BigTV English
Advertisement

One Plus 13 : రేపే వన్ ప్లస్ 13 లాంఛ్.. దుమ్మురేపుతున్న ధర, స్పెషిఫికేషన్స్

One Plus 13 : రేపే వన్ ప్లస్ 13 లాంఛ్.. దుమ్మురేపుతున్న ధర, స్పెషిఫికేషన్స్

One Plus 13 :  ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ మెుబైల్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. వన్ ప్లస్ 13 మెుబైల్ లాంఛ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మెుబైల్ అక్టోబర్ 23న చైనాలో లాంఛ్ కాబోతుందని.. అక్టోబర్ 31న పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతుందని తెలిపింది. ఇక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ తో రాబోతున్న ఈ స్మార్ట్ మెుబైల్ విడుదలకు ముందే భారీ అంచనాలను రేకెత్తించింది.


చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్.. ఆ దేశంలో నిర్వహించిన వన్ ప్లస్ ఈవెంట్ లో వన్ ప్లస్ టీజర్ ను లాంఛ్ చేసింది. ఈ ఫోన్ అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా రాబోతుందని తెలుపుతూ ఈ ఫోన్ స్పెషిఫికేషన్స్ వివరించారు. వన్ ప్లస్ 13 ఫీచర్స తో పాటు ఇందులో ఉపయోగించిన  స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ పనితీరు, శక్తి సామర్థ్యాలను సైతం పూర్తి స్థాయిలో వివరించారు.

స్పెషిఫికేషన్స్ –


కెమెరా – వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ ను ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో డిజైన్ చేశారు. అడ్వాన్స్డ్ కెమెరా సిస్టమ్ HASSELBLAD సపోర్ట్ తో కెమెరా సెటప్ చేసినట్లు తెలుస్తుంది. ఇక క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ తో ఈ స్మార్ట్ ఫోన్ రాబోతుంది.

చిప్‌సెట్‌ – వన్ ప్లస్ 13 మెుబైల్ నెక్స్ట్ జెన్ చిప్‌సెట్‌తో రాబోతుంది. ఈ మెుబైల్ను 24GB LPDDR5 x RAM, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌ ను పెంచుకునే విధంగా డిజైన్ చేశారు. ఈ స్థాయిలో మెమరీని విస్తరించే అవకాశం ఉన్న మొదటి Android ఫ్లాగ్‌షిప్‌గా ఈ మెుబైల్ రాబోతుంది. ఇక మెుబైల్ సామర్థ్యం , శక్తిని అంచనా వేసి ఎప్పటికప్పుడు బూస్టింగ్ ఇచ్చే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ ను ఇందులో అమర్చారు. ఇందులో మరో స్పెషిఫికేషన్… ColorOS 15 ను సపోర్ట్ చేసే OnePlus Tidal Engine. ఇది చిప్ సెట్ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది.

ALSO READ : AI లేదు తొక్కాలేదు.. అదేంటీ యాపిల్ సీఈవో అంత మాట అనేశారు!

స్లీక్ డిజైన్ తో రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం మెటల్ ఫ్రేమ్ తో తయారు చేసినట్లు తెలుస్తుంది. తక్కువ ఎడ్జెస్ తో స్క్రీన్ డిజైన్ అదిరిపోయేలా ఈ ఫోన్ ను డిజైన్ చేశారు. టైప్ C ఛార్జ్ సపోర్ట్, డ్యూయల్ స్పీకర్స్ అందుబాటులో ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ ను స్పెషల్ గా డిజైన్ చేశారు. బ్లాక్, బ్లూ, వైట్ ఇలా మూడు కలర్స్ లో ఫోన్ అందుబాటులోకి రాబోతుంది.

ఇక ఇప్పటికే రిలీజ్ అయ్యి హాట్ కేక్స్ లా అమ్ముడుపోయిన వన్ ప్లస్ 12 మెుబైల్ తో పోల్చితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో ఈ మెుబైల్ లాంఛ్ కాబోతుంది. దీంతో ధర సైతం ఎక్కువ స్థాయిలోనే ఉండవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వన్ ప్లస్ 12 మెుబైల్ 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర చైనాలో రూ. 50,800 ఉండగా.. అదే వేరియంట్ ఇండియాలో రూ. 64,999 కు అందుబాటులోకి వచ్చింది. ఇక ఇప్పుడు వన్ ప్లస్ 13 ధర సైతం ఇంతకంటే ఎక్కువగానే ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

 

Related News

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Flight Mode: మీ ఫోన్లో దాగున్న సూపర్ ఫీచర్.. ఫ్లైట్‌మోడ్‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?

AI Smart Glasses: సోనీ కెమెరా, AI అసిస్టెంట్‌.. లెన్స్‌ కార్ట్ స్మార్ట్‌ గ్లాసెస్‌ చూస్తే మతిపోవాల్సిందే!

OPPO A6 Pro Mobile: 7000 mAh భారీ బ్యాటరీతో ఒప్పో ఎంట్రీ.. ఏ6 ప్రో 5జి ఫుల్ డీటెయిల్స్ ఇండియాలో ఇవే..

Big Stories

×