ సమస్యకు పరిష్కార మార్గాలు!

Fast Battery Draining: ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో స్మార్ట్‌ఫోన్‌ లేని రోజు ఊహించడం చాలా కష్టమే. పొద్దున లేచిన దగ్గరి నుంచి మొదలుకుని, రాత్రి పడుకునే వారకు అనేక మంది కూడా నిత్యం ఫోన్లతోనే గడుపుతున్నారు. ఫోటోలు తీయాలన్నా, వీడియోలు చూడాలన్నా, బ్యాంకింగ్ చేసుకోవాలన్నా, ఆన్‌లైన్ క్లాసులు, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా తీసుకోండి ఫోన్‌ లేకుండా ఎలాంటి పనీ సాగదు.


ఎంత కెమెరా క్లారిటీ ఉన్నా
కానీ, ఈ స్మార్ట్ లైఫ్ వెనుక ఓ అంతరాయం సమస్య దాగుంది. అదే బ్యాటరీ. ఎంత మంచి ఫోన్‌ ఉన్నా, చార్జ్ అయిపోతే ఏం చేయలేని పరిస్థితి. ఎంత ఫీచర్లు ఉన్నా, ఎంత కెమెరా క్లారిటీ ఉన్నా ఫోన్‌ మోగేది కాదు చార్జ్ మిగిలి ఉన్నంతవరకే. అయితే ఈ సమస్యను ఎలా అధిగమించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. కొన్ని చిన్న చిన్న మార్పులతో మీ మొబైల్ బ్యాటరీ లైఫ్‌ను గణనీయంగా పెంచుకోవచ్చు.

స్క్రీన్ ప్రకాశం (Brightness)
అందంగా ప్రకాశించే డిస్‌ప్లేలు చూడటానికి బాగుండొచ్చు కానీ, అవే ఎక్కువ బ్యాటరీని ఖర్చు చేస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? చార్జ్ తగ్గిపోతున్నప్పుడు స్క్రీన్ ప్రకాశం తగ్గిస్తే బ్యాటరీ కొంత ఎక్కువ సమయం వస్తుంది.


పరిష్కారం:
-స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను “ఆటోమేటిక్”గా మార్చండి.
-అవసరం లేకపోతే పూర్తి బ్రైట్‌నెస్ వద్ద వాడకండి.
-“డార్క్ మోడ్”ను వాడటం వల్ల కూడా శక్తి వినియోగం తగ్గుతుంది (OLED స్క్రీన్‌లకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది).

అడాప్టివ్ బ్యాటరీ & ఆప్టిమైజేషన్ సెట్టింగ్స్
ఆండ్రాయిడ్ పరికరాల్లో ప్రస్తుతం కొన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అవి బ్యాటరీ సేవ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. Adaptive Battery”, “Battery Optimization” వంటి సెట్టింగ్స్ వాటిలో ముఖ్యమైనవి. మీరు ఏ యాప్‌ను ఎక్కువగా వాడుతారు? ఏవి తక్కువ? వాటి ఆధారంగా బ్యాటరీ వినియోగాన్ని తగ్గిస్తాయి.

చేయాల్సింది:
-Settings > Battery > Battery Optimization కు వెళ్లి, అవసరమైన యాప్‌లకు ఆప్టిమైజేషన్ ఇవ్వండి.
-Adaptive Battery ను “On” చేయండి.

Read Also: Samsung Ballie: బాలి వచ్చాడు..ఇంట్లోనే ఫ్యూచర్ టచ్, కొత్త …

స్క్రీన్ టైమ్-అవుట్‌ను తగ్గించండి
మీరు ఒక నోటిఫికేషన్ చూసి ఫోన్ పక్కన పెట్టినప్పుడు, స్క్రీన్ ఇంకా రెండు నిమిషాలు వెలుగుతూ ఉంటుంది. ఇది అనవసరంగా బ్యాటరీని ఖర్చు చేస్తుంది. కానీ, మీరు స్క్రీన్ ఆటో ఆఫ్ టైమ్‌ను 30 సెకన్లకు తగ్గిస్తే? భారీ మార్పు!

ఎలా చేయాలి:
Settings > Display > Screen Timeout → 30 seconds ను ఎంపిక చేయండి.

బ్యాటరీ సేవర్ యాప్‌లు
బహుశా మీరు “RAM Cleaner”, “Task Killer”, లేదా “Battery Saver” యాప్‌లు వాడి ఉంటారు. ఇవి మొదట్లో సహాయం చేస్తున్నట్లే అనిపించవచ్చు. కానీ నిజానికి ఇవి ఫోన్‌ను ఇంకా ఎక్కువ శక్తిని వాడేలా చేస్తాయి.

ఎందుకంటే:
-ఇవి నేపథ్య యాప్‌లను బలవంతంగా ఆపేస్తాయి.
-ఆ తర్వాత Android ఆ యాప్‌ను మళ్లీ ప్రారంభించాల్సి వస్తుంది.
-ఇది బ్యాటరీని మరింత వేగంగా ఖర్చు చేస్తుంది.

అవసరం లేని ఖాతాలు తొలగించండి
ఫోన్‌లో Google, Facebook, Instagram, Dropbox, WhatsApp వంటి అనేక ఖాతాలుంటాయి. వీటి డేటా తరచూ ఇంటర్నెట్ ద్వారా అప్ డేట్ అవుతుంది. (Auto Sync). ఇది బ్యాటరీని వేగంగా ఖాళీ చేస్తుంది.

మీరు చేయాల్సింది:
-Settings > Accounts లోకి వెళ్లి, ఉపయోగించని ఖాతాలను తొలగించండి.
-Auto-sync అవసరమైన ఖాతాలకు మాత్రమే ఉంచండి.

అనవసరంగా వాడే కనెక్షన్‌లను ఆపేయండి
Wi-Fi, Bluetooth, GPS, Mobile Data వంటి ఫీచర్లు మీ ఫోన్ బ్యాటరీని భారీగా ఖర్చు చేస్తాయి. ముఖ్యంగా వాటిని వాడకపోయినప్పుడు కూడా “On” గా ఉంచినట్లయితే.

బెటర్ హ్యాబిట్స్:
-ప్రయాణ సమయంలో Airplane Mode వాడండి.
-GPS అవసరమయ్యే యాప్‌లకి మాత్రమే అనుమతించండి.
-Wi-Fi, Bluetooth అవసరమయ్యే సమయానికే ప్రారంభించండి.

విపరీతమైన విజెట్‌లు? బ్యాటరీ దొంగలే!
అందంగా కనిపించే లైవ్ వాల్ పేపర్లు ఫోన్‌ను ఆకర్షణీయంగా చేస్తాయి. కానీ అవి బ్యాటరీపై భారీ భారం కలిగిస్తాయి. అలాగే, ఎక్కువగా డేటాను వినియోగించే విజెట్‌లు (Live Weather, News Feeds మొదలైనవి) బ్యాటరీపై ప్రభావం చూపుతాయి.

సలహా:
-సాధారణ వాల్‌పేపర్‌ను ఉపయోగించండి.
-ముఖ్యమైన విజెట్‌లను మాత్రమే ఉంచండి.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్
మీరు ఎప్పటికప్పుడు ఫోన్ అప్‌డేట్‌లు ఇన్‌స్టాల్ చేస్తున్నారా? ఆండ్రాయిడ్ లేదా ఫోన్ తయారీదారులు తరచూ కొత్త అప్‌డేట్‌లతో బ్యాటరీ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది
కావున:
Settings > Software Updates → Regular గా చెక్ చేయండి. లేటెస్ట్ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేయండి.

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×