Oneplus 15 vs iQOO 15| ఒకే నెలలో రెండు కొత్త భారీ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వన్‌ప్లస్ 15 5G, iQOO 15 5G బెస్ట్ ఫీచర్లతో మంచి పర్‌ఫామెన్స్ హామిని ఇస్తున్నాయి. రెండు ఫోన్‌లు లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నాయి. కానీ వినియోగపరంగా భిన్న ఫిలాసఫీ ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఒక్కటి రోజుంగా ఎంటర్‌టైన్మెంట్ కోసం సూపర్ గా ఉంటే.. మరొకటి ప్యూర్ గేమింగ్ ఆయుధంగా రూపొందించబడింది. కానీ రెండింటిలో ఏ ఫ్లాగ్‌షిప్ కొనాలో ఫీచర్ల పరంగా పోలిక చూద్దాం.
వన్‌ప్లస్ 15లో 6.78 అంగుళాల LTPO AMOLED ప్యానెల్ ఉంది. 1-165Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ బ్యాటరీని సేవ్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్‌తో అద్భుతమైన కలర్లు, మంచి బ్రైట్‌నెస్ ఉంది. iQOO 15లో 6.85 అంగుళాల LTPO AMOLED 2K స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గేమింగ్‌లో వేగమైన రెస్పాన్స్ మెరుగ్గా ఉంటుంది. రెండు స్క్రీన్‌లు బయట వెలుగులో బ్రైట్‌గా కనిపిస్తాయి. iQOO 15లో 6,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HBMలో 2,600 నిట్స్ ఉంది.
రెండు ఫోన్‌లు ఒకే టాప్-స్పెక్ ప్రాసెసర్‌తో వస్తాయి. కానీ కూలింగ్ టెక్నాలజీలు భిన్నంగా ఉన్నాయి. వన్‌ప్లస్ 15లో పెద్ద ‘ఐస్ రివర్’ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. దీర్ఘకాలిక గేమింగ్ సెషన్‌లలో మంచి పనితీరును చేస్తుంది. iQOO 15లో డ్యూయల్-చిప్ డిజైన్ ఉంది. ఇందులోని డెడికేటెడ్ గేమింగ్ చిప్ భారీ పనులను చేస్తుంది. ఫ్రేమ్ రేట్లు మెరుగ్గా, ల్యాగింగ్, స్టటర్ తగ్గుతాయి. iQOO సాఫ్ట్‌వేర్‌లో ఎక్కువ గేమింగ్ ఫైన్-ట్యూనింగ్ ఆప్షన్‌లు ఉన్నాయి.
వన్‌ప్లస్ 15లో ట్రిపుల్ 50MP కెమెరా సిస్టమ్ ఉంది. హస్సెల్‌బ్లాడ్ పార్ట్‌నర్‌షిప్‌తో 3.5x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ వర్సటైల్. స్ట్రైకింగ్ కలర్లు, సైన్స్, ప్రో మోడ్ కంట్రోల్స్ అద్భుతం. iQOO 15 స్పీడ్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది. పెద్ద మెయిన్ సెన్సార్‌లో గింబల్ స్టెబిలైజేషన్ ఉంది. మూవ్‌లో షార్ప్, బ్లర్-ఫ్రీ ఫోటోలు, వీడియోలు తీస్తుంది. వన్‌ప్లస్ 50MP ప్రైమరీ (24mm), 50MP అల్ట్రావైడ్, 50MP టెలిఫోటో, 32MP ఫ్రంట్. iQOO 50MP సోనీ IMX921 మెయిన్ OIS, 50MP IMX882 పెరిస్కోప్ 3x జూమ్, 50MP అల్ట్రావైడ్, 32MP ఫ్రంట్.
వన్‌ప్లస్ 15లో 7,300mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. 120W వైర్డ్, 50W వైర్‌లెస్ చార్జింగ్. రెండు రోజులు సులభంగా నిలబడుతుంది. iQOO 15లో 7,000mAh బ్యాటరీ, 150W వైర్డ్ చార్జింగ్. 0-100% 15 నిమిషాల్లో చార్జ్ అవుతుంది. వన్‌ప్లస్ ఎండ్యూరెన్స్ (మన్నిక) ఇస్తే.. iQOO స్పీడ్ లో ముందుంది.
వన్‌ప్లస్ 15 ధర రూ.79,999. iQOO 15 రూ.69,990. వన్‌ప్లస్ లో 16GB RAM/1TB వరకు ఆప్షన్ వేరియంట్లున్నాయి.రెండు ఫోన్లు ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యాయి. iQOO నవంబర్ 15-25లో ఇండియాలో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ మిడ్-నవంబర్ నుండి డిసెంబర్ ప్రారంభంలో అందుబాటులో ఉంది..
మీరు మీ అవసరాలు, ప్రాధాన్యం బట్టి నిర్ణయం తీసుకోండి. ఫ్లాగ్‌షిప్ ఎక్స్ పీరియన్స్ కావాలంటే.. వన్‌ప్లస్ 15 5G బెస్ట్.. అసాధారణ బ్యాటరీ లైఫ్, వర్సటైల్ కెమెరా, అద్భుతమైన స్క్రీన్ ఉన్నాయి. మొత్తం రోజు ఉపయోగానికి సరిపోతుంది. ప్యూర్ స్పీడ్ కావాలంటే iQOO 15 5G ఎంచుకోండి. గేమింగ్ నేచర్, క్విక్ చార్జింగ్‌తో iQOO 15 అల్ట్రా-కాంపిటిటివ్ గా ఉంది. ఇది పర్ఫార్మెన్స్ మెషీన్.
Also Read:నీరు వేడి చేసి, ఐస్ తయారు చేసే వాటర్ ప్యూరిఫైయర్.. ధర ఎంతో తెలుసా?