Travel Bus Burnt: రాజస్థాన్‌లో ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్ధమైంది. బస్సుకు హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. జైపూర్-ఢిల్లీ నేషనల్ హైవే పక్కనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన ఎలా జరిగింది అన్న డీటేల్స్‌లోకి వెళ్తే..
రాజస్థాన్‌లో ఘోర అగ్నిప్రమాదం
రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడి గ్రామంలో బస్సు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన స్లీపర్ బస్సు ఉత్తరప్రదేశ్ నుండి రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ ప్రాంతానికి వెళ్తోంది. తోడి ప్రాంతంలోని ఇటుక బట్టీకి కార్మికులను తీసుకెళ్తోంది. టోల్ గేటు రుసుము తప్పించుకునేందుకు ఆ బస్సు విలేజ్ రోడ్డులో వెళ్లింది. దీనికితోడు స్లీపర్ బస్సు పైకప్పుపై భారీగా లగేజి ఉంది.
ఈ నేపథ్యంలో బస్సు లగేజీకి హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్పాట్‌లో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనతో బస్సులోని కార్మికులు భయాందోళనలు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ముగ్గురు మృత్యువాత పడగా, పలువురు గాయపడ్డారు. ఇంకొందరు బస్సులో నుంచి బయటకు దూకేశారు.
మంటల్లో ప్రైవేటు ట్రావెల్ బస్సు, ముగ్గురు మృతి
బస్సు ఘటన నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గాయపడిన వారిని సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురు కార్మికులను అధునాతన చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
ALSO READ: డిగ్రీ విద్యార్థిని యాసిడ్ దాడి కేసులో బాధితురాలి తండ్రి అరెస్ట్
ఇటీవల కర్నూలు జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 19 మంది మృత్యువాతపడ్డారు. ప్రయాణికులు గుర్తు పట్టలేనంతగా కాలిపోయారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాత వారి వారి బంధువులకు మృతదేహాలను అప్పగించిన విషయం తెల్సిందే. ఈ ఘటన తర్వాత ప్రైవేటు ట్రావెల్స్ ఏ మాత్రం మొద్దు నిద్ర వీడలేదు.
మరో ఘోర బస్సు ప్రమాదం!
జైపూర్-ఢిల్లీ హైవేలో ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
హైటెన్షన్ వైర్‌ను తాకి బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం
ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయాలు pic.twitter.com/AE611CMj2H
— BIG TV Breaking News (@bigtvtelugu) October 28, 2025