
Vaishnav Tej : మెగా ఫ్యామిలీకి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంది. మెగా కాంపౌండ్ లో అందరూ స్టార్ హీరోలు కావడంతో అక్కడ ఏ చిన్న విషయం జరిగినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతుంది. రీసెంట్ గా మెగా కాంపౌండ్ లో పెళ్లి భాజలు మోగిన సంగతి అందరికీ తెలిసిందే. గుట్టుగా ఉన్న తమ ప్రేమని పెళ్లి పీటల వరకు తీసుకువచ్చారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.
ఈ పెళ్లికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. వాటితో పాటుగా రీతు వర్మ.. మెగా ఫ్యామిలీకి సంబంధించి మరొక వార్త కూడా బాగా వైరల్ అయింది. వరుణ్ పెళ్లి సందర్భంగా మెగా వారు ఇచ్చిన ప్రతి పార్టీలో రీతు వర్మ కూడా కనిపించడంతో.. త్వరలో రీతు వర్మ మెగా హీరోల్లో ఎవరునో ఒకరిని పెళ్లి చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ జరిగాయి.
వరుణ్ పెళ్లి సందర్భంగా జరిగిన అన్ని వేడుకల తో పాటు అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ఇచ్చిన ప్రీ వెడ్డింగ్ పార్టీకి కూడా రీతు వర్మ వచ్చింది. దీంతో ఈ రూమర్స్ కి మరింత స్ట్రెంత్ చేకూరినట్లు అయ్యింది. అప్పట్లో నిహారిక పెళ్లి సందర్భంగా జరిగిన ఫంక్షన్స్ కి లావణ్య హాజరైంది.. తర్వాత మెగా కోడలు అయింది. రీతు వర్మ పరిస్థితి కూడా అంతేనంటూ నేటిజెన్లు తెగ కామెంట్లు పెట్టారు. అయితే ఈ విషయంపై నీతో వర్మ కానీ మెగా ఫ్యామిలీ కానీ స్పందించలేదు.
కానీ ఇప్పుడు వార్తలు మరింత వైరల్ అవ్వడంతో మెగా హీరో వైష్ణవ తేజ ఈ రూమర్స్ పై స్పందించాడు. ఆదికేశవ ప్రమోషన్స్ కోసం వరుస ఇంటర్వ్యూ లతో బిజీగా ఉన్న వైష్ణవ తేజ.. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రివిల్ చేశారు. లావణ్య త్రిపాఠి కి రీతూ వర్మ మంచి ఫ్రెండ్.. అందుకే ఆమె లావణ్య పెళ్లికి సంబంధించిన ప్రతి ఫంక్షన్ కి హాజరైంది. అంతేకానీ రూమర్స్ లో చెప్పినట్టు మరింకే విషయం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో y తమ రూటు మార్చి లావణ్య, రీతు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.