Plaud Note Pro review: ప్రస్తుత ఫాస్ట్ పేస్ బిజినెస్,ఆఫీస్ లైఫ్‌లో ప్రతి మీటింగ్, డిస్కషన్ లేదా ఇంటర్వ్యూను గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమైన పని. ఈ సమస్యకు చెక్ పెట్టేలా ప్రముఖ ఏఐ బ్రాండ్ ప్లాడ్ సంస్థ సరి కొత్తగా ‘ప్లాడ్ నోట్ ప్రో’డివైస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది కేవలం సాధారణ వాయిస్ రికార్డర్ మాత్రమే కాదు.. మీ మాటలను క్షణాల్లో టెక్స్ట్‌గా మార్చి పర్ఫెక్ట్ సమ్మరీని అందించే ఒక పవర్ ఫుల్ ఏఐ అసిస్టెంట్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ డివైస్ చూడటానికి అచ్చం క్రెడిట్ కార్డ్ సైజులోనే ఉంటుంది. ఇది కేవలం 0.12 ఇంచుల మందం, 1.06 ఔన్సుల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. దీనిని మీరు మీ పాకెట్‌లో లేదా వ్యాలెట్‌లో చాలా ఈజీగా ఉంచుకోవచ్చు. దీనికి ఉన్న.. రెడ్ డాట్, iF డిజైన్ అవార్డులే దీని ప్రీమియం లుక్‌కి నిదర్శనం. అలాగే .. ఇందులో ఉన్న 0.95 అంగుళాల అమెలోడ్ డిస్‌ప్లే ద్వారా రికార్డింగ్ స్టేటస్, బ్యాటరీ వివరాలను క్షణాల్లో చూసుకోవచ్చు.
ఈ డివైస్ మెయిన్ హైలైట్ దాని ఆడియో క్యాప్చరింగ్ టెక్నాలజీ. ఇందులో .. 4 MEMS మైక్రోఫోన్లు , ఒక VPU సెన్సార్‌ను వాడారు. దీని వల్ల 16.4 అడుగుల దూరం నుంచి కూడా స్పష్టమైన సౌండ్స్ రికార్డ్ చేయగలదు. అలాగే ఇది ఇన్-పర్సన్ మీటింగ్‌లను, ఫోన్ కాల్స్‌ను ఆటోమేటిక్‌గా గుర్తించి స్మార్ట్ డ్యూయల్ మోడ్‌లో పని చేస్తుంది.
ప్లాడ్ నోట్ ప్రో ఇంటెలిజెన్స్ సహాయంతో.. ఆడియోను టెక్స్ట్‌గా మార్చడం చాలా ఈజీ. ఇది ప్రపంచ వ్యాప్తంగా 112 భాషలకు (తెలుగుతో సహా) సపోర్ట్ చేస్తుంది.స్పీకర్ లేబుల్స్ ద్వారా మీటింగ్‌లో.. ఎవరు ఏమన్నారో స్పష్టంగా వేరు చేసి చూపగలదు. అంతే కాకుండా ఇందులో ఉన్న 10,000 పైచిలుకు ఏఐ టెంప్లేట్ల సహాయంతో.. మీటింగ్ సమ్మరీలు, కీ డిసిషన్స్ , తదుపరి చేయాల్సిన పనులను ఆటోమేటిక్‌గా రిపోర్ట్ రూపంలో.. తయారు చేసుకోవచ్చు.
Also Read: కాలేజ్ విద్యార్థుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్..తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్!
ఈ గాడ్జెట్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎన్‌హెన్స్ మోడ్‌లో దాదాపు 30 గంటల పాటు రికార్డ్ చేయెచ్చు. అలాగే ఇందులో 64GB స్టోరేజ్ ఉండటం వల్ల నెలల తరబడి రికార్డింగ్‌లను స్టోర్ చేసుకోవచ్చు. దీనికి టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
గ్లోబల్ మార్కెట్లో ..ఈ ప్లాడ్ నోట్ ప్రో ధర సుమారు రూ.17,490 నుంచి రూ.20,990 వరకు అందుబాటులో ఉంది.దీనితో పాటు ప్రతి నెలా 300 నిమిషాల ఫ్రీ ఏఐ ట్రాన్స్‌క్రిప్షన్ కోటా లభిస్తుంది. మరింత ఎక్కువ ఫీచర్లు కావాలనుకునే.. వారు ప్రో లేదా అన్లిమిటెడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు.
మీటింగ్స్, ఇంటర్వ్యూలు లేదా రోజు వారీ వాయిస్ నోట్స్‌ను డిజిటల్ రూపంలో స్టోర్ చేసుకునే ప్రొఫెషనల్స్, జర్నలిస్టులు , విద్యార్థులకు ప్లాడ్ నోట్ ప్రో ఒక అద్భుతమైన , బెస్ట్ ఏఐ టూల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.