Amazon vs Flipkart Laptop Deals| ఫెస్టివల్ సేల్స్ సమయంలో షాపింగ్ చేయడానికి అందరూ ఇష్టపడతారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండు ప్లాట్‌ఫామ్స్ కూడా పండుగ సేల్ సందర్భంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై అద్భుత డీల్స్ ఇస్తున్నాయి. గేమింగ్ ల్యాప్‌టాప్‌ల నుంచి స్లిమ్ వర్క్ మెషీన్స్ వరకు ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండూ ధరలను బాగా తగ్గిస్తున్నాయి. అయితే రెండింటిలో ఏది ఎక్కువ ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇస్తున్నాయో ఒకసారి పోల్చి చూద్దాం.
సేల్ వివరాలు
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెప్టెంబర్ 23, 2025న ప్రారంభమైంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ తో అదే రోజు నుంచి హోరెత్తిస్తోంది. రెండూ ICICI, Axis కార్డ్‌లపై 10 శాతం తగ్గింపు ఇస్తున్నాయి. నో-కాస్ట్ ఈఎంఐ పెద్ద కొనుగోళ్లకు సహాయపడుతుంది. ఫ్లిప్‌కార్ట్ ₹20,000 వరకు ఎక్స్చేంజ్ ఇస్తుంది. ల్యాప్‌టాప్‌లతో ఉచిత మౌస్, బ్యాగ్‌లు కూడా ఉన్నాయి.
అమెజాన్ స్ట్రెయిట్ డిస్కౌంట్స్‌లో ముందుంది. ఈ బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లను చూడండి.
HP OMEN గేమింగ్ ల్యాప్‌టాప్
ఈ పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్ గేమర్స్ అందరూ ఇష్టపడతారు. AMD Ryzen 7-7840HS ప్రాసెసర్ వేగవంతమైన పర్‌ఫామెన్స్ ఇస్తుంది. RTX 4050 గ్రాఫిక్స్ గేమ్స్‌ను సులభంగా నడుపుతుంది. 16GB RAM త్వరగా పనిచేస్తుంది. 1TB SSD చాలా స్టోరేజ్ ఇస్తుంది. 16.1-ఇంచ్ 165Hz స్క్రీన్ అద్భుతంగా కనిపిస్తుంది. టెంపెస్ట్ కూలింగ్ వేడిని తగ్గిస్తుంది. RGB కీస్ రాత్రి ఆకర్షిస్తాయి. ప్రారంభ ధర ₹1,23,652. కానీ 36% తగ్గింపుతో ₹78,955కే అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌తో అదనంగా ₹5,000 డిస్కౌంట్ లభిస్తుంది.
HP 14 AI ల్యాప్‌టాప్
ప్రొఫెషనల్స్ ఈ స్లిమ్ ల్యాప్‌టాప్‌ను ఎంచుకుంటారు. Intel Core Ultra 7 155H AI పనులను వేగవంతం చేస్తుంది. 16GB DDR5 RAM మల్టీటాస్కింగ్ సులభం చేస్తుంది. 512GB SSD త్వరగా లోడ్ అవుతుంది. 14-ఇంచ్ FHD యాంటీ-గ్లేర్ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. బ్యాక్‌లిట్ కీలు చీకటిలో సౌకర్యంగా కనిపించేట్లు చేస్తుంది. FHD కెమెరా క్లియర్ వీడియో కాల్స్ ఇస్తుంది. 1.4kg సిల్వర్ బాడీ ఉన్న సులభంగా పోర్టబుల్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. అసలు ధర ₹98,983, కానీ అమెజాన్ లో ₹77,990 లభిస్తోంది. అంటే ఏకంగా 21% తగ్గింపు.
Apple MacBook Air M4
క్రియేటివ్ వ్యక్తులు ఈ అందమైన ల్యాప్‌టాప్‌ను ఇష్టపడతారు. M4 చిప్ 10-కోర్ CPUతో వేగంగా పనిచేస్తుంది. 8-కోర్ GPU ఎడిటింగ్ సులభం చేస్తుంది. 16GB మెమరీ యాప్స్‌ను నిర్వహిస్తుంది. 256GB SSD ఫైళ్లను స్టోర్ చేస్తుంది. 13-ఇంచ్ రెటీనా స్క్రీన్ రంగులను ఆకర్షిస్తుంది. స్కై బ్లూ ఫినిష్ ఆకట్టుకుంటుంది. ఫ్యాన్‌లెస్ డిజైన్ నిశ్శబ్దం. ధర ₹99,900 నుంచి ₹78,990. అంటే 21% తగ్గింపు. ప్రైమ్ సభ్యులకు EMI జీరో ఇంటరెస్ట్ పై లభిస్తోంది.
Dell G15-5530 గేమింగ్ ల్యాప్‌టాప్
బడ్జెట్ గేమర్స్ కు ఈ ల్యాప్ టాప్ ఫేవరెట్. Intel i5-13450HX ప్రాసెసర్ వేగవంతమైన పనితీరు ఇస్తుంది. RTX 3050 6GB గ్రాఫిక్స్ స్పష్టంగా రెండర్ చేస్తుంది. 16GB RAM త్వరగా లోడ్ అవుతుంది. 1TB SSD గేమ్స్‌ను స్టోర్ చేస్తుంది. 15.6-ఇంచ్ FHD స్క్రీన్ 120Hz వద్ద సాఫీగా రన్ అవుతుంది. 2.65kg డార్క్ గ్రే బాడీ దృఢంగా ఉంటుంది. ధర ₹1,05,000 నుంచి ₹69,990 తగ్గింది. అంటే 33% డిస్కౌంట్. ₹10,000 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.
Lenovo IdeaPad Slim 5
ఆఫీస్ వర్క్ కోసం ఈ ల్యాప్ టాప్ అనువుగా ఉంటుంది. AMD Ryzen AI 7 350 ప్రాసెసర్‌తో స్మార్ట్‌గా పనిచేస్తుంది. 24GB RAM టాస్క్‌లను సులభం చేస్తుంది. 1TB SSD స్టోరేజ్ ఇస్తుంది. 14-ఇంచ్ WUXGA OLED స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. 1.4kg గ్రే బాడీ స్లిమ్‌గా, సౌకర్యవంతంగా ఉంటుంది. బ్యాక్‌లిట్ కీలు చీకటిలో కూడా చీకటిలో కనిపించేట్లు చేస్తాయి. రోజువారీ పనులకు Copilot+ సహాయపడుతుంది. దీని ధర ₹1,26,000 నుంచి కానీ 39 శాతం తగ్గింపుతో ₹77,410కే అందుబాటులో ఉంది. 1-సంవత్సరం డ్యామేజ్ ప్రొటెక్షన్ ఉచితం.
ASUS ROG Strix G16
హార్డ్‌కోర్ గేమర్స్ దీనిని ఎంచుకుంటారు. Intel i7-13650HX శక్తివంతంగా పనిచేస్తుంది. RTX 4050 6GB 140W వద్ద అద్భుతంగా రన్ అవుతుంది. 16GB RAM స్ట్రీమింగ్ సులభం చేస్తుంది. 1TB SSD గేమ్స్‌ను సేవ్ చేస్తుంది. 16-ఇంచ్ FHD+ 165Hz స్క్రీన్ ఆకర్షిస్తుంది. RGB కీబోర్డ్ ఫన్ జోడిస్తుంది. 2.5kg ఎక్లిప్స్ గ్రే బాడీ. దీని అసలు ధర ₹2,40,000 కానీ సేల్ లో 53% తగ్గింపు తో ₹1,14,000 కే అందుబాటులో ఉంది. 90Wh బ్యాటరీ ఎక్కువసేపు నడుస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్
ధరల విషయంలో అమెజాన్‌తో ఫ్లిప్‌కార్ట్ కూడా పోటీపడుతుంది. HP OMEN 23% తగ్గింపుతో ₹94,900 ధరకు, HP 14 AI ఎక్స్చేంజ్ తరువాత ₹98,983 ధరకు, MacBook Air M4 ₹99,900తో ఉచిత ఇయర్‌బడ్స్. Dell G15 ధర ₹93,021 కానీ ఎక్స్చేంజ్ తో ₹15,000కే లభిస్తోంది. Lenovo Slim 5 ₹85,990 ధరకు నో-కాస్ట్ EMIతో. ASUS ROG ₹1,53,990 ధరకు Axis కార్డ్‌తో 10% తగ్గింపుతో అందుబాటులో ఉంది.
ధరలు పోల్చి కొనుగోలు చేయండి
డిస్కౌంట్స్ విషయంలో అమెజాన్ ముందంజలో ఉంది. ఎక్స్చేంజ్‌ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ రాణిస్తుంది. కానీ డెలివరీ విషయంలో అమెజాన్ నగరాల్లో వేగవంతంగా, ఫ్లిప్‌కార్ట్ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగ్గా ఉంది. యాప్స్‌తో లైవ్ అలర్ట్స్ పొందండి. స్టాక్ అయిపోకముందు కొనేయండి.
Also Read: అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్విగ్గీలో ఎక్కువ డిస్కౌంట్ కావాలా? ఈ క్రెడిట్ కార్డ్స్ ఉంటే సరి