E-Paper
Advertisement

NASA:చంద్రుడిపైన చీకటి ప్రాంతాలపై నాసా కన్ను..

NASA:చంద్రుడిపైన చీకటి ప్రాంతాలపై నాసా కన్ను..
Advertisement
NASA

NASA gets photographs of dark places on moon

ప్రపంచంలో ఎక్కడైనా సూర్యకాంతి పడినచోట మాత్రమే వెలుగు ఉంటుంది. మిగతా ప్రాంతాలన్నీ చీకట్లోనే ఉంటాయి. కేవలం భూమిపైనే కాదు.. నక్షత్ర మండలంలో కూడా ఇలాగే జరుగుతుంది. అలా చీకటిగా ఉన్న ప్రాంతాలను కూడా స్టడీ చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. చంద్రుడిపై ఉన్న చీకటి ప్రాంతాలను NASA క్యాప్చర్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

చంద్రుడిలోని నార్త్, సౌత్ పోల్స్ అనేవి ఒక్కసారి కూడా సూర్యకాంతి తగలని ప్రాంతాలుగా మిగిలిపోయాయి. అందుకే అవి ఎప్పుడూ చీకటిగానే ఉంటాయి. చంద్రుడిలోని సౌత్ పోల్ ప్రాంతంలో నేలలో ఐస్ ఉంటుందని భావిస్తున్న నాసా శాస్త్రవేత్తలు.. 2025లోపు దానిని అన్వేషించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ అక్కడ గడ్డ కట్టిన ఐస్‌ను వెలికితీసి పరిశోధనలు చేస్తే మానవాళికి ఉపయోగపడే విషయం ఏదైనా బయటపడవచ్చని వారు భావిస్తున్నారు.

Advertisement

చంద్రుడిపై దొరికే నీరు.. ఆక్సిజన్‌గా, తాగే నీరుగా, ఫ్యూయల్‌గా కూడా మార్చుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ అంత చీకటిలో ఇలాంటి పరిశోధనలు అన్ని ఎలా చేయాలి అనేదానికి సమాధానం కనిపెట్టడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ పరిశోధనల కోసం సౌత్ కొరియాతో నాసా చేతులు కలిపింది. వారి దగ్గర నుండి చంద్రుడిపై చీకటి ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ ల్యాండ్ అవ్వచ్చు అనే సైట్స్ మ్యాపింగ్‌ను సంపాదించింది నాసా.

2022 డిసెంబర్‌లో కొరియా లాంచ్ చేసిన స్పేస్‌క్రాఫ్ట్ దురై.. చంద్రుడిపై ఉన్న చీకటి ప్రాంతాలను కూడా ఫోటో తీయడానికి ప్రయత్నించి కొంతవరకు సక్సెస్ అయ్యింది. ఈ షాడోక్యామ్‌ను తయారు చేయడానికి నాసానే కొరియాకు ఆర్థిక సాయం చేసింది. ఇది మామూలు కెమెరా కంటే 200 రెట్లు ఎక్కువ సెన్సిటివ్ ప్రాంతాలను క్యాప్చర్ చేయగలదు. సూర్యకాంతి లేని ప్రాంతాలను కూడా ఇది ఫోటో తీయగలుగుతుంది. ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ, మలిన్ స్పేస్ సైన్స్ సిస్టమ్స్ కలిసి ఈ కెమెరాను డెవలప్ చేశాయి.

Tags

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×