Best Waterproof Phones | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 (Amazon Great India Festival 2025) సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమవుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, టెలివిజన్‌లు, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు ఇతర స్మార్ట్ ఉపకరణాలపై భారీ డిస్కౌంట్‌లు ఉన్నాయి.
వర్షకాలంలో సాగుతున్న ఈ ఫెస్టివల్ సేల్.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కొనడానికి సరైన సమయం. ఈ సేల్‌లో మంచి ఫీచర్లు, అందుబాటు బడ్జెట్ లోపు ధరలో లభించే టాప్ 5 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లను చూద్దాం. SBI కార్డ్‌లతో 10 శాతం అదనపు డిస్కౌంట్, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌తో మరింత ఆదా చేయవచ్చు.
1. వివో V60 5G
వివో V60 5G (8GB/128GB) అమెజాన్‌లో రూ. 36,999 ధరకు లభిస్తోంది. SBI క్రెడిట్ కార్డ్‌తో రూ. 2,450 తగ్గింపు తరువాత ఫోన్ ధర రూ. 34,549కి వస్తుంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌తో భారీగా రూ. 35,149 వరకు ఆదా చేయవచ్చు. ఈ ఫోన్ IP68/IP69 రేటింగ్‌తో నీరు, దుమ్ము నుంచి పూర్తిగా రక్షణ కలిగి ఉంది. ఇందులోని స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. 6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లే స్మూత్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
2. ఒప్పో రెనో 13 5G
ఒప్పో రెనో 13 5G (8GB/128GB) ధర రూ. 26,999. ఈ ఫోన్ ని SBI కార్డ్‌తో కొనుగోలు చేస్తే.. 10 శాతం తగ్గింపు అంటే రూ. 1,250 వరకు డిస్కౌంట్ పొందగలరు. అంటే ఫోన్ ధర రూ. 25,749కి తగ్గుతుంది. IP66 + IP68 + IP69 రేటింగ్‌తో ఈ ఫోన్ నీటిలో మునిగినా సమస్యలేమీ ఉండవు. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ గేమింగ్‌కు అద్భుతంగా పనిచేస్తుంది. ఫోన్ లోని 5,800 mAh బ్యాటరీ ఎక్కువ సమయం నడుస్తుంది. 50MP ట్రిపుల్ కెమెరాతో అద్భుతమైన ఫోటోలు తీయవచ్చు.
3. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G (8GB/128GB) ధర రూ. 22,344. SBI కార్డ్‌తో రూ. 1,250 తగ్గింపు తరువాత ధర రూ. 21,094కు తగ్గిపోతుంది. IP68 రేటింగ్‌తో నీరు, దుమ్ము నుంచి రక్షణ ఉంటుంది. 6.67-అంగుళాల డిస్‌ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్ సాఫ్ట్‌గా రన్ అవుతుంది. 5,500 mAh బ్యాటరీ 68W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఎక్కువ కాలం నడుస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ పవర్‌ఫుల్ పనితీరును అందిస్తుంది.
4. రెడ్‌మీ నోట్ 14 ప్రో 5G
రెడ్‌మీ నోట్ 14 ప్రో 5G (8GB/128GB) ధర రూ. 21,998. SBI కార్డ్‌తో 10% తగ్గింపు (రూ. 1,250 వరకు) పొంది, ధర రూ. 20,748కి తగ్గుతుంది. IP68 రేటింగ్‌తో నీటి నుంచి రక్షణ ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా అద్భుతమైన ఫోటోలను అందిస్తుంది. 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. 5,500 mAh బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.
5. రియల్‌మీ P3x 5G
ఈ ఫోన్ ఈ జాబితాలో అత్యంత తక్కువ బడ్జెట్ లో అందుబాటులో ఉంది. రియల్‌మీ P3x 5G (8GB/128GB) ధర రూ. 12,999. SBI కార్డ్‌తో రూ. 1,250 తగ్గింపు తరువాత ధర రూ. 11,749కి చేరుతుంది. ఈ ఫోన్ కి కూడా IP68 + IP69 రేటింగ్ ఉంటి. అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకుంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ వేగవంతమైన పనితీరును అందిస్తుంది. 6,000 mAh బ్యాటరీ కావడంతో గేమింగ్ కోసం కూడా ఉపయోగపడుతుంది. తక్కువ బడ్జెట్ అయినా 6.72-అంగుళాల డిస్‌ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తో స్మూత్ స్క్రోలింగ్‌ను అందిస్తుంది.
ఇప్పుడు వాటర్‌ప్రూఫ్ ఫోన్ ఎందుకు కొనాలి?
వర్షాకాలం, పండుగల సీజన్‌లో ఈ ఫోన్‌లు తక్కువ ధరలో లభిస్తున్నాయి. డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, నో-కాస్ట్ ఈఎంఐ (EMI)లతో ఈ ఫోన్‌లు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ త్వరగా అయిపోతోంది, కాబట్టి వెంటనే ఆర్డర్ చేయండి!
Also Read: అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్విగ్గీలో ఎక్కువ డిస్కౌంట్ కావాలా? ఈ క్రెడిట్ కార్డ్స్ ఉంటే సరి