HMD Skyline Mobile Phone Launching in July Month: నోకియా ఫోన్‌ల తయారీ కంపెనీ HMD గ్లోబల్ దాని రాబోయే ఫోన్ HMD స్కైలైన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ఫోన్ Nokia Lumia సిరీస్ క్లాసిక్ డిజైన్‌ను తిరిగి తీసుకువస్తోంది. ఇటీవల ఒక బెల్జియన్ రిటైలర్ ఫోన్ అధికారిక రెండర్‌ను లీక్ చేసింది. వీటి ఆధారంగా హెచ్‌ఎమ్‌డి స్కైలైన్ డిజైన్ పాత నోకియా లూమియా 920ని గుర్తుకు తెస్తుంది. ఇది బాక్సీ డిజైన్‌తో వస్తుంది. లీకైన చిత్రం ఫోన్‌ను పింక్ కలర్‌లో చూపిస్తుంది. వీటితో పాటుగా టిప్‌స్టర్ సుధాన్షు ఆంబోర్ మరొక బ్లాక్ కలర్ వేరియంట్‌ను వెల్లడించారు. ఫోన్ కచ్చితంగా రెండు కలర్ వేరియంట్‌లలో వచ్చే అవకాశం ఉంది.
HMD Skyline Features
హెచ్ఎమ్‌డి స్కైలైన్ ఫుల్ హెచ్‌డీ + OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుందని లీక్ సూచిస్తుంది. ఇది Qualcomm Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది మిడ్-రేంజ్ చిప్. ఇందులో 4,900mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ IP67-రేటింగ్‌తో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది వాటర్, డస్ట్ నుంచి రక్షిస్తుంది.
Also Read: Fastest Charging Mobiles: నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. 120W ఫాస్ట్ ఛార్జింగ్.. రాకెట్ కన్నా వేగం!
HMD ఈ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ కోసం వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంటుంది. ఇది LED ఫ్లాష్‌తో రెగ్టాంగిల్ మాడ్యూల్ కలిగి ఉంది. నివేదికల ప్రకారం ఈ ఫోన్‌లో 108MP మెయిన్ సెన్సార్ కెమెరా, అల్ట్రావైడ్ లెన్స్, మాక్రో లేదా డెప్త్ సెన్సార్ ఉండవచ్చు. దీనితో పాటు ఈ ఫోన్‌లో సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఉంటుంది.
హెచ్ఎమ్‌డి స్కైలైన్‌లో అండర్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలానే స్టీరియో స్పీకర్లు వంటి ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడితే Google మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది.
హెచ్ఎమ్డి స్కైలైన్ ధర విషయానికి వస్తే ఇందులో 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ వేరియంట్ కోసం దాదాపు €520 (సుమారు రూ. 47,427) చెల్లించాల్సి ఉంటుంది. లాంచ్ విషయానికి వస్తే నివేదిక ప్రకారం కంపెనీ ఈ ఫోన్‌ని ఈ నెలలో లాంచ్ చేయనుంది. అయితే దీని గురించి HMD గ్లోబల్ అధికారిక లాంచ్ తేదీ, ధరను ధృవీకరించలేదు.