BigTV English

Manganese:- నీటిలో మాంగనీస్.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..

Manganese:- నీటిలో మాంగనీస్.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..

Manganese:- ఈరోజుల్లో పీల్చే గాలి దగ్గర నుండి తాగునీరు వరకు అన్ని కలుషితమయిపోయాయి. అందుకే మనుషుల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఈ కాలుష్యం అనేది కడుపులో ఉన్న బిడ్డలకు కూడా హాని కలిగిస్తుందని శాస్త్రవేత్తలు తాజాగా బయటపెట్టారు. గర్భవతులుగా ఉన్న స్త్రీలు కాలుష్యంతో నిండిని నీటిని తాగడం వల్ల కడుపులో ఉన్న బిడ్డలపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని వారు చేసిన పరిశోధనల్లో తేలింది.


అమెరికా ఎంతో అభివృద్ధి చెందిన దేశమని అంటుంటారు. అది నిజమే అయినా కూడా ఆ దేశం కూడా కొన్ని విషయాల్లో అశ్రద్ధ వహిస్తూ ఉంటుంది. అలాంటి వాటిలో తాగునీరు కూడా ఒకటి. ముఖ్యంగా క్యాలిఫోర్నియాలోని సెంట్రల్ వాలీలో తాగునీటి సమస్యలు శృతిమించిపోతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ నీరు తాగడం వల్ల చిన్న పిల్లల్లో కాగ్నిటివ్, మోటర్ కంట్రోల్ వంటి సమస్యలు కనిపిస్తే.. యువతలో మెదడుకు సంబంధించిన పార్కిన్సన్ వంటి వ్యాధులు కనిపిస్తున్నాయని వారు బయటపెట్టారు.

క్యాలిఫోర్నియాలోని సెంట్రల్ వాలీలో లభించే తాగునీటిలో మాంగనీస్ అనే కెమికల్ ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మాంగనీస్ అనేది ఒక మెటల్ అని, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లోని తాగునీటిలో ఇది కనిపిస్తుందని వారు తెలిపారు. వాతావరణ మార్పులు అనేవి గ్రౌండ్ వాటర్‌లో చేరి మాంగనీస్‌కు దారితీస్తాయని అన్నారు. ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాల్లోని నీటిలో మాంగనీస్ ఎక్కువ మోతాదులో కనిపిస్తుందన్నారు. వాటితో పోలిస్తే అమెరికాలో దీని శాతం కాస్త తక్కువగానే ఉందని తెలిపారు.


నీటి సరఫరా పరిశుభ్రంగా లేని ప్రాంతాల్లో మాంగనీస్ ఎక్కువగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. వాటర్ సిస్టమ్స్ సరిగా లేకపోవడం వల్లే సెంట్రల్ వాలీలో ఈ సమస్య ఎదురవుతుందన్నారు. కేవలం సెంట్రల్ వాలీలో మాత్రమే కాకుండా ఇంకా ఏఏ ప్రాంతాల్లోని నీటి సరఫరాలో మాంగనీస్ ఎక్కువగా ఉందనే విషయంపై వారు స్టడీ చేశారు. సెంట్రల్ వాలీతో పాటు ఆ చుట్టు పక్కన ఉన్న ప్రాంతాల్లోని నీటిలో కూడా మాంగనీస్ ఎక్కువగా ఉందని వారు గుర్తించారు. అక్కడి ప్రజలకు దాదాపు 89 శాతం మాంగనీస్ కలిసి ఉన్న నీరే అందుతుందని తెలుసుకున్నారు.

మాంగనీస్ ఉన్న నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని, వాటికి చికిత్స చేయాలన్నా ఎక్కువ ఖర్చు అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా బావుల్లో లభించే తాగునీటిలోని మాంగనీస్ ఎక్కువగా కనిపిస్తుందని అన్నారు. వాటిని ప్యూరిఫై చేయడానికి లేదా శుభ్రం చేయడానికి ఎంతో ఖర్చు అవుతుందని, అందుకే వేరే దారి లేక అక్కడి ప్రజలు ఆ నీటిపైనే ఆధారపడుతున్నారని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అందుకే ప్రజలకు నష్టం కలగకుండా, తక్కువ ఖర్చుతో వారికి మంచి తాగునీరు దొరికే ప్రయత్నం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

నాసా కొత్త రికార్డ్.. ఏకంగా మార్స్‌పైనే..

Related News

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Big Stories

×