Nothing Phone 3 : టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కంపెనీ చెందిన నథింగ్ ఫోన్ 3 త్వరలోనే లాంఛ్ కు సిద్ధమవుతుంది. ఈ మొబైల్ ఫీచర్స్ లీకవటంతో ఇప్పటికే టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి రాబోతుందా అంటూ అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అసలు ఈ మెుబైల్ లాంఛ్ డేట్ ఎప్పుడు.. ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం.
బ్రిటన్ కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ త్వరలోనే మరో కొత్త మొబైల్ ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. నథింగ్ ఫోన్ 3 పేరుతో రాబోతున్న ఈ మొబైల్ లో సరికొత్త ఫీచర్స్ ఉండనున్నట్టు తెలుస్తుంది. AI- పవర్డ్ ప్లాట్‌ఫారమ్ ను ఈ మొబైల్ లో తీసుకురాటానికి నథింగ్ సన్నాహాలు చేస్తుందని… యూజర్ ఇంటర్ ఫేస్ లో సరికొత్త ఆవిష్కరణలు ఈ మొబైల్ తో మొదలుకానున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటి వరకూ ఎన్నో లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొచ్చిన ఈ సంస్థ.. కెమెరా ఫీచర్స్ తో పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ను మరింత మెరుగైన దిశగా తీసుకుపోయేందుకు సన్నాహాలు చేస్తుందని బ్రిటన్ కు చెందిన ఓ మ్యాగ్జైన్ తెలిపింది. అప్-స్కేలింగ్ దిశగా నథింగ్ తన అడుగులు మొదలుపెట్టిందని.. ఇక మీదట ఈ సిరీస్ లో మరిన్ని ప్రీమియర్ ఫీచర్స్ తో మొబైల్స్ రాబోతున్నాయని చెప్పుకొచ్చింది.
ఇక నథింగ్ కంపెనీ నుంచి Qualcomm Snapdragon 8 Gen 3 లేదా Snapdragon 8s Elite SoC చిప్ సెట్ తో మరిన్ని మెుబైల్స్ త్వరలోనే రాబోతున్నాయి. ఈ కంపెనీ నుంచి నథింగ్ ఫోన్ 3A తో పాటు నథింగ్ ఫోన్ 3A ప్లస్ మొబైల్స్ సైతం రాబోతున్నాయి. వీటితో పాటు నథింగ్ ఫోన్ 3 కూడా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
నథింగ్ ఫోన్ 3 మెుదటగా జూలై 2025లో లాంఛ్ కావొచ్చనే అంచనాలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ మెుబైల్ మార్చి లేదా ఏప్రిల్ మొదటి వారంలో లాంచ్ అవుతుందని తెలుస్తుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే టాప్ అప్ గ్రేడ్స్ తో రాబోతుంది.
Nothing Phone 3 Features –
డిస్‌ప్లే –
6.7-అంగుళాల AMOLED లేదా LTPO OLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్
HDR10+ సపోర్ట్
ప్రాసెసర్ –
Qualcomm Snapdragon 8 Gen 2 లేదా పోటైబుల్ ఆండ్రాయిడ్ 13 స్టాండర్డ్స్
క్యామెరా –
పింట్ కెమెరా : 50MP (ఇది తాజా ఫ్లాగ్‌షిప్ కెమెరా)
వైడ్-అంగుల్ : 12MP/50MP
ప్రైమరీ : 12MP లేదా 108MP
వీడియో రికార్డింగ్ : 4K 60fps
RAM + స్టోరేజ్ –
8GB/12GB RAM
128GB/256GB స్టోరేజ్
బ్యాటరీ –
5000mAh బ్యాటరీ
67W ఫాస్ట్ చార్జింగ్
50W వారియర్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్ –
Android 13 ఆధారిత Nothing OS
డిజైన్ –
పారదర్శక బ్యాక్ ప్యానెల్
LED గ్లో అవుట్ ఫీచర్ (మినిమల్ లైటింగ్ ఎఫెక్ట్)
మెటల్ ఫ్రేమ్
కనెక్టివిటీ –
5G, Wi-Fi 6E, Bluetooth 5.3, NFC, USB Type-C
ధర –
రూ.40,000 – రూ.50,000 మధ్య ఉండే ఛాన్స్
ఇతర ఫీచర్లు –
IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ
హైడిన్ ఇంప్లిమెంటేషన్ టెక్నాలజీతో ఈ మెుబైల్ రాబోతుంది.
ALSO READ : పోకో X7 ప్రో ఫస్ట్ సేల్ ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే!