BigTV English

Crime News: దారుణం.. అత్తాకోడలిపై అత్యాచారం.. దుండగుల కోసం పోలీసుల గాలింపు

Crime News: దారుణం.. అత్తాకోడలిపై అత్యాచారం.. దుండగుల కోసం పోలీసుల గాలింపు

Crime News: పొట్టకూటి కోసం కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుండి వచ్చిన ఇద్దరు మహిళలపై దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో ఐదు నెలల క్రితం బళ్లారి నుండి వచ్చిన ఓ కుటుంబం నివసిస్తోంది. వీరు స్థానిక పేపర్ మిల్లులో పని చేస్తూ.. జీవన మనుగడ సాగిస్తున్నారు.


ఈ కుటుంబంలో ఓ వ్యక్తి స్థానిక పేపర్ మిల్లులో వాచ్ మెన్ గా పనిచేస్తున్నారు. అయితే రోజువారి మాదిరి గానే.. రాత్రి కాగానే కుటుంబ సభ్యులు నిద్రలోకి జారుకున్నారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనాలపై ఐదుగురు దుండగులు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి తండ్రి, కొడుకులను కత్తితో బెదిరించినట్లు బాధితులు తెలుపుతున్నారు. బెదిరించిన అనంతరం అత్తాకోడళ్లను పక్కకు తీసుకెళ్లి దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం దావానంలా వ్యాప్తి చెందడంతో.. స్థానికులు అసలేం జరిగింది.. ఎవరు వారు అంటూ ఆరా తీస్తున్నారు.

Also Read: TTD Files Complaint: సీఎంకే ప్రాణగండం అంటూ పోస్ట్.. టీటీడీ ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు

లైంగిక దాడి విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, బాధితులను విచారించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చి మూకుమ్మడిగా లైంగిక దాడికి పాల్పడ్డ నిందితులను గుర్తించేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ రత్న ఆధ్వర్యంలో.. పలు బృందాలుగా విడిపోయి.. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనపై మంత్రి సవిత కూడా స్పందించారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పోలీసులు పట్టుకుంటారని మంత్రి తెలిపారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×