BigTV English

Jio Offers : మీ సెకండరీ సిమ్ కోసం జియో 5 బెస్ట్ ప్లానులు – ఓ లుక్కేయండి

Jio Offers : మీ సెకండరీ సిమ్ కోసం జియో 5 బెస్ట్ ప్లానులు – ఓ లుక్కేయండి

Jio Offers : ఇవ్వాళ, రేపు మనలో చాలా మంది రెండు సిమ్ కార్డుల్ని మెయిటెన్ చేస్తున్నారు. ఒకటి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కోసం అయితే మరొకటి ఆఫీస్, ఇతర వృత్తి పరమైన అవసరాలకు వినియోగిస్తున్నారు. రెండు సిమ్ లు ఉండడం వల్ల ఎక్కడి పనుల్ని అక్కడే చక్కబెట్టుకోవచ్చనేది చాలా మంది ఆలోచన. మరికొందరు అయితే బ్యాంకింగ్ తో సంబంధం లేకుండా ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలతో సంబంధం లేని సిమ్ లను వివిధ ప్లాట్‌ఫామ్‌లలో లాగిన్ అయ్యేందుకు, మార్కెటింగ్, స్పామ్ సందేశాలను నివారించేందుకు, రెస్టారెంట్లు, షాపింగ్స్ చేసేటప్పుడు ఆఫర్ల వంటి వాటి కోసం అదనపు సిమ్‌ను ఉంచుకుంటున్నారు. ఆలోచన అయితే బాగుంటుంది కానీ.. ప్రస్తుతం అందుబాటులోని ప్లాన్లతో రెండు నెంబర్లకు రీఛార్జ్ చేసుకోవాలంటే మాత్రం తలకు మించిన భారం అవుతుంది.


ఈ సమస్యకే సరికొత్త రీఛార్జ్ ఫ్లాన్లతో ముందుకొచ్చింది.. జియో. మీరు జియో సిమ్‌ను సెకండరీ సిమ్‌గా ఉపయోగిస్తుంటే, టెలికాం ప్రొవైడర్ అపరిమిత కాల్స్, రోజువారీ SMS, డేటాతో అతితక్కువ ధరలతోనే మంచి ప్లాన్‌లను అందిస్తోంది. ఇవి మీ సెకండరీ సిమ్‌ను తక్కువ రీఛార్జ్ తోనే యాక్టివ్‌గా ఉంచడంలో సహాయపడతాయి. సెకండరీ సిమ్ వినియోగదారులకు మాత్రమే కాదు.. మీరు ప్రధానంగా Wi-Fi ద్వారా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తుంటే, అత్యవసర పరిస్థితుల్లో కనీస ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందించేందుకు సైతం ఈ ప్లాన్‌లు ఉపయోగపడతాయి.

మీ సెకండరీ సిమ్‌ కోసం 5 బడ్జెట్-ఫ్రెండ్లీ జియో ప్లాన్‌లు


1. జియో రూ. 198 ప్లాన్ – 14 రోజుల చెల్లుబాటు
ఆ కేటగిరీలో ఎక్కువ ప్రయోజనాలతో, తక్కువ రీఛార్జ్ మొత్తంతో అందుబాటులోకి వచ్చింది… ఈ ప్లాన్. కేవలం రూ. 198 ప్లాన్ చేసుకుంటే.. 14 రోజుల వ్యాలిడిటీ రానుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 28 GB డేటా అందుబాటులోకి వస్తుండగా.. రోజుకు 2 GB హై-స్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. అదనంగా.. వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను పొందవచ్చు. తక్కువ రీఛార్జ్ తోనే మంచి మొత్తంలో డేటాను పొందుతూ.. సెకండరీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి స్వల్పకాలిక పరిష్కారం కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.

2. జియో రూ. 199 ప్లాన్ – 18 రోజుల చెల్లుబాటు
మొదటి ప్లాన్ కు కేవలం రూ.1 అదనంగా మరో ప్లాన్ ను జియో అందిస్తోంది. అందులో.. రూ.199 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే వ్యాలిడిటీ 18 రోజులకు వర్తిస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 27 GB డేటాను అందిస్తుండగా… రోజుకు 1.5 GB హై-స్పీడ్ డేటాను అందించనుందని జియో సర్వీస్ ప్రోవైడర్లు తెలుపుతున్నారు. మిగతా ప్లాన్లలోలానే… ఇందులోనూ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు పొందేందుకు వీలవనుంది. డేటా, కాల్ ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా కొంచెం ఎక్కువ రోజుల పాటు ప్లాన్ యాక్టీవ్ గా ఉండాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ సరిగా సరిపోతుంది.

3. జియో రూ. 209 ప్లాన్ – 22 రోజుల చెల్లుబాటు
మిగతా ప్లాన్ లతో పోల్చితే మూడో ప్లాన్ కచ్చితంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫ్షన్ అంటున్నారు. ఇందులో.. కేవలం రూ.209 తో రీఛార్జ్ చేస్తే 22 రోజుల పాటు చెల్లుబాటు అయ్యేలా ప్లాన్ అందుబాటులోకి రానుంది. ఈ ప్లాన్ మొత్తం 22 GB డేటాతో వస్తుండగా.. రోజుకు 1 GB హై-స్పీడ్ డేటాను యూజర్లు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. ఇందులోనూ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు ఇంక్లూడ్ అయ్యి రానున్నాయి.

4. జియో రూ. 239 ప్లాన్ – 22 రోజుల చెల్లుబాటు
పైన అందించిన డేటా కంటే మరింత ఎక్కువ డేటా కావాలనుకునే యూజర్లకు అనుకూలంగా ఉండేలా… రూ.239 ప్లాన్ ను జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది కూడా 22 రోజుల చెల్లుబాటుతో అందుబాటులోకి రానుండాగ.. రోజు వారీగా 1.5 GB హై-స్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. అలాగే.. మొత్తం 33 GB డేటాను ప్లాన్ ముగిసే లోగా జియో అందించనుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMSలు కూడా ఉన్నాయి.

5. జియో రూ. 249 ప్లాన్ – 28 రోజుల చెల్లుబాటు
ఈ కేటగిరీలో మరిన్ని ఎక్కువ రోజులు చెల్లుబాటు అయ్యేలా ఈ ప్లాన్ ను జియో రూపొందించింది. ఇందులో.. యూజర్లు రూ.249తో సెకండ్ సిమ్ రీఛార్జ్ చేసుకుంటే… 28 GB అందుబాటులోకి వస్తుంది. ఇది జియో వినియోగదారులలో అత్యంత ప్రజాదరణ పొందిన సెలెక్టెడ్ ప్లాన్ అంటున్నారు. కాగా.. ఈ ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుండడంతో పాటుగా నెలవారీ ప్లాన్‌గా మారుతుంది. రోజుకు 1 GB హై-స్పీడ్ డేటాతో సహా, అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు 100 SMSలు అందుబాటులోకి రానున్నాయి.

Also Read : WhatsApp Indian Users : నెలలోనే 99 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్ – మీ ఖాతా సేఫేనా, చెక్ చేసుకోండి

Related News

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Flipkart Budget Phones: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్.. ₹20,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే..

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

Big Stories

×