Tim Cook About AI: ప్రపంచ టెక్ దిగ్గజంగా కొనసాగుతున్న ఆపిల్ సంస్థ AI టెక్నాలజీ విషయంలో అంత దూకుడుగా వెల్లడం లేదు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు AIను విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఆపిల్ మాత్రం AI విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఆపిల్ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 16తో AI టెక్నాలజీ ల్యాండ్ స్కేప్ లోకి ఎంట్రీ ఇచ్చింది. AI ఉపయోగించుకోవడంలో ఆపిల్ సంస్థ వెనుకబడి ఉందని గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఈవో టిక్ కుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంపెనీ ఏ నిర్ణయం తీసుకున్నా దీర్ఘకాలిక ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయన్నారు.
ఫస్ట్ కాదు, బెస్ట్ గా ఉండాలి!
ఇటీవల ది వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టిమ్ కుక్ AI గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఫస్ట్ రావడం ముఖ్యం కాదు, బెస్ట్ గా రావాలన్నారు. AI విషయంలో మాత్రమే కాదు, తమ కంపెనీ నుంచి వచ్చే ప్రతి ప్రొడక్ట్ విషయంలో ఇదే సూత్రాన్ని ఫాలో అవుతామని చెప్పారు. “నా ఉద్దేశం ప్రకారం ఫస్ట్ రావడం కాదు, బెస్ట్ గా రావడం ముఖ్యం. ఈ సూత్రం కేవలం AI విషయంలోనే కాదు, ఆపిల్ కంపెనీ నుంచి వచ్చే ప్రతి ప్రొడక్ట్ విషయంలోనూ ఫాలో అవుతుంది. ఏదైనా మార్కెట్ లో మొదటి స్థానంలో ఉండాలనే ఉద్దేశ్యంతో కాకుండా, నిజంగా ప్రజల జీవితాలను మెరుగు పరుస్తుందా? లేదా? అనేది చూడాలి. ఆపిల్ అసాధారణ ఉత్పత్తులను రూపొందించేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తుంది” అని చెప్పుకొచ్చారు.
టెక్నాలజీని డిఫరెంట్ గా అందిస్తాం!
ఎదుటి వారు చెప్పేది విని, మనం చేయాల్సింది చేయాలన్నారు టిమ్ కుక్. “మనం వంద మందితో మాట్లాడితే వంద రకాల విషయాలు చెప్తారు. మనం ఒకటి మాత్రమే చేయగలుగుతాం. ఆ ఒక్కటి బెస్ట్ గా ఉండాలనేది నా ఉద్దేశం. ఆపిల్ ఇంటెలిజెన్స్ వినియోగదారులకు డిఫరెంట్ అనుభావాన్ని అందిస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ని iPod క్లిక్ వీల్, iPhone టచ్ ఇంటర్ ఫేస్ లో ఉపయోగించాం. ఇది టెక్నాలజీలో సరికొత్త ముందడుగుగా భావిస్తున్నాం” అన్నారు టిమ్ కుక్.
రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు!
“ప్రస్తుతం ప్రపంచంలో ఆపిల్ ఉత్పత్తులు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. మార్కెట్లో బెస్ట్ గా ఉన్నాయి. రేపటి టెక్నాలజీని ఈ రోజు కావాలని కోరుకుంటున్నారు. చాలా మంది ఇదే ఆలోచనలో ఉన్నారు. ఎందుకు? ఎవరిక కోసం? అనేది వారికి తెలియదు. ఆపిల్ నుంచి వచ్చిన ఏ ఉత్పత్తి కూడా ఇప్పటి వరకు ఓవర్ నైట్ సక్సెస్ అందుకోలేదు. వాటి వెనుక సంవత్సరాల కష్టం ఉంది. ఓవర్ నైట్ సక్సెస్ అయ్యేది తాత్కాలికం అని గుర్తుంచుకోవాలి. విజన్ ప్రొడక్ట్స్ అనేవి ఏవి కూడా రాత్రికి రాత్రే సక్సెస్ కావు. జనరేటివ్ ఏఐ సాఫ్ట్ వేర్ ఫీచర్లపై ఆపిల్ మరింత లోతుగా పరిశోధన కొనసాగుతుంది” అని టిమ్ కుక్ అభిప్రాయపడ్డారు.
Read Also: వాట్సాప్ లో సరికొత్త ఫీచర్, మర్చిపోయిన విషయాలు గుర్తు పెట్టుకుంటుంది తెలుసా?