BigTV English

OnePlus New Smartphone Launch: ఇది కదా అరాచకం అంటే.. వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. లాంచ్ అయితే ఇక అంతే..!

OnePlus New Smartphone Launch: ఇది కదా అరాచకం అంటే.. వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. లాంచ్ అయితే ఇక అంతే..!

OnePlus Nord 4: ప్రముఖ టెక్ కంపెనీ OnePlus తన స్మార్ట్‌ఫోన్ సిరీస్ Nord నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకురానుంది. ఈ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను విడుదల చేయనుంది. ఇందులో Nord 4, Nord CE 4 Lite ఫోన్లు ఉన్నాయి. ఈ ఏడాది ఈ రెండు ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. Nord CE 4 Lite గురించి చాలా కాలంగా అనేక లీకులు వస్తున్నాయి. ఈ ఫోన్ జూన్‌లోనే మార్కెట్‌లోకి కూడా రావచ్చు. అయితే ఇప్పుడు OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్ బిగ్ అప్‌డేట్ వచ్చింది.


వన్‌ప్లస్ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలో మార్కెట్‌లోకి రానున్నాయి. నార్డ్ సిరీస్‌లోని ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ ఈ ఏడాది విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు. జూన్‌లో లైట్ మోడల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. Nord 4 విషయానికి వస్తే దాని లాంచ్ టైమ్‌లైన్ గురించి కొంత సమాచారం వెల్లడైంది. అయితే  ఫీచర్ల గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.

OnePlus కంపెనీ Nord 4 స్మార్ట్‌ఫోన్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలో చైనాలో విడుదల చేసింది. OnePlus Ace 3V రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం రాబోయే Nord 4 6.74-అంగుళాల AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఇది 2150 nits పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ప్రొటెక్షన్ కోసం ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు సపోర్ట్ ఇస్తుంది.


Also Read: OnePlus New Smartphone Launch: ఇది కదా అరాచకం అంటే.. వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. లాంచ్ అయితే అంతే!

OnePlus Nord 4 స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌సెట్, LPDDR5x RAM, UFS 4.0 స్టోరేజ్, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీతో రావచ్చు. చైనాలో Ace 3V  టాప్-ఎండ్ వేరియంట్ 16GB RAM +512GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇది ఆక్సిజన్‌ఓఎస్ 14పై ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.

OnePlus Nord 4 కెమెరా విషయానికి వస్తే ఇందులో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోన్ వెనుక 50-మెగాపిక్సెల్ కెమెరా OIS ఫీచర్‌తో ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో ఉంటుంది. గత సంవత్సరం వచ్చిన OnePlus Nord 3 ప్రారంభ ధర రూ. 33,999లగా ఉంది. అటువంటి పరిస్థితిలో OnePlus Nord 4 ధర కూడా దీని దగ్గరా ఉండవచ్చు.

Tags

Related News

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Big Stories

×