BigTV English

BOYFRIEND FOR RENT: అద్దెకు గర్ల్‌ఫ్రెండ్ అండ్ బాయ్‌ఫ్రెండ్.. వాలెంటైన్స్ డే స్పెషల్

BOYFRIEND FOR RENT: అద్దెకు గర్ల్‌ఫ్రెండ్ అండ్ బాయ్‌ఫ్రెండ్.. వాలెంటైన్స్ డే స్పెషల్

BOYFRIEND FOR RENT: ప్రేమికుల దినోత్సవం.. లవర్స్‌కు పండుగ రోజు. ఈ డే కోసం ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ట్రిప్స్‌కు వెళ్లడం, గిఫ్ట్స్ ఇచ్చుకోవడం.. ఈరోజును మరింత స్పెషల్‌గా జరుపుకోవడానికి మరెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకరికొకరు ఐ లవ్యూ చెప్పుకొని తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. అయితే ఓ వైపు ప్రేమికులు ఈరోజున ఎంజాయ్ చేస్తుంటే.. సింగిల్స్ మాత్రం బాదపడుతుంటారు. తమకు కూడా బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అనుకుంటుంటారు.


ఇలానే గర్ల్‌ఫ్రెండ్ లేక బాధపడిన గురుగ్రామ్‌కు చెందిన ఓ యువకుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. షాకుల్ గుప్తా అనే యువకుడు వాలంటైన్స్ డే రోజున బాయ్‌ఫ్రెండ్ లేడని ఫీల్ అయ్యే అమ్మాయిలు తన సేవలను వినియోగిచుకోవచ్చని ప్రకటించాడు. తనకు జీవితంలో ఎదురైన అనుభవవంతో పాటు.. ఒంటరితనంతో బాధపడే వారి కోసం 2018లో అద్దెకు బాయ్ ఫ్రెండ్ అనే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చానని షాకుల్ గుప్తా వెల్లడించాడు.

తనను అద్దెకు తీసుకున్న మహిళ ఒంటరితనాన్ని పోగొట్టడమే కాకుండా, వారికి కబుర్లు చెప్పడం, గేమ్స్ ఆడడం, వంట చేసిపెట్టడం వంటివి చేస్తానని చెప్పాడు. ఇప్పటి వరకు 50 మంది అమ్మాయిలకు సేవలందించానని తెలిపాడు. తాను కేవలం అమ్మాయిల ఒంటరితనాన్ని దూరం చేయడానికి మాత్రమే అందుబాటులో ఉంటానని.. లైంగిక అవసరాల కోసం కాదని స్పష్టం చేశాడు. అయితే తాను సేవలందించినందుకు కొంత డబ్బులను తీసుకుంటానని వివరించాడు.


ప్రస్తుతం షాకుల్ గుప్తా ఒక్కడే కాదు.. ఇలాంటి వాళ్లు ఎందరో ఉన్నారు. అబ్బాయిలే కాకుండా.. అమ్మాయిలు కూడా ఇటువంటి సేవలను అందిస్తున్నారు. అయితే అందరినీ గుడ్డిగా నమ్మరాదని.. ఇలాంటి వారి వెనుక వ్యభిచార ముఠాల హస్తం ఉండే అవకాశం ఉందని పులువురు హెచ్చరిస్తున్నారు. అద్దెకు తీసుకోవాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×