BigTV English

Kantara Chapter1: 400 కోట్లక్లబ్ లోకి కాంతార1 .. ఆగని కలెక్షన్ల సునామీ!

Kantara Chapter1: 400 కోట్లక్లబ్ లోకి కాంతార1 .. ఆగని కలెక్షన్ల సునామీ!

Kantara Chapter1: కన్నడ సినీ నటుడు రిషబ్ శెట్టి (Rishabh Shetty)తాజాగా నటించిన చిత్రం కాంతార చాప్టర్ 1(Kantara Chapter1). ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీ దసరా పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో సినిమా పట్ల అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు అనుగుణంగానే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు అన్ని భాషలలో మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా భారీ వసూలను రాబడుతోంది. ఈ సినిమా విడుదల అయ్యి కేవలం ఆరు రోజులు మాత్రమే అవుతుంది. ఈ ఆరు రోజులలోనే ఏకంగా 400 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టింది.


నార్త్ అమెరికాలో సంచలన రికార్డ్..

మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు పెద్ద ఎత్తున అభిమానులు ప్రేక్షకులు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కాంతార చాప్టర్ 1 సినిమా ఆరు రోజుల్లోనే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం సౌత్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది .అదేవిధంగా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. నార్త్ అమెరికాలో ఏకంగా మూడు మిలియన్ల డాలర్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజులలో ఈ సినిమా 427.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి 500 కోట్లకు దిశగా పరుగులు పెడుతుంది.

కన్నడ ఇండస్ట్రీలోనే రెండో సినిమాగా రికార్డ్..

ఇలా ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లను రాబట్టి కన్నడ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన రెండో సినిమాగా సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక ఈ సినిమా కాంతార సినిమాకు ప్రీక్వెల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా హోంభలే ఫిలిమ్స్ వారు నిర్మించారు. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టికి జోడిగా రుక్మిణి వసంత హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. గుల్షన్ దేవయ్య, జయరామ్ వంటి పలువురు కీలక పాత్రలలో నటించారు.


500 కోట్ల దిశగా కాంతార1..

ఇక ఈ సినిమాకు థియేటర్లలో వస్తున్న ఆదరణ చూస్తుంటే ఇప్పుడప్పుడే కలెక్షన్ల జోరు ఏ మాత్రం తగ్గేలా అనిపించట్లేదు. ఇక అక్టోబర్ నెలలో స్టార్ హీరోల సినిమాలు కూడా పెద్దగా విడుదల అవ్వని నేపథ్యంలో ఈ సినిమా మరింత కలెక్షన్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇక తెలుగులో దీపావళి పండుగను పురస్కరించుకొని పలు సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలకు మంచి పాజిటివ్ టాక్ వస్తేనే కాంతర కలెక్షన్ ప్రభావం చూపుతుంది లేదంటే కాంతార సినిమా చాలా సునాయసంగా 500 కోట్ల క్లబ్ లోకి అడుగుపెడుతుందని చెప్పాలి. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్ రన్ టైం లాక్…ఇంతసేపంటే కష్టమే జక్కన్న!

Manchu Family : మా పరువు తీశారు.. యూనివర్సిటీ సీజ్‌పై మంచు ఫ్యామిలీ రియాక్షన్

Mass Jathara: నీలో ఏదో ఉందే లీల.. చేసిందే నన్నే ఇలా.. హుడియో హుడియో సాంగ్ అదిరిపోయింది

ED Raids : ఇండస్ట్రీలో ఈడీ దాడులు… హీరోలే టార్టెట్..

Rajvir Jawanda: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సింగర్ మృతి

Pooja Hegde: ఒక్క హిట్ లేదు కానీ.. డిమాండ్ కు మాత్రం తక్కువ లేదు

Jana Nayagan: తొక్కిసలాట ఎఫెక్ట్.. జన నాయగన్ వాయిదా .. ?

Big Stories

×