Vial Video: తమను తాము రక్షించుకునేందుకు విష జంతువులు ఇళ్లు, వాహనాల్లోకి అప్పుడప్పుడు దూరిపోతాయి. ఒక్కోసారి వాటిని చాలామంది చూడరు. అనుకోని సందర్భాల్లో అవి బయటపడతాయి. వాటిని చూసి చాలామంది షాకైన ఘటనలు ఉన్నాయి. అలాంటి ఘటన అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది.
షాకైన కానిస్టేబుల్
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రాంతానికి కానిస్టేబుల్ శివాజీ డ్యూటీకి తన బైక్‌పై పోలీసు స్టేషన్‌కు బయలుదేరాడు. మార్గ మధ్యలో వాహనం నుంచి ఏదో వింత శబ్దం అతడికి వినిపించింది. ఎంటంటూ బైక్ దిగి చూశాడు. కానీ ఎక్కడా ఏమీ కనిపించలేదు. మళ్లీ బైక్‌పై కొంతదూరం వెళ్లాక మళ్లీ అలాంటి శబ్దం వచ్చింది. మళ్లీ నాగపాము బుసలు కొట్టే శబ్దం రావడంతో వాహనం దిగి అంతా చెక్ చేశాడు.
ఎందుకోగానీ సీటు ఓపెన్ చేసి చూశాడు. అందులో నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. షాకైన శివాజీ, చాలాసేపటి వరకు తేరుకోలేకపోయాడు. వెంటనే అప్రమత్తమై స్థానికుల సాయంతో నాగపాముని తొలగించాడు. అక్కడి నుంచి పాము పరిసర ప్రాంతాల్లోకి వెళ్లిపోయింది. కానిస్టేబుల్‌ని పలు ప్రశ్నలు లేవనెత్తారు స్థానికులు. సీటులో పాము ఉందని ఎలాగ తెలిసిందని ప్రశ్నించారు.
సీటు లోపల నాగపాము బుసలు
ఇటీవల నాగుల చవితి సందర్భంగా సీటు కిందకి పాము వెళ్లి ఉండవచ్చని చెబుతున్నారు. ఏదేమైనా నాగపాము కానిస్టేబుల్‌ని కాటు వేయకుండా కాపాడిందని కొందరి మాట. ప్రస్తుతం ఏపీలో రెండు, మూడు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ సమయంలో పాము సీటులోకి వచ్చి ఉంటుందని ఇంకొందరి మాట. పాము దెబ్బకు ప్రతీరోజు కానిస్టేబుల్ తన బైక్‌ని చెక్ చేసుకుని అప్పుడు ట్రావెల్ చేస్తున్నాడట.
ALSO READ: ఈ చెప్పులను కాళ్లకు వేసుకోరు.. హ్యాపీగా తినేస్తారు
గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఏనాడు వాహనాదారులను కాటు వేసిన సందర్భాలు లేవని స్థానికుల మాట. ఏదైమైనా వర్షాకాలం సీజన్‌లో ఇంటి బయట పెట్టిన వాహనంలోకి పాములు దూరుతున్నాయని, ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మొత్తానికి నాగుపాము నుంచి కానిస్టేబుల్ శివాజీ తప్పించుకున్నాడనే చెప్పవచ్చు. ఈ తతంగాన్ని స్థానికులు తమ సెల్‌ఫోన్‌తో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
బైక్ సీటు కింద నాగుపాము
అనకాపల్లి-పాయకరావుపేటలో వెలుగుచూసిన ఘటన
ఎప్పటిలాగే బైకుపై పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన కానిస్టేబుల్ శివాజీ
మార్గమధ్యలో ఏదో వింత శబ్దం వినిపించడం గమనించి, సీటు తెరిచి చూడగా బుసలు కొడుతూ కనిపించిన పాము
స్థానికుల సాయంతో పామును తరిమేసి అక్కడి నుంచి… pic.twitter.com/BWvGMu9lHw
— BIG TV Breaking News (@bigtvtelugu) October 28, 2025