
Mobile Watch : ప్రస్తుతం మార్కెట్‌లోకి రోజుకో మోడల్ ఫోన్.. మోడల్‌కో ఫీచర్ అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా మోటోరోలా కంపెనీ ఒక కొత్తరకం మొబైల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమౌతోంది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. దీన్ని మనం కావాలన్నప్పుడు ఫోన్‌లా వాడుకోవచ్చు. బోర్ కొడితే.. చేతి వాచ్‌లా తొడుక్కోవచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటో చూద్దాం.
- ఈ ఫోన్ ఫుల్ హెచ్‌డీ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేతో 6.9 అంగుళాలు ఉంటుంది.
- ప్రత్యేక మెటల్‌తో తయారయ్యే ఈ ఫోన్‌ను ముందుకు, వెనక్కి ఫోల్డ్ చేసుకోవచ్చు.
- ఒక టేబుల్ స్టాండ్‌లా, ఒక హ్యాండ్ వాచ్‌లా కూడా బెండ్ చేసుకోవచ్చు.
- ఈ మొబైల్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ మోడల్ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
- ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ మొబైల్ త్వరలో మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది.