BigTV English

CM Revanth Reddy on Gouds: గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి మారు పేరు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy on Gouds: గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి మారు పేరు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Speech in Katamaiya Raksha Kits: గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి మారు పేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం లష్కర్ గూడలో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన సేఫ్టీ కిట్లను గీత కార్మికులకు అందజేసిన అనంతరం సీఎం ప్రసంగించారు.


కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బలహీనవర్గాల గౌరవం పెరుగుతుందని గౌడన్నలు ప్రచారం చేశారు. కులవృత్తులకు చేయూత అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. గౌడన్నలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేస్తోంది. ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు చేపట్టేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రాష్ట్రంలో వనమహోత్సవంలో భాగంగా తాటి, ఈత చెట్ల పెంపకం చేపట్టాలని మంత్రి జూపల్లికి సూచిస్తున్నట్లు సీఎం తెలిపారు. చెరువు గట్లపై కూడా చెట్లు నాటలని ఇరిగేషన్ విభాగంతో మాట్లాడాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచించానని అన్నారు.

రహదారులు, చెరువుగట్లు, కాలువగట్ల వద్ద తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు తీసుకుంటాం. గౌడన్నల కులవృత్తిని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. కులవృత్తులపై ఆధారపడిన సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ పిల్లలను ఉన్నత చదువులు చదివించండి. వాళ్లను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దండి. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారు భాగస్వాములు కావాలి. చట్టాలు రూపొందించే స్థాయికి మీ పిల్లలు ఎదగాలి. బలహీన వర్గాలు పాలకులుగా మారాలంటే ఏకైక మార్గం చదువు మాత్రమే అని సీఎం అన్నారు.


Also Read: Cabinet sub Committee visits Warangal: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. త్వరలోనే..

త్వరలోనే హయత్ నగర్‌కు మెట్రో రాబోతుంది. ఇందుకు సంబంధించి అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయి. ఫార్మా కంపెనీల కోసం సేకరించిన భూమిలో వివిధ యూనివర్సిటీలు, మెడికల్ టూరిజం, పరిశ్రమలను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. న్యూయార్క్ నగరంతో పోటీ పడేలా మహేశ్వరంలో ఒక అద్భుతమైన నగరం నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఊటీ కంటే అద్భుతమైన రాచకొండ ప్రాంతాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి అణువుగా మార్చబోతున్నాం. రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతోంది. ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను తీర్చిదిద్దుతాం అని సీఎం అన్నారు.

Related News

Cough Syrups: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ రెండు దగ్గు మందులు బ్యాన్

Farmer Scheme: వ్యవసాయ భూమి ఉంటే చాలు.. ఈజీగా రూ.50వేలు పొందవచ్చు.. అప్లికేషన్ విధానం ఇదే..

Heavy Rains: భారీ వర్షాలు.. మరో మూడు రోజులు దంచుడే దంచుడు..

Ponnam And Adluri Comments: ముగిసిన మంత్రుల వివాదం.. అడ్లూరికి క్షమాపణ చెప్పిన పొన్నం..

Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు.. ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే

Fire Accident: నల్గొండ జిల్లా హాలియా SBIలో అగ్నిప్రమాదం..

Telangana politics: జూబ్లీహిల్స్ బైపోల్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం, ఈసారికి అలా ముందుకు

Ponnam Prabhakar: వివాదానికి ఫుల్‌స్టాప్.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

Big Stories

×