iQOO 15 Smartphone: ఐక్యూ అనే బ్రాండ్ గురించి చెప్పుకోవాలంటే, ఇది వివో కంపెనీకి చెందిన సబ్ బ్రాండ్ అయినప్పటికీ, తక్కువ సమయంలోనే టెక్నాలజీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు అదే ఐక్యూ తన కొత్త స్మార్ట్‌ఫోన్ అయిన ఐక్యూ 15 ను మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. ఈ ఫోన్‌పై ఇప్పటికే టెక్ ప్రపంచం అంతా దృష్టి పెట్టింది. ఇది ఎప్పుడు అందుబాటులో రానుంది? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలో ఆపర్లు ఏమైనా ఉన్నాయా? అనేది ఇప్పుడు చూద్దాం.
అమోలేడ్ 2జి డిస్‌ప్లే
ఐక్యూ15లో 6.85 అంగుళాల అమోలేడ్ 2జి డిస్‌ప్లే ఇవ్వబడింది. దీని 144Hz రిఫ్రెష్ రేట్ కారణంగా గేమింగ్, స్క్రోలింగ్ అనుభవం అద్భుతంగా ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ కారణంగా ఫోన్ వేగం విషయంలో ఎటువంటి లాగ్ ఉండదు. ఐక్యూ ఫోన్లకు ప్రసిద్ధమైన లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉండబోతోందని సమాచారం.
50 మెగాపిక్సెల్ కెమెరా
కెమెరా పరంగా ఐక్యూ 15 ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇవ్వబోతున్నారు. ఈ త్రిపుల్ కెమెరా సెటప్ ఫోటో క్వాలిటీని మరింత బలపరుస్తుంది. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబోతున్నారు. నైట్ ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్, ఏఐ ఆధారిత ఇమేజ్ ప్రాసెసింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ ప్రత్యేకతలు అవుతాయి.
Also Read: Toyota Hiace Caesar: టయోటా హియేస్ లగ్జరీ ఎడిషన్ చూశారా? వాన్ లోనే రాయల్స్ వైభవం
7000mAh బ్యాటరీ సామర్థ్యం
బ్యాటరీ సామర్థ్యం 7000mAhగా ఉండి, 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తుంది. కేవలం 20 నిమిషాల్లో పూర్తి చార్జ్ అయ్యే సామర్థ్యం ఈ ఫోన్‌లో ఉండబోతుంది. ఈ ఫోన్ గేమింగ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిందని చెప్పొచ్చు.
సాఫ్ట్‌వేర్ – స్మూత్ అనిమేషన్లు
సాఫ్ట్‌వేర్ పరంగా, ఐక్యూ 15లో ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఆరిజిన్ఓఎస్ 6 ఉంటుంది. ఈ కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్ స్మూత్ అనిమేషన్లు, కొత్త కస్టమైజేషన్ ఆప్షన్లు, గేమింగ్ మోడ్ ఫీచర్లతో రానుంది.
ధర ఎంత? అందుబాటులో ఎప్పుడు?
ధర విషయానికి వస్తే, భారత మార్కెట్లో ఐక్యూ 15 ప్రారంభ ధర రూ.64,999గా ఉండే అవకాశం ఉంది. 12జిబి ర్యామ్ ప్లస్ 256జిబి స్టోరేజ్ వేరియంట్ ఈ ధరలో రావచ్చని అంచనా. ఉన్నతమైన వేరియంట్లు రూ.70,000కు చేరవచ్చు. తాజా సమాచారం ప్రకారం, ఐక్యూ15 భారత మార్కెట్‌లో నవంబర్ 27, 2025న విడుదల కానుంది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు ఉంటాయా?
అధికారిక విడుదల సమయంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండు వేదికలపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించబోతున్నాయి. బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్‌లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు అందుబాటులోకి రావచ్చని అంచనా. నవంబర్‌లో భారతీయ మార్కెట్‌లో విడుదల కానున్న ఈ ఫోన్ ధరలు, ఆఫర్లు, వేరియంట్ వివరాలు అధికారికంగా వెల్లడికానున్నందున, తాజా అప్డేట్‌లను గమనిస్తూ ఉండటం మంచిది.