AB VenkateswaraRao: రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు స్వరం మారుతుందనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారిందట. ఇటీవల ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతున్న తీరు…చేస్తున్న కామెంట్స్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగా ఉండడం ఆయన వ్యవహారశైలి అంతుచిక్కడం లేదనే చర్చ నడుస్తోందట. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ వైసీపీని, టీడీపీని విమర్శించడం ద్వారా ఏబీ ఏం చేయబోతున్నారనేది చర్చినీయంశంగా మారిందట.
ఏపీలో మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహార శైలి హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఏ గట్టుకు చెందిన వ్యక్తి అనేది అంతుచిక్కడం లేదట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత…ఏబీ వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహారిస్తారని అందరూ అనుకున్నారు. ప్రభుత్వం కూడా నామినేటెడ్ పదవి ఇచ్చింది. తనకు ఇచ్చిన పదవి నచ్చలేదో…మరో పదవి ఏమైనా ఆశించారోలేదో గానీ ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పదవిని ఏబీ తీసుకోలేదు. అంతేకాకుండా తనకు ఇచ్చిన పోలీస్ హౌసింగు బోర్డు చైర్మన్ పదవిని తీసుకోకుండా తనకు ప్రభుత్వానికి సంబంధం లేదన్న సంకేతాలు పంపారు. అప్పటి నుంచి ఏబీ వెంకటేశ్వరరావు స్వరం మారిందనే చర్చ ఏపీలో నడుస్తుందట.
ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ ఏబీ వెంకటేశ్వరరావు చేస్తున్న కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌లో చర్చినీయంశంగా మారుతున్నాయట. అధికార కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్‌గానే ఏబీ కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతున్నాయట. ప్రభుత్వ నిర్ణయాలను కూడా తప్పుపడుతూ పలు కార్యక్రమాలు చేయడం ఏబీవీ వ్యవహారశైలి ఏంటనే చర్చ స్టార్ట్ అయిందట. తమతో సన్నిహితంగా ఉండే రిటైర్డ్ ఐపీఎస్ ఎందుకిలా వ్యవహరిస్తున్నారన్న ప్రశ్న నేతలను కలవరపెడుతుందట. ఏబీ వెంకటేశ్వరరావు కార్యక్రమాలు కూడా క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక కోణం తీసుకోవడంతో రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ వ్యవహారశైలిపై విస్తృత చర్చ జరిగిందట. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఏబీవీ మళ్లీ యూటర్న్ ఎందుకు తీసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. కొద్ది నెలలుగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకనపెట్టేలా మాట్లాడం చర్చినీయంశమైందట.
తాజాగా విద్యుత్తు రంగ సంస్థ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ను టార్గెట్‌గా…తిరుపతిలో రౌండు టేబుల్ సమావేశం నిర్వహించి ఆ సంస్థ వల్ల ప్రజలు లక్ష కోట్ల భారాన్ని మోస్తున్నారని ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. కడప జిల్లాకు చెందిన షిర్డీసాయి సంస్థ యాజమాన్యానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఏబీవీ విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు సస్పెన్షన్ అనుభవించిన ఏబీవీ.. మాజీ సీఎం జగన్ టార్గెట్ గా తన కార్యక్రమాలు ఉంటాయని గతంలో ప్రకటించారు. షిర్డీసాయి సంస్థపై ఏబీవీ తాజాగా మొదలుపెట్టిన పోరాటం.. మాజీ సీఎం జగన్‌ను కార్నర్ చేయడానికే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయట.
అయితే ఏబీపీ చేసిన ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది కూడా సస్పెన్స్ క్రియేట్ చేస్తోందట. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలోనూ షిర్డీసాయి సంస్థకు మేలు చేసేలా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నానే విధంగా ఏబీ కామెంట్స్ ఉన్నాయనేది పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తుందట. దీంతో ఏబీవీ అసలు టార్గెట్ ఎవరన్నది కూడా చర్చకు కారణమవుతోందట.
కందుకూరు హత్య కేసులో లక్ష్మినాయుడు కుటుంబానికి ప్రభుత్వం ఆర్ధిక సాయం ప్రకటించడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రంగా తప్పుబట్టారు. ఏడాదికి 900 హత్యలు జరుగుతుంటే అందరికీ పరిహారం ఇస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హత్యకేసుల అన్నిటిలో ఇలాంటి పరిహారం ప్రకటించే పాలసీ నిర్ణయం ఏదైనా తీసుకున్నారా అని ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. ఇక అంతక ముందు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలోను విమర్శనాస్త్రాలు సందించారు.
బనకచర్ల ప్రాజెక్టును గుదిబండ ప్రాజెక్టుగా ఏబీవీ పేర్కొన్నారు…ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు భారంగా మారుతుందన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం ద్వారా ఏబీ ఏం చేయబోతున్నారనేది కూడా పొలిటికల్ సర్కిల్స్ చర్చకు దారి తీస్తుందట. టీడీపీకి దగ్గరగా ఉన్న వ్యక్తి…కూటమిలోని ప్రధాన పార్టీగా ఉన్న ప్రభుత్వంపై అదే టీడీపీపై విమర్శనాస్త్రాలు గుప్పించడం ద్వారా ఏబీ అడుగులు ఏంటనే దానిపై సస్పెన్స్‌గా మారిందట.
ఏబీ వెంకటేశ్వరరావు చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి. ఆ మాటలను ప్రభుత్వంలోని పెద్దలు పెద్దగా పట్టించుకోవడంలేదనే చర్చ నడుస్తోంది. రాబోయే రోజుల్లో ఏబీ వెంకటేశ్వరరావు స్వరం పెంచితే…ప్రభుత్వం నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.
Story by Vamshi, Big Tv