టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు అందరూ ఇంట్లో వైఫై ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు వచ్చిన నేపథ్యంలో అందరూ వైఫై ద్వారానే వాటిని కనెక్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు టీవీ కోసం వాడిన సెట్ టాప్ బాక్స్ లను ఇప్పుడు వైఫైతో రీప్లేస్ చేశారు. అయితే, వైఫైని 24 గంటలు ఆన్ లో ఉంచడం వల్ల, మరీ ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆఫ్ చేయకుండా ఉంచడం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఆరోగ్యం, కరెంట్ బిల్లు, డివైస్ లైఫ్ సహా పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. శాస్త్రీయంగా చూస్తే, మెజారిటీ అధ్యయనాలు వైఫై రేడియేషన్ తక్కువ స్థాయిలో ఉంటుందంటున్నారు. ఆరోగ్యానికి హాని చేయదని చెబుతున్నాయి. అయితే, కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వైఫై రూటర్లు రేడియోఫ్రీక్వెన్సీ రేడియేషన్‌ను విడుదల చేస్తాయి, ఇది నాన్-ఐయోనైజింగ్ రకం. తక్కువ స్థాయి ఎక్స్ పోజర్ వల్ల క్యాన్సర్, నిద్ర సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు రావు అంటున్నారు నిపుణులు. అయితే, కొన్ని అధ్యయనాలు, రిపోర్టులు హార్ట్ డిసీజెస్, నిద్రా డిజార్డర్స్, బ్రెయిన్ ట్యూమర్స్, ఇన్ఫర్టిలిటీ వంటి సమస్యలు సూచిస్తున్నట్లు వెల్లడిస్తున్నాయి. కానీ, ఇవి 30% కంటే తక్కువ ప్రభావం మాత్రమే. పిల్లలు, గర్భిణుల మీద కూడా కొంత ప్రభావం ఉన్నప్పటికీ, మరీ ప్రమాదకర స్థాయిలో ఉండదంటున్నారు.
వైఫై రూటర్ 24/7 ఆన్‌గా ఉంచడం వల్ల కరెంట్ బిల్లు స్వల్పంగా పెరుగుతుంది. సంవత్సరానికి సుమారు రూ. 400 నుంచి రూ. 500 అదనంగా భారం పడే అవకాశం ఉంటుంది. రాత్రిపూట వైఫై ఆఫ్ చేయడం వల్ల కాస్త కరెంటు భారం తగ్గే అవకాశం ఉంటుంది.
వైఫై రూటర్లు 24/7 పని చేయడానికి డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి, ఆఫ్ చేయకపోతే లైఫ్ పై పెద్ద ప్రభావం ఉండదు. కానీ, రాత్రి ఆఫ్ చేస్తే ఓవర్ హీటింగ్ తగ్గుతుంది. లైఫ్ పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆఫ్ చేస్తే మార్నింగ్ బూటప్ లో టైమ్ వేస్ట్ అవుతుంది. సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ మిస్ అవుతాయి కూడా.
వైఫై రూటర్ ఆఫ్ చేయకపోతే, హ్యాకర్లు రాత్రి వైఫై ఉపయోగించే అవకాశం ఉంది. కానీ, స్ట్రాంగ్ పాస్ వర్డ్ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంచెం ఎక్కువ విద్యుత్ వాడకం వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ పెరుగుతుంది.
శాస్త్రీయంగా హెల్త్ రిస్క్ తక్కువ అయినప్పటికీ, ఒకవేళ మీకు ఆందోళనగా ఉంటే రూటర్ ను బెడ్ రూమ్ నుంచి దూరంగా, అంటే కనీసం 5 నుంచి 10 మీటర్ల దూరం పెట్టడం మంచిది. లేదంటే రాత్రి టైమ్ లో ఆఫర్ చేయండి. ఇది మనసు ప్రశాంతి కోసం మంచిది.
Read Also: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!