
World Cup Final : ఆస్ట్రేలియా- భారత్ మధ్య వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఉత్కంఠగా సాగుతోంది. తొలి బంతికే భయపెట్టాడు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్. నేరుగా బంతి రోహిత్ శర్మ ప్యాడ్లను తాకింది. అవుట్ కోసం ఆసీస్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. అంపైర్ మాత్రం అవుట్ ఇవ్వలేదు. దీంతో మ్యాచ్ ను ఉత్కంఠ చూస్తున్న భారత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బంతి లెగ్ వికెట్ కు దూరంగా వెళ్లింది . దీంతో ఆసీస్ కూడా రివ్యూకు వెళ్లలేదు.
రెండో ఓవర్ లో హేజల్ వుడ్ బౌలింగ్ కు వచ్చాడు. అతడికి రెండు ఫోర్లు కొట్టి హిట్ మ్యాన్ తన ఉద్దేశమేంటో స్పష్టం చేశాడు. మొదటి సిక్స్ కూడా హేజల్ వుడ్ బౌలింగ్ లో రోహిత్ శర్మ కొట్టాడు.
మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ తాను ఆడిన తొలి బంతికే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 3 వ ఓవర్ స్టార్క్ బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ అవుట్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. చివరికి 5వ ఓవర్ రెండో బంతికి స్టార్క్ బౌలింగ్ లోనే గిల్ (4 ) క్యాచ్ అవుట్ అయ్యాడు. తొలి భారత్ తొలి వికెట్ వద్ద కోల్పోయింది.