Mobile Charging : మొబైల్ ఫోన్ వాడకంలో చార్జర్ ప్రత్యేకత వేరు. అందుకే అది తక్కువ వాట్స్ నుంచి అత్యంత స్పీడుగా ఛార్జింగ్ ఎక్కేలా ఎన్నో మొబైల్స్ వచ్చేసాయి. అయితే నిజానికి ఎంత ఖరీదైన ఫోన్ అయినా ఛార్జింగ్ విషయంలో తప్పులు చేస్తే మన్నికలో ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాకుండా కొన్నిసార్లు ఫోన్ పేలిపోవడం, కొన్నాళ్లకే బ్యాటరీ పాడైపోవడం లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటివి జరగకుండా ఫోన్ బ్యాటరీ లైఫ్ ను పెంచుకోవాలంటే కొన్ని టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే.
ఫోన్ బ్యాటరీ లైఫ్ ను పెంచుకోవాలంటే కొన్ని టిప్స్ తప్పనిసరి. బ్యాటరీను ఛార్జ్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొన్ని ముఖ్యమైన టిప్స్ పాటించాలి.
ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఎప్పుడు 20 శాతం నుండి 80 శాతం మధ్యలోనే ఉండాలి. జీరో శాతంకి వచ్చేటట్టు చేయడం లేదా 100% చార్జింగ్ ఎక్కించడం ఎప్పుడు ప్రమాదకరమైన విషయమని గుర్తుంచుకోవాలి. ఎక్కువగా ఛార్జ్ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఫోన్ ఎప్పుడూ 80% పైగా ఛార్జ్ చేయకూడదు. చార్జింగ్ ఒక్కసారి పెట్టిన తర్వాత 80% వచ్చేవరకు ఉంచాలి. అలా కాకుండా మధ్యలో ప్రతిసారి ఫోన్ చార్జర్ తీసేస్తూ మళ్ళీ చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ సమయంలో ఫోన్ వాడుకపోవటమే మంచిది. ముఖ్యంగా గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం వంటివి చేయడం వల్ల బ్యాటరీ వేడెక్కుతుంది. దీంతో బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది
ఎక్కువ వేడి ఉండే ప్రదేశాల్లో ఫోన్లు ఉంచుకోకూడదు. అలాగే ఈ ప్లేస్ ఛార్జ్ చేయకపోవడం మంచిది. గాలి ఎక్కువగా వీచే ప్రదేశంలో, సూర్యరశ్మి తగిలే ప్రదేశాల్లో ఫోన్స్ దూరంగా ఉంచడం మంచిది. అధిక ఉష్ణోగ్రతలు బ్యాటరీకు హాని కలిగించడమే కాకుండా బ్యాటరీ పేలే అవకాశాలను పెంచుతాయి.
ఈ రోజుల్లో ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్స్ ఎన్నో వచ్చేశాయి. దాంట్లో వైర్లెస్ చార్జర్స్ సైతం ఉన్నాయి. అయితే ఇవి ఫోన్లు త్వరగా ఛార్జ్ చేయడానికి ఉపయోగపడినప్పటికీ ఫోన్ బ్యాటరీ పైన ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం మాత్రం యూజర్స్ కే ఉంది. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే ఫోన్ బ్యాటరీ చెడిపోయే అవకాశం ఉంటుంది. బ్యాటరీ వేడెక్కడం, లైఫ్ తగ్గిపోవడం వంటి ప్రమాదాలు జరుగుతాయి.
ఫోన్ బ్యాటరీ ఎప్పటికైనా డీ గ్రేడ్ అవ్వక తప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే అసలు ఫోన్ బ్యాటరీ పనిచేస్తుందా.. దాన్లో ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయా అనే విషయాన్ని కచ్చితంగా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటే చాలు. ఛార్జ్ చేసే సమయంలో బ్యాటరీ ఒక్కసారిగా ఛార్జింగ్ తగ్గిపోవడం లాంటివి జరిగితే వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఫోన్ పూర్తిగా ఛార్జ్ చేయడం లేకపోతే డ్రైన్ చేసి నిల్వ ఉంచడం రెండూ హానికరమే.
అందుకే మొబైల్ ను కొనేటప్పుడే బ్యాటరీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బ్యాటరీకి తగిన చార్జర్ ను ఉపయోగించాలి. కంపెనీ చార్జర్ ను ఉపయోగించడం వల్ల బ్యాటరీ దెబ్బతీయకుండా ఉండే అవకాశం ఉంటుంది.