OnePlus 13 vs iPhone 16 : టాప్ స్మార్ట్ ఫోన్ కంపెనీలు వన్ ప్లస్, ఐఫోన్.. తాజాగా రెండు మెుబైల్స్ ను లాంఛ్ చేశాయి. ఈ మెుబైల్స్ అదిరిపోయే లేటెస్ట్ ఫీచర్స్ తో వచ్చేశాయి. మరి వీటిలో బెస్ట్ మెుబైల్ ఏది? రూ.70వేల నుంచి 80వేల బడ్జెట్లో మెుబైల్ కొనాలనుకునే వారికి ఏది బెస్ట్ ఆఫ్షన్ చూద్దాం.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్.. తాజాగా వన్ ప్లస్ 13 మెుబైల్ ను ఇండియాలో లాంఛ్ చేసింది. ఈ మెుబైల్ ధర రూ. 69,999. ఇక 2024 సెప్టెంబర్ లో యాపిల్ కంపెనీ లాంఛ్ చేసిన ఐఫోన్ 16 స్టార్టింగ్ ధర రూ. 79,990గా ఉంది. నిజానికి ఈ రెండు మొబైల్స్ ధరల్లో రూ. 10000 తేడా ఉన్నప్పటికీ ఫీచర్స్ దాదాపు సమానంగానే ఉన్నాయి. ఇక రూ. 80,000 బడ్జెట్ లో బెస్ట్ మెుబైల్ కొనాలనుకుంటే.. ఇతర ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు OnePlus 13, iPhone 16 కూడా ట్రై చేసేయండి.
వన్ ప్లస్ 13, ఐఫోన్ 16.. ఈ రెండు మెుబైల్స్ లో “Apple” ఫోన్‌ను కొనాలనుకుంటున్నారా లేదా OnePlus ఫ్లాగ్‌షిప్ లో బెస్ట్ మెుబైల్ కొనాలనుకుంటున్నారా.. అనే విషయం పూర్తిగా యూజర్ ఛాయిస్ అయినప్పటికీ అసలు ఈ మెుబైల్స్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి? వాటి స్పెసిఫికేషన్స్ ఏమైనా దగ్గరగా ఉన్నాయో తెలుసుకుందాం.
OnePlus 13 vs iPhone 16 Features –
డిజైన్ –
OnePlus 13 8.5mm మందం, 210 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఇది సిరామిక్ గార్డ్ ప్రొటెక్షన్, IP68/69 రేటింగ్‌తో వచ్చేసింది. మరోవైపు iPhone 16 7.8mm మందం, 170 గ్రాముల బరువు ఉంది. ఇది సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ తో IP68 రేటింగ్‌తో వచ్చేసింది.
డిస్ ప్లే –
OnePlus 13 6.82 అంగుళాల LTPO 4.1 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1440 x 3168 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, డాల్బీ విజన్, 10-బిట్ కలర్స్ కు సపోర్ట్ చేస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సైతం ఉంది.
iPhone 16లో 6.1-అంగుళాల OLED ప్యానెల్, 1179 x 2556 పిక్సెల్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, HDR10, డాల్బీ విజన్ సపోర్ట్‌తో వచ్చేసింది. ఇందులో 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మాత్రమే ఉంది.
ప్రాసెసర్ –
OnePlus 13 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 1TB స్టోరేజ్, 24GB RAMతో పనిచేస్తుంది. iPhone 16 లేటెస్ట్ A18 చిప్‌తో పాటు 8GB RAM + 512GB స్టోరేజ్ తో పనిచేస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు తాజా UI స్కిన్‌లపై పనిచేస్తాయి.
కెమెరా –
ఫోటోగ్రఫీ కోసం OnePlus 13లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఐఫోన్ 16లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ మాత్రమే ఉన్నాయి.
బ్యాటరీ – ఛార్జింగ్ –
OnePlus 12లో 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీ ఉన్నాయి. ఐఫోన్ 16లో 3561mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఉన్నాయి.