ఆంధ్రప్రదేశ్ లో కీలక విమానాశ్రయం అయిన గన్నవరం ఎయిర్ పోర్టులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో విమానాశ్రయ ఉద్యోగులతో పాటు ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆప్పేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎయిర్ పోర్టు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఎయిర్ పోర్ట్ లో అగ్ని ప్రమాదానికి కారణం కస్టమ్స్ సిబ్బంది గదిలో మంటలు చెలరేగడమేనని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. అక్కడ అకస్మాత్తుగా మంటలు రావడంతో పాటు క్షణాల్లో లగేజీ, ఎయిర్ పోర్ట్ ఆఫీస్ వరకు విస్తరించాయి. ఈ ఘటనలో కస్టమ్స్ ఏజెంట్ల లగేజీ బ్యాగులు, సాఫ్ట్ వేర్ పరికరాలు, ఇమ్మిగ్రేషన్ గదిలోని స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ ధ్వసం అయినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఎయిర్ పోర్టులోని ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ఆపడానికి, విమానాశ్రయ అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది త్వరగా సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తారు. సుమారు అరగంట తర్వాత మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదం సమీపంలో ఉన్న అందరినీ ఖాళీ చేయించినట్లు తెలిపారు. వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖను అప్రమత్తం చేశామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు. తాజా నివేదిక ప్రకారం, కస్టమ్స్ విభాగం తన లగేజీ బ్యాగులు, సాఫ్ట్ వేర్ పరికరాలు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. ఇవి చాలా ఖరీదైనవని అధికారులు తెలిపారు. త్వరలో ఈ ఘటనకు సంబంధించిన అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
Read Also: మొంథా ఎఫెక్ట్.. 150కి పైగా రైళ్లు రద్దు, పలు విమాన సర్వీసులు క్యాన్సిల్!
గత మే లోనూ ఈ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకకు కేవలం గంట ముందు ఈఘటన జరిగింది. ఈ సంఘటన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) టవర్ లో జరిగింది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు ఈ మంటలను అదుపు చేశారు. సమాచారా వ్యవస్థను సెట్ రైట్ చేశారు.
Read Also: కమ్మేస్తున్న పొగమంచు, 16 రైళ్లు 3 నెలల పాటు రద్దు!