Amazon Festival Xiaomi 14 CIVI| అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్ జోరుగా సాగుతోంది. కస్టమర్లు వివిధ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు పొందుతున్నారు. ఎలక్ట్రానిక్స్ నుంచి ఫ్యాషన్ వరకు అన్నీ తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ఈ సేల్‌లో Xiaomi 14 CIVI స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్ వచ్చింది. ఈ ఫోన్ లో పవర్‌ఫుల్ ప్రాసెసర్, కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ఇప్పుడు ఫోన్ ధర, ఫీచర్లు చూద్దాం.
Xiaomi 14 CIVI ఆఫర్, డిస్కౌంట్ వివరాలు
Xiaomi 14 CIVI 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 25,999కి అందుబాటులో ఉంది. దీని ఫ్రారంభ ధర రూ. 42,999. అంటే ఏకంగా 53% భారీ డిస్కౌంట్ తో ధరలో ₹17,000 తగ్గింది. Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే అదనపు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్ నాలుగు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. షాడో బ్లాక్, హాట్ పింక్, మ్యాచా గ్రీన్, క్రూజ్ బ్లూ. స్టాక్ అయిపోతుంది.. త్వరగా కొనేయండి.
షావోమీ 14 సివి ఫీచర్లు
Xiaomi 14 CIVI 6.55-ఇంచ్ AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ స్క్రీన్ కర్వ్డ్ డిజైన్‌తో అద్భుతంగా కనిపిస్తుంది. HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది.
ప్రాసెసర్ గురించి చెప్పాలంటే.. క్వాల్‌కామ్ Snapdragon 8s Gen 3 ఉంది. Adreno 735 GPUతో హై-ఆక్టేన్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ ఈ ఫోన్ అనువుగా ఉంటుంది. Android 14 OSపై HyperOS స్కిన్ ఉంది. UI స్మూత్‌గా పనిచేస్తుంది.
కెమెరాలు ఈ ఫోన్‌లో హైలైట్. బ్యాక్ కెమెరా ట్రిపుల్ సెటప్ ఉంది. 50MP ప్రైమరీ సెన్సార్ OISతో వచ్చింది. 50MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ 120 డిగ్రీ FOVతో ఉంది. లోలైట్, డేలైట్‌లో అద్భుత ఫోటోలు తీస్తుంది. Leica-ట్యూన్డ్ కెమెరాలు కలర్, డీటెయిల్స్ బాగా ఇస్తాయి.
ఫ్రంట్ లో డ్యూయల్ సెటప్ కెమెరా ఉంది. 32MP వైడ్ యాంగిల్, 32MP అల్ట్రా వైడ్ 100 డిగ్రీ FOV. సెల్ఫీలు, వీడియో కాల్స్ క్లియర్‌గా వస్తాయి. Leica స్టైల్స్‌తో ఎడిటింగ్ సులభం.
బ్యాటరీ, కనెక్టివిటీ
ఫోన్‌లో 4700mAh సామర్థ్యంగల బ్యాటరీ ఉంది. 67W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. రోజంతా ఉపయోగించినా సాగుతుంది. డ్యూయల్ సింస్, 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4 ఉన్నాయి. IP64 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.
ఎందుకు కొనాలి?
మిడ్-రేంజ్ ఫోన్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు కావాలంటే Xiaomi 14 CIVI మంచి ఆప్షన్. కెమెరాలు, పెర్ఫార్మెన్స్, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్. సేల్‌లో ₹25,999 ధరతో ఈ డీల్ సూపర్ వాల్యూ ఫర్ మనీ. గేమర్స్, ఫోటోగ్రాఫర్స్, డైలీ యూజర్స్ అందరికీ సరిపోతుంది. అమెజాన్ యాప్‌లో చూసి ఆర్డర్ చేయండి. EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ డీల్ మిస్ కాకండి!
Also Read: అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్విగ్గీలో ఎక్కువ డిస్కౌంట్ కావాలా? ఈ క్రెడిట్ కార్డ్స్ ఉంటే సరి