BigTV English

Android Tips : ఆండ్రాయిడ్‌లో చాలా మందికి తెలియని ఫీచర్స్.. మీరు ట్రై చేశారా?

Android Tips : ఆండ్రాయిడ్‌లో చాలా మందికి తెలియని ఫీచర్స్.. మీరు ట్రై చేశారా?

Android Tips : ఆండ్రాయిడ్ వినియోగించే యూజర్స్ చాలా వరకూ స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారనే కానీ వాట్సప్‌లో మెసేజులు చూశామా? రిప్లయ్ ఇచ్చామా? అనేట్టు మాత్రమే ఉంటారు. మరి కొందరు యూట్యూబ్‌ లో వీడియోలు, ఇన్‌స్టా రీల్స్‌ మాత్రమే చూస్తారు. అయితే ఆండ్రాయిడ్‌ లో చాలా మందికి తెలియని ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి.  అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ ఫీచర్స్ ఏంటో ఓ లుక్కేద్దామా మరి?


ట్రాన్స్‌లేషన్‌ – ఏదైనా ఆర్టికల్‌ చదువుతుంటాం. మధ్యలో కొన్ని పదాలు అర్థం కావు అప్పుడు టెక్ట్ ను కాపీ చేసి ట్రాన్స్‌ లేటర్‌లో వేస్తుంటాం. లేదంటే గూగుల్‌ సెర్చ్ చేస్తుంటాం. ఇక ఆ అవసరం లేకుండా సొంత భాషలోకి ట్రాన్స్‌లేట్‌ చేసుకునే సదుపాయాన్ని గూగుల్‌ అందిస్తోంది. సింపుల్‌గా మీకు కావాల్సిన టెక్ట్స్‌ను సెలెక్ట్‌ చేసుకుంటే.. పాప్‌-అప్‌ మెనూలో వేస్తే కావల్సిన బాషలోకి తర్జూమా అవుతుంది.

ALSO READ : దీపావళి టపాసుల నుంచి రక్షణ – కేవంల రూ.9కే ఫోన్‌ పే బీమా పాలసీ


వైఫై పాస్‌వర్డ్ చెప్పకుండా-  గెస్ట్ ఇంటికి వచ్చినపుడు వైఫై షేర్‌ చేయాల్సి వస్తే.. పాస్‌వర్డ్‌ చెప్పాల్సిందే.  మరి అలాంటి అవసరం లేకుండా క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే చాలు.. పాస్‌వర్డ్‌తో పనిలేకుండా.. వైఫే కనెక్ట్ అవుతుంది. Connections > Wi-Fi > Current Network > QR code option మీద క్లిక్‌ చేయగానే మీ వైఫై తాలూకా క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది. ఈ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు. అయితే ఈ ఆఫ్షన్ ప్రతీ ఫోన్ లో ఒకే విధంగా ఉండదు.

ఆప్ క్లోనర్ –  ఉద్యోగం చేసుకునే వారికి యాప్ క్లోనర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యాప్ క్లోనర్ తో రెండు వాట్సప్, రెండు ఇంస్టాగ్రామ్స్ ఒకే ఫోన్లో ఉపయోగించవచ్చు. ఇలా రెండు వాట్సప్ లు ఉన్నప్పుడు ఒకటి పర్సనల్ పర్పస్ లో, మరొకటి బిజినెస్ వాట్సాప్ గా వాడుకోవచ్చు. ఒక వాట్సాప్ ను సిమ్ తో కనెక్ట్ చేస్తే, ఇంకో వాట్సాప్ ను కోడ్ సహాయంతో ఆపరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

రివర్స్‌ ఛార్జింగ్‌ – తాజాగా ప్రముఖ కంపెనీలు కొత్తగా మొబైల్స్ ను లాంఛ్ చేశాయి. ఈ ఫోన్స్ లో చాలా వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేవి ఉన్నాయి. ఇక ఆ స్మార్ట్‌ఫోన్ల సాయంతో ఇతర మొబైల్స్‌కు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లకు ఛార్జ్‌ చేసే అవకాశం ఉంది. సాధారణంగా టైప్‌-సి టు టైప్‌-సి కేబుల్‌ ద్వారా రివర్స్‌ ఛార్జింగ్‌ చేస్తుంటారు. ఇదీ అలాంటిదే. ఇక అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్‌ వీటికి సపోర్ట్‌ చేయవనే విషయం గుర్తుంచుకోండి.

అన్‌లాక్‌ చేయండి – మొబైల్‌ ఓపెన్‌ చేయగానే కొన్ని విషయాలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా హెడర్‌లో కనిపించే నెట్‌వర్క్‌ సింబల్స్‌, సిమ్‌ పేర్లు మార్చేందుకు సెట్టింగ్స్‌ ఉండవు. కానీ డెవలపర్‌ ఆప్షన్ల సాయంతో వీటిని మార్చేయొచ్చు. సెట్టింగ్స్‌లో బిల్ట్‌ నంబర్స్‌ ఆప్షన్‌ను 7సార్లు ట్యాప్‌ చేస్తే ఓ మెనూ ఓపెన్‌ అవుతుంది. ఇందులో చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. వీటి సాయంతో కావల్సిన వాటిని అనేబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×