Google 27th Anniversary: సెర్చ్ ఇంజిన్ గూగుల్ 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ గూగుల్ హోమ్‌పేజీలో గతాన్ని గుర్తు చేసింది. హోంపేజీలో 1998లో తొలిసారి ఉపయోగించిన గూగుల్ లోగోను ప్రదర్శించింది. గూగుల్ ఉద్యోగులు ఈ చిరస్మరణీయ సందర్భాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. గూగుల్ బెంగళూరులో పనిచేస్తు్న్న ఓ మహిళ.. క్యాంపస్‌లో జరిగిన పార్టీకి సంబంధించి కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
“గూగుల్ పుట్టినరోజు శుభాకాంక్షలు! నిన్న మేము గూగుల్ ప్రయాణంలో మరో ఏడాది సెలబ్రేట్ చేసుకున్నాము. అధికారికంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న గూగుల్ వార్షికోత్సవం జరుపుకుంటాం. ఈ సంవత్సరం గూగుల్ 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంటే ప్రపంచాన్ని కనెక్ట్ చేసే, ఎంతో మంది సెర్చ్ చేసే గూగుల్ 236,000 గంటలకు పైగా పనిచేస్తుంది”అని గూగూల్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అప్రెంటిస్ కీర్తన లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు.
“బెంగళూరు ఆఫీసులో గూగుల్ పుట్టిన రోజు వేడుకలు అద్భుతంగా నిర్వహించారు. కేఫ్ ను అద్భుతమైన ఆహారంతో నింపేశారు. అన్ని గూగుల్ ను ప్రతిబింబించాల ఏర్పాటు చేశారు” అని కీర్తన తన పోస్టులో పేర్కొన్నారు.
“గూగుల్ లేకుండా ప్రపంచం ఎలా ఉంటుంది? తక్షణ సమాధానాలు లేవు, YouTube ట్యుటోరియల్స్ లేవు, మార్గనిర్దేశం చేసే మ్యాప్‌లు లేవు, మా పనిని కలిపి ఉంచే Gmail థ్రెడ్‌లు లేవు, వర్క్ లో సహాయం చేసే డాక్స్ లేవు. ఇది ఊహించడం కూడా కష్టంగా ఉంది. కానీ ఇక్కడ Google ఉంది. ప్రతిరోజూ బిలియన్ల మందిని ప్రేరేపించే సెర్చ్ ఇంజిన్ గూగుల్” అని ఆమె లింక్డ్ ఇన్ లో రాసుకొచ్చారు.
కీర్తన పోస్ట్‌పై స్పందిస్తూ ఒక వ్యక్తి..”పుట్టినరోజు శుభాకాంక్షలు, గూగుల్! 27 సంవత్సరాల్లో గూగుల్ ఆవిష్కరణలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే, నేను జీమెయిల్ లేకుండా జీవితాన్ని ఊహించలేను. అది నన్ను ప్రతిరోజూ కనెక్ట్ చేస్తుంది” అని పోస్టు పెట్టారు.
మరొకరు స్పందిస్తూ.. “పుట్టినరోజు శుభాకాంక్షలు, గూగుల్! గూగుల్ మ్యాప్స్ లేకుండా నా జీవితాన్ని నేను ఊహించలేను. ఎవరి సహాయం లేకుండా ప్రతిచోటకు వెళ్లడానికి అది నాకు సహాయపడుతుంది. “నా జీవితాన్ని సులభతరం చేసినందుకు ధన్యవాదాలు” అని మరో వ్యక్తి పోస్ట్ చేశారు.\
Also Read: Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
గూగుల్ ట్రెండ్స్ లో “గూగుల్ 27వ పుట్టినరోజు” అనే పదం ప్రజాదరణ పొందింది. ప్రత్యేక డూడుల్ ద్వారా గూగుల్ కంపెనీ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసింది.