BigTV English

Phone Battery : స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పాడైందని ఇలా కనిపెట్టేయండి..

Phone Battery : స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పాడైందని ఇలా కనిపెట్టేయండి..

Phone Battery : స్మార్ట్ ఫోన్ బ్యాటరీ.. ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే తప్పనిసరిగా చూడాల్సిన ఫీచర్ బ్యాటరీ సామర్థ్యం. ఒకప్పుడు తక్కువ సామర్థ్యంతో 20W, 30W వచ్చే బ్యాటరీలు.. ఇప్పుడు 70w, 80w సైతం దాటి పోతున్నాయి. ఫోన్ లో స్టోరేజ్ ఫీచర్ ఎంత ముఖ్యమో బ్యాటరీ సామర్థ్యం కూడా అంతే ముఖ్యం. తరచూ బయటకు వెళ్లాల్సిన పరిస్థితులతో పాటు సాంకేతిక యుగంలో ఫోన్ వాడకం సైతం ఎక్కువగా ఉండటంతో బ్యాటరీ సామర్థ్యం ఫోన్ ఫీచర్స్ లో కీలకమైపోయింది. అయితే ఒక్కొక్కసారి ఫోన్ బ్యాటరీ డ్రై అయిపోతూ ఉంటుంది. ఛార్జింగ్ ఒక్కసారిగా పడిపోతుంది. బ్యాటరీ పాడైపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని అంత తొందరగా కనుక్కోలేరు. అయితే అసలు బ్యాటరీ సామర్థ్యాన్ని ఎలా అంచనా వేయాలి… తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో  ఓ లుక్కేద్దాం.


తరచూ ఫోన్ వాడాల్సి రావడంతో ఫోన్ బ్యాటరీ తగ్గిపోతూ ఉంటుంది. ఫోన్ ఛార్జ్ చేయడంలో ఏమైనా తప్పులు చేసినా ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టి వదిలేసినా బ్యాటరీపై సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. ఇక బ్యాటరీ డ్రెయిన్ కు గురైనప్పుడు చార్జింగ్ ఎక్కువసేపు నిలవదు. దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అయితే అసలు ఫోన్ బ్యాటరీకి ఉన్న సమస్యల్ని ఎలా గుర్తించాలి. కొత్తగా కొనుగోలు చేసిన ఫోన్ ఎక్కువ కాలం మన్నిక రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

ALSO READ : మొబైల్​కు బానిసలయ్యారా? – ఇలా చేస్తే ఇట్టే బయటపడొచ్చు!


సాధారణంగా స్మార్ట్ ఫోన్ బ్యాటరీ రెండేళ్ల వరకు పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఆ తర్వాత నుంచి తగ్గటం మొదలవుతుంది. ఇక కొత్త కొన్నప్పటి నుంచే చార్జింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

ఫోన్ చార్జ్ చేసినప్పుడు ఎక్కువ సమయం వదిలేయకూడదు. అలా వదిలేస్తే ఛార్జింగ్ తొందరగా తగ్గిపోతుంది. తరచూ ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటే ఫోన్ బ్యాటరీ దెబ్బతిన్నాదేమో గుర్తుంచాలి.

ఫోన్ ఛార్జింగ్ పెట్టిన కొంత సేపటికే ఛార్జింగ్ కొద్దిగా తగ్గిపోవడం, షట్ డౌన్ అయిపోవడం జరుగుతూ ఉంటే బ్యాటరీ పాడైందేమో గుర్తించాలి.

బ్యాటరీ ఉన్న పరిమాణం కంటే పెరిగితే వెంటనే గుర్తించాలి. ఉబ్బినట్లు అనిపిస్తే వెంటనే సమస్య ఉందేమో కనుక్కోవాలి.

20% కంటే తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడు నిమిషాల్లోనే చార్జింగ్ తగ్గిపోవడం.. ఒక్క సారిగా ఫోన్ షట్ డౌన్ అవ్వటం జరిగితే సమస్య ఉన్నట్టు గుర్తించాలి.

లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలంటే..

బ్యాటరీ ఎక్కువ కాలం ఉండాలంటే 80% కంటే ఎక్కువ ఛార్జ్ చేయకూడదు. అలాగే 20% కంటే తగ్గిపోక ముందే ఛార్జింగ్ పెడుతూ ఉండాలి.

ఫోన్ స్క్రీన్ బ్రైట్ నెస్ తగ్గించటం, బ్యాటరీ సెట్టింగ్స్ ను ఎప్పటికప్పుడు మార్చుకోవడం చేయాలి.

ఫోన్ వేడి ప్రదేశాలకు దూరంగా ఉంచాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మాన్యువల్ అప్డేట్ ఆప్షన్ ని ఎనేబుల్ చేయాలి.

ఫోన్లో అనవసరమైన యాప్స్ ను తొలగించాలి. బ్యాక్ గ్రౌండ్ యాప్స్ యాక్టివ్ ఫీచర్స్ ఆఫ్ చేయాలి.

రాత్రంగా ఛార్జింగ్ పెట్టి ఉంచే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలా చేయటం కూడాా సరైన పద్ధతి కాదు. దీని వలన బ్యాటరీ పాడైపోవటం, పేలిపోవటం వంటివి జరుగుతాయి.

Related News

BSNL Free Internet: 30 రోజులు ఇంటర్నెట్ ఫ్రీ.. బిఎస్ఎన్ఎల్ షాకింగ్ ఆఫర్

Samsung F06 5G vs Tecno Spark Go vs iQOO Z10 Lite: రూ.10000 లోపు బడ్జెట్ లో బెస్ట్ ఫోన్ ఏది?

Galaxy S24 Discount: రూ.49,999కే గెలాక్సీ S24.. భారీ డిస్కౌంట్.. త్వర పడండి!

Whatsapp AI Writing: వాట్సాప్ లో కొత్త ఫీచర్ లాంచ్.. స్మార్ట్ చాటింగ్ కోసం AI రైటింగ్ అసిస్టెంట్

Plants: మొక్కలకు కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటాయా? అవి ఎలా ప్రతిస్పందిస్తాయంటే?

Redmi 15 5G vs Honor X7c 5G: ₹14,999 ధరకు ఏది బెస్ట్?

Big Stories

×