Karan Johar: బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కరణ్ జోహార్(Karan Johar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా దర్శకుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఘనత కరణ్ జోహార్ కు ఉంది. ఇక ఈయన కాఫీ విత్ కరణ్ అనే టాక్ షో ద్వారా కూడా ఎంతోమంది ప్రేక్షకులను తన మాట తీరుతో సందడి చేశారు. ఇలా తెరపై నవ్వుతూ అందరిని నవ్విస్తూ కనిపించే కరణ్ జోహార్ నవ్వు వెనక ఎంతో బాధ, ఆవేదన ఉందని తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ జోహార్ ఒంటరిగా ఉండటం చాలా కష్టం అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
కరణ్ జోహార్ 53 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు అయినప్పటికీ ఈయన ఇద్దరు పిల్లలకు తండ్రిగా మారారు. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన ఈయన పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ ఉన్నారు .అయితే మొదటిసారి ఒంటరితనం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తల్లి లేకుండా ఇద్దరి పిల్లలకు తాను తండ్రిగా మారానని, రేపు ఈ విషయం పిల్లలకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదని బాధపడ్డారు. ఒక్కోసారి ఒంటరితనం గురించి ఆలోచిస్తే భోజనం కూడా చేయాలనిపించదని తెలిపారు.
బహుశా దేవుడు తనకోసం ఇప్పటివరకు ఎవరిని పుట్టించలేదేమో.. ఒంటరిగా ఉండటం చాలా కష్టమని ఈయన వెల్లడించారు.. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఏదైనా ఒక వేడుక జరిగితే ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రిటీలందరూ కూడా వారి పార్ట్నర్స్ తో కలిసి ఎంతో సంతోషంగా వస్తే తాను మాత్రం ఒంటరిగా అన్ని కార్యక్రమాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నేషనల్ అవార్డు వేడుకలో భాగంగా అందరూ జంటగా వస్తే తాను ఒంటరిగా వెళ్లానని మీ ప్లస్ ఎక్కడ అంటూ ప్రశ్నించారని తెలిపారు. నా పిల్లల్ని తీసుకెళ్లడానికి వాళ్లు చిన్న వాళ్ళు, మా అమ్మను తీసుకెళ్లడానికి ఆమె అంత దూరం ప్రయాణించలేదు ఆ సమయంలో కూడా ఎంతో బాధ అనుభవించానని తెలిపారు.
నేషనల్ అవార్డు…
ఇక త్వరలోనే న్యూ ఇయర్ కూడా రాబోతుంది. న్యూ ఇయర్ వేడుకలలో భాగంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలందరూ వారి లైఫ్ పార్టనర్స్ తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఆ సమయంలో నేను మాత్రం ఒంటరిగా గడపాల్సి వస్తుంది అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.. ఈ విధంగా కరణ్ జోహార్ ఒంటరితనం గురించి చేసిన ఈ వ్యాఖ్యలపై నేటిజెన్లు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కరణ్ కెరియర్ విషయానికి వస్తే దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత దర్శకుడిగా ఈయన రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ పొందడమే కాకుండా ఈ సినిమాకు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నేషనల్ అవార్డును కూడా అందుకుంది.
Also Read: Thiruveer: ప్రీ వెడ్డింగ్ హిట్..మరో సినిమాకు కమిట్ అయిన తిరువీర్..పూర్తి వివరాలివే!