Ice-Making Water Purifier| షావోమి కంపెనీ కొత్తగా ఒక అద్భుతమైన వాటర్ ప్యూరిఫైయర్‌ను విడుదల చేసింది. దీని పేరు మిజియా వాటర్ ప్యూరిఫైయర్. ఈ వాటర్ ప్యూరిఫైయర్ కొన్ని నెలల క్రితమే విడుదల అయినప్పటికీ.. తాజాగా దీని ఐస్-మేకింగ్ ఎడిషన్‌ని లాంచ్ చేసింది. ఈ ఒక్క మెషీన్ మూడు పనులను చేస్తుంది – నీటిని శుద్ధి చేయడం, ఐస్ క్యూబ్స్ తయారు చేయడం, నీటిని వేడి చేయడం. ఈ ప్యూరిఫైయర్ ఆధునిక వంటగదులకు (అడ్వాన్స్ కిచెన్స్) లో బాగా సూటెబుల్.
మిజియా వాటర్ ప్యూరిఫైయర్ ధర 4,499 చైనా యువాన్‌లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.55,430. ప్రారంభంలో దీని ధర 4,099 యువాన్‌లు (సుమారు రూ. 50,519)గా ఉండేది. ఈ అడ్వాన్స్ ఎలెక్ట్రానిక్ ఉత్పత్తి ప్రస్తుతం చైనా మార్కెట్‌లో JD.com వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంది.
ఈ ప్యూరిఫైయర్‌లో వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఐస్-మేకింగ్ సిస్టమ్ ఉంది. కేవలం 15 నిమిషాల్లో ఐదు పారదర్శకమైన ఐస్ క్యూబ్స్‌ను తయారు చేయగలదు. ఒక ప్రత్యేక సూపన్ ఫాస్ట్ మోడ్‌లో, చిన్న ఐస్ క్యూబ్స్‌ను 10 నిమిషాల్లో తయారు చేస్తుంది. ఈ మెషిన్ ఒకేసారి 40 నుండి 50 ఐస్ క్యూబ్స్‌ను నిల్వ చేయగలదు. ఇందులోని కంప్రెసర్, డ్యూయల్-స్పీడ్ ఫ్యాన్ కలిసి ఒకేసారి పనిచేస్తుంటాయి. అందువల్ల శబ్దం 35 డెసిబెల్స్‌కు మించకుండా ఇంట్లో సైలెంట్ గా ఉంటుంది.
ఈ ప్యూరిఫైయర్‌లో ఆరు-దశల RO + GC ఫిల్టర్ ఉంది. ఈ టెక్నాలజీ నీటిలోని 0.0001 మైక్రాన్‌లంత చిన్న కణాలను, మైక్రో-ప్లాస్టిక్‌లను, భారీ లోహాలను తొలగిస్తుంది. శుద్ధి చేసిన నీరు శిశువులకు సైతం సురక్షితమైన తాగునీటి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. నీరు, ఐస్ క్యూబ్స్‌ను శుద్ధిగా ఉంచడానికి రెండు UV క్రిమిసంహారక లాంప్‌లు ఉపయోగించబడతాయి. 99.9 శాతం బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. కలుషితం అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఈ మెషీన్‌లో 2100W పవర్‌ఫుల్ హీటింగ్ సిస్టమ్ ఉంది. కేవలం మూడు సెకన్లలో నీటిని వేడి చేస్తుంది. యూజర్లు 40℃ నుండి 95℃ వరకు ఉష్ణోగ్రతను సెట్ చేయవచ్చు. ఈ మెషీన్ నీటిని 1℃ కచ్చితత్వంతో నిర్వహిస్తుంది. మిజియా యాప్, హైపర్‌ఓఎస్ కనెక్ట్ ద్వారా యూజర్లు దీన్ని రిమోట్‌గా కంట్రోల్ చేయవచ్చు. నీటి క్వాలిటీని చెక్ చేయడం, స్థితిని రిమోట్‌గా పర్యవేక్షించడం వంటి సౌకర్యాలు ఉన్నాయి.
ఈ మెషీన్‌లో 6 లీటర్ల డ్యూయల్ వాటర్ ట్యాంక్ ఉంది. ఒక ట్యాంక్‌లో శుద్ధి చేసిన నీటిని స్టోర్ చేసి మరొక దాంట్లో వ్యర్థ జలాన్ని వేరు చేస్తుంది. ఈ డెస్క్‌టాప్ డిజైన్ సంక్లిష్టమైన ఇన్‌స్టాలేషన్ అవసరం లేకుండా, ప్లగ్ ఇన్ చేసి వెంటనే ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది. మెషీన్‌లో 2 లీటర్ల డిటాచెబుత్ (తొలగించగల) జగ్ కూడా ఉంది. టచ్ కంట్రోల్ ప్యానెల్, యాంబియంట్ లైట్ ఇండికేటర్ దీన్ని ఉపయోగించడాన్ని సులభతరం చేస్తాయి.
ఈ షావోమి మిజియా వాటర్ ప్యూరిఫైయర్ ఆధునిక జీవనశైలికి అనువైన, మల్టీ పర్పజ్ పరికరం. కిచెన్‌లో సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని పెంచుతుంది. త్వరలోనే భారత్ లో కూడా విడుదల కాబోతోంది.
Also Read: మీ జిమెయిల్ హ్యాక్ అయిందా? ఇలా తెలుసుకోండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి