BigTV English
Advertisement

Anushka Shetty: బాహుబలి,భళ్ళాలదేవ  ఒకే.. మరి దేవసేన ఎక్కడ? అందరి కళ్ళు ఆమెపైనే?

Anushka Shetty: బాహుబలి,భళ్ళాలదేవ  ఒకే.. మరి దేవసేన ఎక్కడ? అందరి కళ్ళు ఆమెపైనే?

Anushka Shetty: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన బాహుబలి(Bahubali) సినిమా రెండు భాగాలు కలిపి అక్టోబర్ 31వ తేదీ ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ది ఎపిక్(Bahubali The Epic) పేరిట విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజమౌళి(Rajamouli), ప్రభాస్ (Prabhas), రానా (Rana) ముగ్గురు కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన అనుష్క(Anushka) కూడా ఈ ప్రమోషన్లలో పాల్గొంటుందని అభిమానులందరూ భావించారు.


బాహుబలి ది ఎపిక్ కు దూరంగా అనుష్క?

అనుష్క ఇటీవల కాలంలో మీడియాకు చాలా దూరంగా ఉంటున్నారు కానీ బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్లలో ఆమె పాల్గొంటుందని అందరూ భావించారు కానీ ఈ ప్రమోషన్లకు కూడా అనుష్క దూరంగా ఉండబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాహుబలి ది ఎపిక్ కోసం ప్రభాస్ రానా రంగంలోకి వచ్చారు కానీ అనుష్క మాత్రం కనిపించని నేపథ్యంలో అసలు అనుష్క ప్రమోషన్లలో పాల్గొంటారా? లేదా? అనే విషయంపై అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం అనుష్కను ప్రమోషన్లకు ఒప్పించే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

రేడియో ద్వారా ప్రమోషన్లు..

అనుష్క బాహుబలి సినిమా తర్వాత పెద్దగా బయట కనిపించడానికి ఇష్టపడటం లేదు తన వ్యక్తిగత కారణాలవల్లే ఆమె బయటకు రావడంలేదని తెలుస్తోంది. ఇటీవల అనుష్క నటించిన ఘాటీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమోషన్లలో భాగంగా అనుష్క కెమెరా ముందుకు రాకపోయినా రేడియో ద్వారా అలాగే ఫోన్ కాల్స్ ద్వారా సినిమాకు కావలనంత ప్రమోషన్లను నిర్వహించారు. అయితే అనుష్క అధిక శరీర బరువు ఉన్న నేపథ్యంలోనే కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. అనుష్క తన కెరియర్ లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశారు తద్వారా అధిక శరీర బరువు ఉన్న నేపథ్యంలోనే ఈమె సినిమాలను కూడా భారీగా తగ్గించిందని చెప్పాలి.


అనుష్కను ఒప్పించే పనిలో రాజమౌళి..

అనుష్క కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలిచిన బాహుబలి సినిమా తిరిగి విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అనుష్క వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు ఈసారి కూడా నిరాశే మిగలబోతోందని తెలుస్తోంది. మరి రాజమౌళి ప్రయత్నాలు ఫలించి అనుష్క ప్రమోషన్లలో పాల్గొంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే బాహుబలి సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ విడుదల అయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అభిమానులు ఎంతో ఆతృత కనబరుసన్నారు.

Also Read: Dacoit Release: ఉగాది బరిలో డెకాయియ్.. యశ్ టాక్సిక్ కు పోటీగా అడివిశేష్

Related News

Mahhi Vij Divorce: విడాకులు తీసుకున్న మరో స్టార్‌ కపుల్‌.. 14 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి!

Director Karuna Kumar : ప్రమోషన్స్ అంటే హీరోలు ఫోన్లు ఎత్తరు… ఇండస్ట్రీని హీటెక్కించే కామెంట్ ఇది

Sreeleela: కిస్సిక్ సాంగ్ లేకపోతే అవకాశాలు లేవు.. అసలు విషయం చెప్పిన శ్రీ లీల!

Venkatesh -Aishwarya Rajesh: వెంకీమామ సినిమాలో ఐశ్వర్య రాజేష్.. మరో హిట్ లోడింగ్?

Mass Jathara: బాహుబలి ముందు రవితేజకు ‘జాతర’ ఉండదేమో… అంతా నాగ వంశీ రిస్క్

Tejaswi Madivada: బఠానీలు అమ్మినట్లు శృం*రం అమ్ముతారు.. తేజస్వి బోల్డ్ కామెంట్స్

Vivek Oberoi: క్యాన్సర్ పిల్లల కోసం రెమ్యూనరేషన్ .. గొప్ప మనసు చాటుకున్న హీరో?

Bomb Blast Warning: మామ అల్లుళ్ళకు బాంబు బెదిరింపులు.. తమిళనాట ఏం జరుగుతోంది?

Big Stories

×