BigTV English

Redmi Note 13 Pro Plus: షియోమీ స్పెషల్ సేల్.. 200 MP కెమెరా ఫోన్‌పై బెస్ట్ డీల్.. డిస్కౌంట్ ఎంతంటే..?

Redmi Note 13 Pro Plus: షియోమీ స్పెషల్ సేల్.. 200 MP కెమెరా ఫోన్‌పై బెస్ట్ డీల్.. డిస్కౌంట్ ఎంతంటే..?

Redmi Note 13 Pro Plus 5G Sale: షియోమీ ’10 ఇయర్స్ ఆఫ్ టుమారో సేల్‌’లో స్మార్ట్‌ఫోన్లపై బంపర్ డీల్స్ ప్రకటించింది. ఈ సేల్‌లో సమయంలో మీరు బెస్ట్ కెమెరాతో కూడిన ఫోన్లను మంచి ఆఫర్డ్‌బుల్ డీల్స్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో మీరు రెడ్‌మీ నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ మీరు భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫోన్‌లో 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్‌పై అందుబాటులో ఉన్న బంపర్ ఆఫర్‌లు,  దాని స్పెసిఫికేషన్‌లను చూద్దాం.


Redmi Note 13 Pro+ 5G
షియోమీ అధికారిక సైట్‌లో జరుగుతున్న 10 ఇయర్స్ ఆఫ్ టుమారో సేల్‌లో 12GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వేరియంట్ రూ. 34,999 ధరకు అందుబాటులో ఉంది. కానీ సేల్‌లో కంపెనీ హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపుపై రూ. 3,000 తక్షణ తగ్గింపును ఇస్తోంది.

Also Read: Heavy Discount On Mobile: 5G స్మార్ట్‌ఫోన్.. హెవీ డిస్కౌంట్.. కిక్కిస్తున్న ఫీచర్లు!


దీని ఆఫర్లు పొందిన తర్వాత ఫోన్ ధర రూ. 31,999కి తగ్గుతుంది.ఇది కాకుండా వినియోగదారులు Mi Exchangeలో రూ. 3,000 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఇది మాత్రమే కాదు మీకు కావాలంటే మీరు ఈ ఫోన్‌ను 9 నెలల నో-కాస్ట్ EMIపై కూడా కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మీ నోట్ 13 ప్రో స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ముందు భాగంలో 6.67-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.

ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా ఉంది. స్మార్ట్‌‌ఫోన్‌లో MediaTek డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్‌సెట్‌ ఉంది. ఇది 12GB వరకు LPDDR5 RAM + 512GB వరకు UFS3.1 స్టోరేజ్‌తో వస్తుంది. బ్యాటరీ, ఛార్జింగ్ వేగం గురించి మాట్లాడితే ఇది 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఛార్జింగ్ స్పీడ్‌కు సంబంధించి 19 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

Also Read: Fastest Charging Mobiles: నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. 120W ఫాస్ట్ ఛార్జింగ్.. రాకెట్ కన్నా వేగం!

ఈ రెడ్‌మీ ఫోన్‌‌లో అతిపెద్ద ఫీచర్ దానిలో కనిపించే కెమెరాలు. ఈ ఫోన్ బ్యాక్ LED ఫ్లాష్‌తో కూడిన మూడు కెమెరాలను కంపెనీ అందిస్తుంది. దీనిలో మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్‌లు. ఈ కెమెరా 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో లింకై ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం మీరు ఈ ఫోన్‌లో గొప్ప 16 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ను కూడా చూస్తారు.

Related News

Bytepe Tech Subscription: ప్రతి ఏడాది ఓ కొత్త ఫోన్ మీ సొంతం! కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.. ఎలాగంటే?

Nokia 800 Tough: 6 ఏళ్ల తరువాత మళ్లీ ఎంట్రీ ఇస్తున్న నోకియా టఫ్ ఫోన్.. కొత్త అప్‌గ్రేడ్లతో సూపర్ కమ్‌బ్యాక్

Vivo V60e: మిడ్ రేంజ్ ఫోన్‌లో 200MP కెమెరా, 6500mAh బ్యాటరీ… వివో వి60e లాంచ్

Amazon Diwali Sale: రూ47999కే ఐఫోన్ 15, వన్‌ప్లస్, శాంసంగ్‌పై బంపర్ డిస్కౌంట్లు.. అమెజాన్ దీపావళి బొనాన్జా సేల్

Itel A100C: నెట్‌వర్క్ లేకున్నా బ్లూటూత్ కాలింగ్.. ఇండియాలో ఐటెల్ తక్కువ బడ్జెట్ ఫోన్ లాంచ్

iphone 17 Discount: ఐఫోన్ 17పై తొలిసారి డిస్కౌంట్.. తక్కువ ధరలో తాజా ఫ్లాగ్‌షిప్‌.. ఎక్కడంటే?

Smartphone Comparison: గెలాక్సీ A07 vs లావా బోల్డ్ N1 vs టెక్నో పాప్ 9.. ₹10,000 కంటే తక్కువ ధరలో ఏది బెస్ట్?

Galaxy S25 Ultra Discount: గెలాక్సీ ప్రీమియం ఫోన్‌పై బ్లాక్‌బస్టర్ ఆఫర్.. S25 అల్ట్రాపై ఏకంగా రూ.59000 తగ్గింపు!

Big Stories

×