సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవడంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ముందుంటారు. ఎక్స్ వేదికగా ఆయా అంశాల గురించి ఆయన స్పందించే విధానం నెటిజన్లు బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన ఆర్టీసీ ఎండీగా ఉన్న సమయంలో బెట్టింగ్ యాప్స్ అరికట్టేందుకు పెద్ద యుద్ధమే చేశారు. ఇందుకోసం ప్రపంచ యాత్రికుడు అన్వేష్ లాంటి వారి సాయం తీసుకున్నారు. వారి ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ ను అరికట్టేందుకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. రీసెంట్ గా ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రజలను అలర్ట్ చేసే పలు కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. తప్పుడు ప్రచారాల గురించి ఎడ్యుకేట్ చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇక తాజాగా హైదరాబాద్ ప్రజలకు ఎప్పటికప్పుడు కీలక అప్ డేట్స్ ఇచ్చేందుకు సజ్జనార్ అధికారిక వాట్సాప్ ఛానెల్ ను ప్రారంభించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ కు సంబంధించిన మఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు, లేటెస్ట్ అప్ డేట్స్ మిస్ కాకుండా ఉండేందుకు ఈ ఛానెల్ ను ఫాలో కావాలని సీపీ సజ్జనార్ ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ సమాచారం పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రజలకు సూచించారు. నెట్టింట జరిగే తప్పుడు ప్రచారాలను నిజం అని భావించి మోసపోకూడదన్నారు.
Follow me on my WhatsApp channel for regular updates: https://t.co/CTAVnR1WVY https://t.co/AtpMVA78In
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 29, 2025
సోషల్ మీడియాతో పాటు డిజిటల్ వినియోగం పెరిగిన నేపథ్యంలో సైబర్ మోసాల సైతం గణనీయంగా పెరిగాయని సీపీ సజ్జనార్ తెలిపారు. ముఖ్యంగా AI టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజమో? ఏది అబద్దమో? తెలుసుకోలేకక సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. AI, డీప్ ఫేక్ లాంటి మోసాలకు ‘సేఫ్ వర్డ్’ తో అడ్డుకట్ట వేసుకోవచ్చని తెలిపారు. డీప్ ఫేక్ మోసాలను ఎదుర్కొనేందుకు ‘సేఫ్ వర్డ్’ ఉపయోగించాలని సజ్జనార్ హైదరాబాదీయులకు సూచించారు.
గత కొద్ది కాలంగా AI సాయంతో సైబర్ కేటుగాళ్లు డీప్ ఫేక్ క్లోనింగ్ కు పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. మనిషి ఫోటో ద్వారా వారి వీడియోలను తయారు చేసిన, వాటికి వాయిస్ యాడ్ చేస్తున్నారని తెలిపారు. క్లోనింగ్ వీడియోలను చూస్తే ఎవరైనా నిజమైనవే అని నమ్మే అవకాశం ఉందన్నారు. ప్రజలు టెక్నాలజీని సేఫ్ గా వాడుకోవాలని సూచించారు. తెలియని విషయాల జోలికి వెళ్లకూడదని, అనవసర లింక్ లను క్లిక్ చేయకూడన్నారు. హైదరాబాద్ కు సంబంధించిన సమాచారం కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ ఛానెల్ ను ఉపయోగించుకోవాలన్నారు. దీని ద్వారా అన్ని కీలక అప్ డేట్స్ అందిస్తామని సీపీ సజ్జనార్ తెలిపారు.
Read Also: ట్రాఫిక్ పోలీసులకు షాక్.. ఫైన్ కట్టాలని బైక్ ఆపిన యువకుడు!