BigTV English

Duvvada Srinivas Biopic: దువ్వాడ శ్రీనివాస్ బయోపిక్.. రంగంలోకి ఆర్జీవీ

Duvvada Srinivas Biopic: దువ్వాడ శ్రీనివాస్ బయోపిక్.. రంగంలోకి ఆర్జీవీ

అప్పటివరకు ఎప్పుడు టెక్కలిలోని నేషనల్ హైవేకి ఆనుకుని నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను(Duvvada Srinivas) ఇల్లు చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండేది. 2024 ఆగస్టు 7న ఒక్కసారిగా ఆ ఇళ్లు అతని కుటుంబం తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా.. దువ్వాడ శ్రీను భార్య దువ్వాడ వాణి(Duvvada Vani), కూతురు జాహ్నవితో కలిసి దువ్వాడ శీను ఇంట్లోనికి వెళ్లి ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత నెల రోజులు కంటిన్యూగా ఇంటిముందు ఆందోళనలు నిర్వహించారు. దాంతో దువ్వాడ కుటుంబ కథా చిత్రం అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.

దువ్వాడ శ్రీనుపై భార్య వాణి, కుమార్తెలు చేసిన ఆరోపణలు, చేసిన నిరసనలు, చూపించిన వాట్సప్ మెసేజ్ లు, ఆస్తుల వ్యవహారాలు, పార్టీ ఆఫీస్ పంచాయతీలు ఒకెత్తు అయితే దివ్వెల మాధురి(divvela madhri) తో దువ్వాడ రిలేషన్ మరింత రచ్చకు దారి తీసింది. ఎలాగో అందరికీ తెలిసింది కదా అని దువ్వాడ పెయిర్ ఓపెన్ అయిపోయి బహిరంగంగా తిరగడం మొదలుపెట్టారు. పెళ్లీడు పిల్లలున్న సిక్ట్సీ ప్లస్ దువ్వాడ తన భార్య వాణికి విడాకులిస్తానని.. మాధురితోనే ఉంటానని ఆ వయస్సులో సిగ్గుపడకుండా ప్రకటించారు.


వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు అయిన దువ్వాడ తన కెరీర్ మొత్తంలో ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. అయితే ప్రత్యర్థులు ఎంతటి వారైనా నోరేసుకుని పడిపోయే ఆయన్ని జగన్ పిలిచి మరీ ఎమ్మెల్సీని చేశారు. ఒక విక్టరీ కూడా ఇవ్వని పాలిటిక్స్ బోరు కొట్టాయో ఏమో ఇప్పుడు దువ్వాడ ఫీల్డ్ మార్చేయడానికి రెడీ అయ్యారు. దివ్వల మాధురి ఎంట్రీతో ఇప్పటికే కొత్త అవతారమెత్తిన ఆయన .. వాలంటీర్ అనే సినిమాలో యాక్షన్ హీరోగా యాక్ట్ చేశారు. తాజాగా తన కథని బయోపిక్ తీయడానికి సిద్ధం అయిపోయారు.

నెల రోజులు ఆందోళన చేసిన దువ్వాడ వాణి ఇక అతనితో వేస్ట్ అనుకుని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయారు. దువ్వాడ శ్రీను మాత్రం దివ్వల మాధురిని ఇంట్లో పెట్టుకుని కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. ఇది వ్యక్తిగతంగా వాళ్లకు కరెక్ట్‌ ఏమో కాని.. ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ప్రేయాయణం మాత్రం వైసీపీకి తలనొప్పిగా మారింది. వైసీపీలో దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉండడంతో ఇప్పుడు ఫ్యామిలీ వ్యవహారం రాజకీయ వ్యవహారంగా మారిపోయింది. దువ్వాడ శ్రీను ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయరని.. అటు వైసీపీ వారే ప్రశ్నిస్తున్నారు.

Also Read: విడాకులపై మళ్ళీ స్పందించిన సమంత.. అలా ఉండాల్సిందంటూ కామెంట్..!

దువ్వాడ శ్రీను మాత్రం ఇప్పటివరకు టెక్కలికే పరిమితమైన తమ లవ్ స్టోరీని.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మాధురితో చట్టపట్టాలేసుకుని తిరుగుతూ మరింత రచ్చ రేపుతున్నారు. దాంతో దువ్వాడని వైసిపి నుంచి సస్పెండ్ చేయాలా, పార్టీ నుంచి బహిష్కరించాలా, పార్టీలోనే కొనసాగించాలా ఏం చేయాలో అర్థం కాక వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ఆలోచనలో పడ్డారంటున్నారు. స్వయంగా దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురి వెళ్లి జగన్ని కలిసినా ఆయన వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంది

రాష్ట్రవ్యాప్తంగా రచ్చకు దారి తీసినా దాన్ని పట్టించుకోకుండా దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురిలు ప్రతిరోజు కొత్త కొత్త రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. ఆ వయస్సులో వారి ప్రేమాయణం ఏంటో? అసలు వారి ఆలోచన ఎంటో ఎవరికీ అర్థం కాకపోయినా ఆ సోషల్ మీడియా పిచ్చే ఇప్పుడు దివ్వెల మాధురికి కేసులు రూపంలో మెడకు చుట్టుకుంటుంది. ఆ జంట తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు మాడ వీధుల్లో మాధురి రీల్స్ చేయడంతో తిరుపతి పోలీసులు కేసు పెట్టి నోటీసులు ఇచ్చారు. వారిపై వ్యక్తిగతంగా నమోదైన కేసులు ఇప్పుడు వైసీపీకి కూడా చుట్టుకుంటున్నాయి. దువ్వాడ శ్రీనుతో వైసిపి పార్టీకి ఏం లాభమో తెలియదు గాని ప్రస్తుత పరిస్థితుల్లో దువ్వాడ శీను, మాధురిల వ్యవహారం పార్టీకి తీవ్ర నష్టం వచ్చేలా ఉందని పార్టీ వర్గాలు వాపోతున్నాయి.

దువ్వాడ శ్రీను(Duvvada Srinivas) కుటుంబ వివాద వ్యవహారం, వైసీపీలో రాజకీయ దుమారం, తిరుమలలో మాధురిపై కేసులు ఇన్ని నడుస్తున్న ఎక్కడ కూడా దువ్వాడ శ్రీను, మాధురీలు అదరడం బెదరడం లేదు. లేటెస్ట్‌గా తన ప్రియుడు దువ్వాడ శ్రీను బయోపిక్ తీయడానికి సిద్ధమైపోయింది మాధురి.. గతంలో దువ్వాడ శ్రీను ని హీరోగా పెట్టి వాలంటీర్ అనే సినిమా తీసిన దివ్వెల మాధురి ఇప్పుడు ఏకంగా దువ్వాడ శ్రీను బయోపిక్ తీయడానికి చర్చలు జరుపుతున్నారంట. ఆప్పటికీ రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) లాంటి కాంట్రవర్సీ డైరెక్టర్ దువ్వాడ శ్రీనుతో నేరుగా చర్చలు జరిపి సినిమా తీస్తానని.. అతని కుటుంబ కథపై రైట్స్ ఇవ్వాల్సిందిగా కోరారు.

అంతేకాదు టెక్కలిలో దువ్వాడ శ్రీను ఉంటున్న ఇంట్లో మాధురితో సమావేశమై ఇద్దరు డైరెక్టర్లు కథ కూడా వినిపించేశారు. సినిమాల మీద మోజో పబ్లిసిటీ ఆరాటమో తెలియదు గానీ దువ్వాడ శ్రీను ని వెంటబెట్టుకుని మాధురి నేరుగా హైదరాబాద్ వెళ్లి సినీ డైరెక్టర్ తో సిట్టింగ్ వేసేసారు. ఒకరిద్దరు డైరెక్టర్లకు దువ్వాడ శ్రీను జీవిత గాధతో పాటు మాధురి ఎపిసోడ్ కూడా చక్కగా చెప్పేసి.. కథ, డైలాగులు రెడీ చేసుకోమని చెప్పి వచ్చారంట. ఆ సినిమాలో ఫస్టాఫ్ అంతా దువ్వాడ బాల్యం, వ్యాపారం, వివాహం, రాజకీయం మొదలైన అంశాలను కట్టె కొట్టే తెచ్చే అన్నట్లుగా చూపించి. దివ్వెల మాధురితో పరిచయం ఇంటర్వెల్ ట్విస్ట్ గా సెట్ చేసి.. ఇక సెకండాఫ్ అంతా దివ్వెల మాధురితో – దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas, Devvela Madhuri)బంధం ఎలా ఎదిగిందో చూపించాలనేది ప్రొడ్యూసరమ్మ గారి ప్లాన్ అంట.

ఒక సినిమాలో కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చిన ఈ వయసులో నువ్వు హీరో ఏంటి అని డైలాగ్ ఉంటుంది. సరిగ్గా దానికి అతికినట్లు 60 ప్లస్ ఏళ్ల వయసులో దువ్వాడ శ్రీనుని హీరోగా పెట్టి బయోపిక్ తీస్తానని మాధురి అంటుండటం ఇండస్ట్రీ వారికే చికాకు తెప్పిస్తూ ఆ డైలాగ్ గుర్తు చేసుకుంటున్నారంట.  అదలా ఉంటే ఈ బయోపిక్ వ్యవహారాన్ని వైసిపి నేతలు జీర్ణించుకోలేక పోతున్నాయంట. ఉన్న దువ్వాడ శ్రీనుని వైసిపికి దూరంగా పెట్టలేకపోయినా.. బయోపిక్‌లో మాత్రం వైసిపి ప్రస్తావన లేకుండా చూడమని ఆ జంటకు సచిస్తున్నారంట. మొత్తానికి కట్టుకున్న వారిని, కన్న పిల్లల్ని వదిలేసిన ఆ ప్రేమ జంట బయోపిక్ ప్రయోగంతో వైసీపీ నేతలకు కలల్లోకి వచ్చి భయపెడుతున్నారంట.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×