BigTV English

Chiranjeevi: అలాంటివి నేను సపోర్ట్ చేయను.. ఫ్యాన్స్‌పై ఫైర్ అయిన చిరంజీవి

Chiranjeevi: అలాంటివి నేను సపోర్ట్ చేయను.. ఫ్యాన్స్‌పై ఫైర్ అయిన చిరంజీవి

Chiranjeevi: ఎంతోమంది సీనియర్ హీరోలకు ఇప్పటికీ ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గకుండా ఉంది. ప్రతీ పరిశ్రమలో అలాంటి భారీ ఫ్యాన్ బేస్ ఉన్న సీనియర్ హీరోలు ఇంకా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. బయట మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలో కూడా చిరంజీవికి చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయనను చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చాను అని చెప్పుకునే వారు ఎందరో. అలాంటి చిరంజీవికి ఇండియాలో కాదు.. ఫారిన్‌లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించారు కొందరు అభిమానులు. దీంతో వారిపై సీరియస్ అవుతూ ఓపెన్‌గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు మెగాస్టార్. ఇంతకీ ఏం జరిగిందంటే.?


యూకేలో ఘన స్వాగతం

మెగాస్టార్ చిరంజీవికి హీరోగా ఎంత క్రేజ్ ఉందో తెలియాంటే తాజాగా ఆయనకు యూకే ప్రభుత్వం అందించిన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డే నిదర్శనం. దీంతో ఆయనకు ఇండియాలోనే కాదు ఫారిన్‌లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉందని మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఇటీవల అవార్డ్ తీసుకోవడానికి యూకే వెళ్లారు చిరంజీవి. అక్కడ ప్రభుత్వ అధికారులతో పాటు ఫ్యాన్స్ కూడా ఆయనకు ఘన స్వాగతం తెలిపారు. యూకేలో ఉన్న చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్స్ అన్నీ ఎయిర్‌పోర్టుకు వెళ్లి మరీ ఆయనను స్వాగతించారు. అదంతా చూసి చాలా సంతోషంతో సోషల్ మీడియాలో పోస్ట్ కూడా షేర్ చేశారు చిరు. మొన్న ఆయనను సంతోషపెట్టిన ఫ్యాన్సే ఈరోజు ఆయనకు కోపం తెప్పించారు.


జాగ్రత్తగా ఉండండి

‘మై డియర్ ఫ్యాన్స్. నన్ను యూకేలో కలవాలని మీరు అందరూ చూపించిన ప్రేమ, అభిమానం నన్ను చాలా కదిలించింది. కానీ ఫ్యాన్ మీటింగ్స్ కోసం కొందరు అభిమానులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. నేను ఈ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరి దగ్గర నుండి ఏ ఫీజ్ అయినా తీసుకొని ఉంటే దానిని కచ్చితంగా రిఫండ్ అయ్యేలాగా చూస్తాను. దయజేసి జాగ్రత్తగా ఉండండి. నేను ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ ప్రోత్సహించను అని తెలుసుకోండి. మన మధ్య ఉండే ప్రేమ, అభిమానం వెలకట్టలేనిది. దానిని ఎవరూ ఏ విధంగానూ కమర్షియల్ చేయలేరు. మనం మన మీటింగ్స్‌ను స్వచ్ఛంగా, ఏ ఫీజు పేరుతో దోపిడి లేకుండా జరుపుకుందాం’ అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి (Chiranjeevi).

Also Read: బిగ్ బాంబ్ పేల్చిన శ్రీవిష్ణు.. హరి హర వీరమల్లు రిలీజ్ ఆరోజు కూడా కష్టమేనా.?

షూటింగ్‌కు బ్రేక్

యూకేలో అవార్డ్ అందుకున్న తర్వాత తనకు అంత ఘన స్వాగతం తెలిపిన ఫ్యాన్స్‌ను కలవాలని డిసైడ్ అయ్యారు. ఈ ఫ్యాన్ మీటింగ్స్ అన్నీ తన అభిమానులను సంతోషపెట్టడం కోసం ప్లాన్ చేశారు. కానీ దానికి డబ్బులు ఛార్జ్ చేయాలని కొందరు అభిమానులు తీసుకున్న నిర్ణయం వల్ల చిరుకు కోపం వచ్చిందని, అందుకే అలా ట్వీట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గతేడాది నుండి ఈ సినిమా షూటింగ్ పెద్దగా బ్రేకుల్లేకుండా కొనసాగుతూనే ఉంది. మధ్యమధ్యలో తానే బ్రేక్స్ తీసుకుంటూ ఫ్యామిలీ టైమ్‌ను, ఇలాంటి ట్రిప్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు చిరంజీవి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×