Bahubali: బాహుబలి సినిమాతో హాలీవుడ్ ప్రేక్షకుల్ని సైతం తన వైపు తిరిగేలా చేశారు డైరెక్టర్ రాజమౌళి (Rajamouli).. ఈ సినిమాతో రాజమౌళి క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. అయితే అలాంటి ‘బాహుబలి’ సినిమా ఇంటర్నేషనల్ వైడ్ గా ఇంత అద్భుతంగా వచ్చి ఇంటర్నేషనల్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాకి ఆకర్షితులు అయ్యారు అంటే దానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే.. ఈ సినిమా కోసం పనిచేసిన హాలీవుడ్ డైరెక్టర్ విన్సెంట్ టాబైలోన్.. ది ఇన్ క్రెడిబుల్ హల్క్ తో పాపులర్ అయినటువంటి విన్సెంట్ టబైలియన్ బాహుబలి మూవీ ఇంటర్నేషనల్ వెర్షన్ ని ఎడిట్ చేసిన సంగతి చాలా మందికి తెలియదు.
గ్లోబల్ ఆడియన్స్ దేనికి ఎక్కువ ఆకర్షితులు అవుతారనే విషయం ఈయనకు బాగా తెలుసు. అందుకే గ్లోబల్ ఆడియన్స్ టేస్ట్ తెలిసిన విన్సెంట్ టాబైలోన్ బాహుబలి మూవీని అద్భుతంగా ఇంటర్నేషనల్ వెర్షన్ లో ఎడిట్ చేశారు. అలాంటి విన్సెంట్ టాబైలోన్ బాహుబలి మూవీ కంటే ముందు ఎన్నో ఇంటర్నేషనల్ ప్రాజెక్టులకు వర్క్ చేశారు. ఈయన క్లాష్ ఆఫ్ ది టైటాన్స్, నౌ యు సీ మీ, టేకెన్ 2 సినిమాల తోపాటు ది లెజెండ్ ఆఫ్ హెర్క్యూలెస్ వంటి సినిమాలకు అద్భుతంగా ఎడిటింగ్ చేసి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. అలా ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలకు పనిచేసిన విన్సెంట్ టాబైలోన్ ను రాజమౌళి తన బహుబలి సినిమా కోసం మొదటిసారి ఎంపిక చేసుకున్నారు. రాజమౌళి పెట్టుకున్న నమ్మకాన్ని విన్సెంట్ టాబైలోన్ నిలబెట్టుకున్నారని బాహుబలి సినిమా చూస్తే అర్థమవుతుంది.
బాహుబలి తెలుగు వెర్షన్ తో పోలిస్తే ఇంటర్నేషనల్ వెర్షన్ 20 నిమిషాలు తక్కువగా ఉంటుంది. అయితే అలాంటి ఇంటర్నేషనల్ వెర్షన్ ని అంత అద్భుతంగా ఎడిట్ చేసిన విన్సెంట్ టాబైలోన్ గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దానికి కారణం అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ మూవీ విడుదల కావడమే. బాహుబలి-1 బాహుబలి -2 పేరుతో వచ్చిన ఈ సినిమాల్ని రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే రెండు సినిమాలు వేరువేరుగా రీ రిలీజ్ చేయకుండా రెండు సినిమాలని కలిపి ఎడిట్ చేసి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే బాహుబలి ది ఎపిక్ కి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. ప్రభాస్ అభిమానులు బాహుబలి సినిమా చూడడానికి ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న రీ రిలీజ్ కాబోతుండడంతో అలా మరోసారి ఈ సినిమాకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ALSO READ:Samantha: తప్పు చేశాను.. ఫైనల్‌గా నిజం ఒప్పుకున్న సమంత!
బాహుబలి సినిమా విషయానికి వస్తే.. రాజమౌళి డైరెక్షన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు రుచి చూపించాడు. అలా ఈ సినిమా ద్వారా ప్రభాస్ , రానా లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ మూవీలో అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లు కీలక పాత్రల్లో నటించారు.