Samsung Ballie: టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్త రూపాల్లో వస్తూ, మన రోజువారీ జీవితాన్ని మానవ శ్రమ లేకుండా స్మార్ట్‌గా మార్చేస్తోంది. ఇప్పటికే అలెక్సా వంటి పలు రకాల కామాండ్ల ద్వారా సాంగ్స్ ప్లే చేయడం వంటి పనులను చేస్తుంది. ఈ క్రమంలోనే టెక్నాలజీ దిగ్గజం Samsung ఓ కొత్త రకం రోబో లాంటి పరికరాన్ని ప్రవేశపెట్టింది.
భావోద్వేగాలను
దీని స్పెషల్ ఏంటంటే ఇల్లు క్లీన్ చేయడం, లైట్లు ఆన్ చేయడం, టీవీ ఆఫ్ చేయడం లాంటివి చేసేస్తుంది. హోమ్ లైఫ్‌ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు రూపొందించిన చిన్న సైజులో ఉన్న AI కంపానియన్ రోబోట్ Ballie. ఇది కేవలం రోబోట్ కాదు, మీ ఇంట్లో మీకు సహాయపడే సహచారిగా ఉంటుంది. ఇది వినియోగదారుల మాటలను అర్థం చేసుకుని, సంభాషణ జరిపే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే, ఇది కేవలం వాయిస్ కమాండ్స్‌ను పాటించే రోబోట్ మాత్రమే కాదు. మీతో మాట్లాడగలదు, మీ భావోద్వేగాలను పసిగట్టగలదు.
కొన్ని సందర్భాల్లో
మీరు “Ballie, నేను చాలా అలసిపోయాను” అన్నా కూడా, ఇది Google Gemini, Samsung భాషా నమూనాల మద్దతుతో మీరు నిద్రపోవాల్సిన అవసరాన్ని అర్థం చేసుకుని, నిద్రకు అనువైన వాతావరణాన్ని సృష్టించగలదు. కొన్ని సందర్భాల్లో శక్తి పెంపునకు సంబంధించిన సలహాలను కూడా సూచించగలదు.
Read Also: YouTube AI Music Tool: వాయిస్ నీది, బీట్ …
ఇంటిలో కష్టపడే చిన్న రోబోట్
Ballie ప్రత్యేకత ఏమిటంటే, ఇది నిజంగా ఇంటి అంతటా తిరుగుతూ లైట్స్ ఆన్/ఆఫ్ చేయడం, తలుపు వద్ద అతిథులను స్వాగతించడం, షెడ్యూల్స్ నిర్వహించడం, రిమైండర్లు ఇవ్వడం లాంటి పనుల్లో నిమగ్నమవుతుంది. ఇక మీరు ఇంట్లో లేకపోయినా, Ballie కెమెరా ద్వారా ఇంటి పరిస్థితిని గుర్తించి, మిమ్మల్ని అప్డేట్ చేయగలదు. ఇంటిలోని ఇతర డివైజ్‌లతో కనెక్ట్ అయి వాటిని కంట్రోల్ చేయగలదు. ఈ రోబోట్‌ను మీ వ్యక్తిగత హోమ్ మేనేజర్ మాదిరిగా పనిచేస్తుంది.
చదివే కన్నులు
Ballie ప్రత్యేకతల్లో ఒకటి దీని కెమెరా ఆధారిత విజువల్ సెన్సింగ్. అంటే, ఇది దాని ముందు ఉన్న దృశ్యాలను విశ్లేషించగలదు. మీరు రూమ్‌లోకి వచ్చారో, బయటకు వెళ్లారో తెలుసుకోగలదు. అలాగే ఆడియో సంకేతాలు, వాయిస్ ఆదేశాలు, సెన్సార్ డేటా ఆధారంగా స్పందించగలదు. ఈ విధంగా, ఇది నిజమైన మల్టీమోడల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. ఒకప్పుడు మనం “రొబోట్ ఇంట్లో తిరుగుతూ మన పని చూస్తే ఎంత బాగుండేది” అని కలలు కన్నాం… ఇప్పుడు Samsung ఆ కలను నిజం చేయబోతుంది.
మొదటగా ఈ దేశాల్లో
Samsung ప్రకారం, Ballie 2025 వేసవిలో మొదటగా అమెరికా, దక్షిణ కొరియాలో విడుదల కాబోతుంది. తర్వాత భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రానుంది. కానీ దీని లాంచ్‌పై అధికారిక సమాచారం ఇంకా రాలేదు. కానీ, Samsung ఇక్కడ భారీగా మార్కెట్ కలిగి ఉండటం వల్ల, త్వరలోనే మన దేశంలోనూ చూడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఫీచర్లను బట్టి చూస్తే Ballie లాంటి హోమ్ అసిస్టెంట్లు, మన కుటుంబ సభ్యుల్లా మారిపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు.