WhatsApp Indian Users : జనవరి 2025లో నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 99 లక్షల భారతీయ ఖాతాలను ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిషేధించింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన తాజా ఇండియా నెలవారీ నివేదికలో వెల్లడించింది. పెరుగుతున్న స్కామ్ కేసులు, స్పామ్ మోసపూరిత కార్యకలాపాలను ఎదుర్కోవడానికి, ప్లాట్‌ఫామ్ సమగ్రతను కాపాడుకోవడానికి ప్లాట్‌ఫామ్ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఈ చర్యలకు దిగినట్లుగా చెబుతున్నారు. వినియోగదారులు ప్లాట్‌ఫామ్ నియమాలను ఉల్లంఘించడం కొనసాగిస్తే మరిన్ని నిషేధాలను అమలు చేసే అవకాశాలున్నట్లు మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్ పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు, 2021లోని రూల్ 4(1)(d), రూల్ 3A(7)కి అనుగుణంగా వాట్సాప్ తాజా నివేదిక ప్రచురించింది. ఇది వాట్సప్ తన వినియోగదారులకు సురక్షితమైన, భద్రమైన ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించడానికి చేస్తున్న ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది.
జనవరి 2025 నెలలో మొత్తంగా 99 లక్షల 67 వేల భారతీయ ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తన నివేదికలో వెల్లడించింది. మొత్తం వాటిలో, స్కామ్‌లు, యాప్ ను దుర్వినియోగం చేసే ప్రవర్తన కారణంగా… వేరే వినియోగదారులు కంప్లైంట్స్ ఇవ్వడానికి ముందే 13 లక్షల 27 వేల ఖాతాలను ముందస్తుగా నిషేధించినట్లుగా వాట్సాప్ ప్రకటించింది. ఇందుకోసం ప్రవర్తనా నమూనాల ఆధారంగా పని చేసే ఇంటిగ్రేటెడ్ డిటెక్షన్ సిస్టమ్‌లను అనుసరించి ఈ చర్యలకు దిగినట్లుగా వాట్సాWhatsapp, technology, Meta India, whatsapp accounts ban, social media, social securityప్ వెల్లడించింది. ఇక జనవరి నెలలో వినియోగదారుల నుంచి 9 వేల 474 ఫిర్యాదులు అందాయి. వాటిలో 239 ఖాతాలను పూర్తిగా నిషేధించినట్లుగా వాట్సాప్ ప్రకటించింది. వీటిలో ఇమెయిల్‌లు, పోస్టల్ మెయిల్ ద్వారా ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్‌కు సమాచారం అందినట్లుగా సంస్థ వెల్లడించింది.
చట్ట ఉల్లంఘలను వాట్సాప్ ఎలా గుర్తిస్తుంది
యూజర్ల వ్యక్తిగత గోప్యత, సమాచార రక్షణకు వాట్సాప్ అనేక చర్యలు తీసుకుంటోంది. సంస్థ మెరుగైనా, అత్యాధునిక భద్రతా వ్యవస్థ హానికరమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖాతాలను గుర్తించేందుకు, నిషేధించేందుకు మల్టీపుల్ లెవల్ విధానాన్ని ఉపయోగిస్తున్నట్లుగా వాట్సప్ వెల్లడించింది. ఇందుకోసం.. మూడు గుర్తింపు వ్యవస్థలు మూడు కీలక దశలలో పనిచేస్తాయని వివరించింది. వాటిలో.. రిజిస్ట్రేషన్ సమయంలో పని చేసే వ్యవస్థలు.. అనుమానాస్పద ఖాతాలు ఫ్లాగ్ చేసి, సైన్-అప్ సమయంలో బ్లాక్ అవుతాయి. మరోదశలో సందేశం పంపేటప్పుడు వాట్సాప్ ఆటోమేటెడ్ సిస్టమ్‌లు బల్క్ మెసేజింగ్ లేదా స్పామ్ వంటి అసాధారణ ప్రవర్తనలను నిత్యం పర్యవేక్షిస్తాయని వెల్లడించింది. ఇక ఈ రెండు స్థాయిలు దాటిన తర్వాత మూడో దశలో వినియోగదారు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ ఖాతాను దుర్వినియోగం చేయడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినప్పుడు.. బాధిత వ్యక్తుల ఖాతాలను కూడా వాట్సప్ గమనిస్తుంది. సమస్యను లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే.. చర్యలు తీసుకుంటుందని వాట్సప్ తన సెక్యూరిటీ రిపోర్టులో వెల్లడించింది.
మీ వాట్సప్ ఖాతా జాగ్రత్త
మీరు అనుమానాస్పద ప్రవర్తనకు పాల్పడుతుంటే.. మీ ఖాతా తదుపరి జాబితాలో ఉండే అవకాశాలున్నాయి. అప్పటి వరకు పని చేసిన మీ వాట్సాప్ అప్పటికప్పుడు ఒక్కసారిగా ఆగిపోవచ్చు. మీరు తెలియక చేసే పొరబాట్లే అందుకు కారణం అవ్వొచ్చు. అందుకే.. ఈ జాగ్రత్తలు పాటించండి అంటున్నారు నిపుణులు. వాటిలో.. సేవా నిబంధనల ఉల్లంఘన ఒకటి. ఇందులో బల్క్ సందేశాలు, స్పామ్ పంపడం, స్కామ్‌లలో పాల్గొనడం.. లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని పంచుకోవడం వంటివి ఉంటుంటాయి. అందుకే.. మీకు తెలియని, మీరు పరిచయం లేని తప్పుడు సమాచారాన్ని గ్రూపుల్లో పంచుకోవడం మానేయండి.
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే.. భారతీయ చట్టాల ప్రకారం చట్టవిరుద్ధమైనవిగా పరిగణించబడే కార్యకలాపాలలో వాట్సప్ సహా అన్ని సంస్థలు చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాయి. అంటే..
ఇతరుల్ని రెచ్చగొట్టడం, ఏదైనా ఓ ప్రాంతంలో అల్లర్లు, గొడవలకు కారణమయ్యేలా సమాచారాన్ని పంచుకోవడం ఈ కోవలోకి వస్తుంది. వీటితో పాటుగా మీ వాట్సాప్ ఖాతను ఇతరుల్ని ఇబ్బంది పెట్టేందుకు వాడడం, వారికి తప్పుడు, అసభ్యకరమైన సందేశాలు పంపేందుకు వాడితే చర్యలు తప్పవు.
Also Read : Crew Dragon Sea Landing : అంతరిక్షం నుంచి భూగ్రహానికి ప్రయాణం.. సముద్రంలోనే ల్యాండింగ్ ఎందుకంటే?..
పైన చెప్పిన వాటిలో ఏ చర్యకు పాల్పడినా ఆటోమేటెడ్ సిస్టమ్‌లు వాటంతట అనే పని చేస్తాయని గుర్తు చేస్తున్నారు ఐటీ నిపుణులు. వాట్సాప్ సెక్యురిటీ వింగ్స్.. అలాంటి వాళ్ల కోసమే నిరంతరం పని చేస్తుంటాయని.. మీ ఖాతాలో ఇలాంటి లోటుపాట్లు ఉంటే వెంటనే సంస్థ దర్యాప్తు ప్రారంభించడంతో పాటు.. మితిమీరిన చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే.. పోలీసులు, ఇతర దర్యాప్తు బృందాల చేతికి చిక్కే అవకాశం ఉందంటున్నారు.