Bicycle Ambulance: ప్రపంచ దేశాలు అత్యవసర వైద్య సేవల కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం సైకిల్ అంబులెన్స్ తీసుకొచ్చి.. నెట్టింట నవ్వుల పాలవుతోంది. పాక్ లోని సింధ్ ప్రభుత్వం.. ఈ సైకిల్ అంబులెన్స్ లను ప్రవేశపెట్టగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కరాచీ మేయర్ బారిస్టర్ ముర్తజా వహాబ్ సైకిల్స్ ను గర్వంగా ప్రారంభించడాన్ని చూసి నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై జోకులు పేలుసుతున్నారు.
పాకిస్థాన్ సైకిల్ అంబులెన్స్ పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ‘ప్రపంచమంతా రోబోలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లు వాడుతుంటే కరాచీ మేయర్ మాత్రం సైకిల్ ఆంబులెన్స్‌ను లాంచ్ చేస్తున్నారు. ఇది కేవలం పాకిస్థాన్‌లోనే సాధ్యం’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘సింధ్ ప్రభుత్వం నుంచి కరాచీ ప్రజలకు గొప్ప కానుక. ఒకవేళ ఆంబులెన్స్ వచ్చేలోపే రోగి చనిపోతే అది మేయర్ తప్పు కాదు సుమా’ అంటూ మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు.
77 years of innovation and Karachi finally gets a cycle ambulance.
Quite the milestone for a country that boasts nuclear weapons.
It is a symbol of Pakistan's governance challenges under Corrupt Pak Army Chief Asim Munir@LtGenDPPandey @amritabhinder @sanjoychakra @CestMoiz pic.twitter.com/3HPfrf5dw8
— Ayushi (@AyushiGupta_in) July 20, 2026
సోషల్ మీడియాలో వైరస్ అవుతున్న దృశ్యాలకు సంబంధించి ఓ ట్విస్ట్ బయటకొచ్చింది. ఈ సైకిల్ అంబులెన్స్ ప్రారంభోత్సవం నిజమే అయినప్పటికీ.. అది లేటెస్ట్ కాదని తెలుస్తోంది. గతేడాది మే నెలలోనే ‘రెస్క్యూ 1122’ సంస్థ ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చిందట. కరాచీలోని అత్యంత రద్దీగా ఉండే వీధులు, సందుల్లోకి సాధారణ పెద్ద ఆంబులెన్సులు వెళ్లలేవు కాబట్టి అలాంటి ఇరుకైన ప్రాంతాల్లోకి వేగంగా వెళ్లి ప్రాథమిక చికిత్స అందించడానికే ఈ సైకిల్ ఆంబులెన్స్‌లను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సైకిల్ అంబులెన్స్ ల విషయానికి వస్తే.. వీటిలో ఆక్సిజన్ మాస్కులు, నెబ్యులైజర్లు, షుగర్ టెస్టింగ్ కిట్లు, అత్యవసర ప్రథమ చికిత్స సామగ్రి పూర్తి స్థాయిలో ఉన్నాయి. అంతేకాకుండా శిక్షణ పొందిన మహిళా వాలంటీర్లు ఈ సైకిళ్లను నడపడం ద్వారా మహిళా సాధికారతకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లైందని రెస్క్యూ 1122 సీఈఓ ప్రారంభోత్సవం సందర్భంగా చెప్పారు.
Also Read: ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?
సైకిల్ అంబులెన్స్ పై జరుగుతున్న ట్రోలింగ్ ను కాస్త పక్కన పెడితే.. పాకిస్థాన్ లో మాత్రం వైద్యారోగ్య సేవలు మాత్రం రోజుకు రోజుకు క్షీణిస్తున్నాయి. ఆ దేశం తన జీడీపీలో 2 శాతం కంటే తక్కువ మొత్తాన్ని మాత్రమే ఆరోగ్య రంగానికి కేటాయిస్తోంది. ఫలితంగా ఆసుపత్రుల్లో సరైన పరికరాలు, మందులు, ఆధునిక యంత్రాలు కరువై రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్కువ వేతనాలు, అధ్వాన్నమైన పని వాతావరణం వల్ల నైపుణ్యం ఉన్న వైద్యులు, నర్సులు విదేశాలకు తరలిపోతున్నారు.
Also Read: జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!