OTT Movie : రియల్ స్టోరీల ఆధారంగా తెరకెక్కిన ఒక థ్రిల్లర్ సినిమా, ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇది ఢాకాలోని కదమతలీ ప్రాంతంలో జరిగిన మూడు నిజమైన హత్యల ఆధారంగా తీయబడింది. ఒక మహిళపై జరిగిన అన్యాయాలకు రివేంజ్ గా ఇవి జరుగుతాయి. ఉత్కంఠంగా సాగే ఈ కథ బెంగాలీ ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ కి వచ్చింది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘Friday’ రైహాన్ రఫీ దర్శకత్వంలో రూపొందిన ఒక బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ ఫిల్మ్. ఇందులో తమా మీర్జా మునా పాత్రలో, నసీర్ ఉద్దీన్ పోకట్ పాత్రలో ప్రధాన నటీనటులుగా నటించారు, ఫర్జానా చోబీ, మొహమ్మద్ బారీ, నీలాంజనా నీల్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ సినిమా Binge అనే బెంగాలీ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో 2023 మార్చి 3న విడుదలైంది. 1 గంట 23 నిమిషాల రన్‌టైమ్ కలిగి ఉంది.
ఈ కథ మునా అనే మహిళ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక సామాన్య మహిళ. కానీ ఆమె జీవితం శారీరక, మానసిక హింసతో నిండి ఉంటుంది. ఆమె భర్త పోకట్ ఆమెపై నిరంతరం దౌర్జన్యం చేస్తుంటాడు. ఆమెను శారీరకంగా, మానసికంగా కుంగదీస్తాడు. దీని వల్ల ఆమె ఎన్నో ఇబ్బందులు పడుతుంది. ఒకరోజు మునా 999 నంబర్‌కు కాల్ చేస్తుంది. కానీ సహాయం కోసం కాదు. తాను ఒక నేరం చేసినట్లు పోలీసులకు లొంగిపోతుంది. ఈ కాల్ వెనుక ఉన్న కారణం కథలో ఉత్కంఠతను పెంచుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా దీనికి కారణం బయట పడుతుంది. మునా జీవితంలోని బాధాకరమైన క్షణాలు, ఆమె పడిన అవమానాలు, ఆమె మనస్తత్వంలో వచ్చిన మార్పులు ఒక్కొక్కటిగా బయటి కివస్తాయి. ఆమె జీవితంలోని నిస్సహాయత ఆమెను ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకునే స్థితికి తీసుకొస్తుంది.
ఈ సినిమా కథ ఢాకాలోని కదమతలీ ప్రాంతంలో జరిగిన మూడు హత్యల చుట్టూ అల్లుకుంటుంది. ఈ హత్యలు మునా తీసుకున్న నిర్ణయంతో జరుగుతాయి. ఆమె శాడిస్ట్ భర్త దౌర్జన్యం, ఆమె జీవితంలోని అన్యాయాలు ఆమెలో ఒక తిరుగుబాటును పెంచుతాయి. దీంతో ఒక రోజు రాత్రి వీళ్ళను దారుణంగా చంపేస్తుంది. ఈ సంఘటనలు ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తాయి. ఆమెపై దారుణంగా అఘాయిత్యం చేయడంతో నే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఒక్కొక్కరిని వేటాడి చంపుతుంది. ఈ హత్యల వెనుక ఉన్న కారణం, మునా నిర్ణయం ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. మునా గతం ఏమిటి ? ఆమె ముగ్గురిని ఎందుకు చంపింది ? ఎలా చంపింది ? ఆమె భర్త చేసిన దారుణాలు ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్