Portronics Harmonics Twins S16: ప్రస్తుత రోజుల్లో.. ప్రతి ఒక్కరూ.. వైర్ లెస్ ఇయర్ బడ్స్‌ను.. వాడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే.. ఎక్కువ ధర పెట్టి బ్రాండెడ్ ఇయర్ బడ్స్ కొనలేక పోయే వారి కోసం మార్కెట్లో.. అనేక బడ్జెట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులోనూ.. ప్రముఖ బ్రాండ్ అయిన పోర్ట్రానిక్స్ నుంచి వచ్చిన ‘హార్మోనిక్స్ ట్విన్స్ S16’ ఇయర్ బడ్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచాయి. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే.. వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఈ డివైస్ అందించే ముఖ్యమైన ఫీచర్లు, పర్ఫామెన్స్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
ఈ ఇయర్ బడ్స్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా, స్టైలిష్‌గా ఉంటాయి. చెవులలో.. పెట్టుకున్నప్పుడు ఎంతో సౌకర్య వంతంగా ఉండి, వ్యాయామాలు చేసేటప్పుడు.. లేదా జాగింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఊడి పోకుండా.. చక్కటి గ్రిప్‌ను అందిస్తాయి. అంతే కాకుండా ఇవి బెస్ట్ డిజైన్ కలిగి ఉండటం వల్ల రోజు మొత్తం వాడినప్పటికీ.. చెవులకు ఎలాంటి నొప్పి అనిపించదు. అంతే కాకుండా ఇవి వాటర్ రెసిస్టెన్స్ (IPX5 రేటింగ్) సపోర్ట్‌తో వస్తాయి.కాబట్టి చెమట పడినా లేదా చిన్న పాటి వర్షంలో.. తడిచినా ఇయర్ బడ్స్ పాడైపోకుండా ఉంటాయి.
ఈ ధరలో.. ఇలాంటి సౌండ్ క్వాలిటీ దొరకడం నిజంగా బెస్ట్ ఆప్షన్ అవుతుంది.ఇందులో పవర్ ఫుల్ 10 మిమీ డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. ఇవి.. మ్యూజిక్ వినేటప్పుడు మంచి డీప్ బేస్‌ను, స్పష్టమైన వోకల్స్‌ను అందిస్తాయి. పాటల్లోని ప్రతి బీట్‌ను ఆస్వాదించడానికి ఈ ఇయర్ బడ్స్ చాలా బాగా సహకరిస్తాయి.
ఆఫీస్ మీటింగ్స్ లేదా ఫోన్ కాల్స్ ఎక్కువగా.. మాట్లాడే వారికి ఇందులో.. ఉన్న క్లియర్ కాల్స్ ఫీచర్ చాలా ఉపయోగ పడుతుంది. ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ కారణంగా చుట్టు పక్కల ఉండే అనవసరమైన సౌండ్ తగ్గి పోయి, మీ గొంతు అవలి వ్యక్తికి చాలా స్పష్టంగా వినిపిస్తుంది.
మొబైల్ గేమింగ్ ఇష్టపడే కుర్రాళ్ల కోసం ఇందులో.. ప్రత్యేకంగా లో లేటెన్సీ గేమింగ్ మోడ్ ఇచ్చారు. గేమ్‌లు ఆడేటప్పుడు ఆడియో సింక్ సరిగ్గా ఉండేలా ఇది చూసుకుంటుంది. దీని వల్ల ఫ్రీఫైర్ లేదా బ్యాటి ల్‌గ్రాండ్స్ లాంటి గేమ్‌లు ఆడేటప్పుడు సౌండ్ ఆలస్యంగా రావడం వంటి సమస్యలు ఉండవు.
ఈ ఇయర్ బడ్స్ మరొక ముఖ్యమైన ప్లస్ పాయింట్.. వీటి బ్యాటరీ లైఫ్. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి మొత్తం 24 గంటల వరకు ప్లేటైమ్ లభిస్తుంది. అంటే.. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజంతా ఎలాంటి టెన్షన్ లేకుండా.. మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు. లేదా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే.. ఇందులో టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ,డిజిటల్ బ్యాటరీ డిస్‌ప్లే కూడా ఉంది. దీని వల్ల బ్యాటరీ ఎంత ఉందనేది ఈజీగా తెలుసుకోవచ్చు.
Also Read: కాలేజ్ విద్యార్థుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్..తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్!
మార్కెట్లో ఈ పోర్ట్రానిక్స్ హార్మోనిక్స్ ..ట్విన్స్ S16 ఇయర్ బడ్స్ అసలు ధర సుమారు రూ.1,999 వరకు ఉండగా..ప్రస్తుత ఆఫర్లలో, ఆన్‌లైన్ ఈ-కామర్స్ వేదికలపై కేవలం రూ.729 ధరకే అందుబాటులో ఉన్నాయి.
తక్కువ బడ్జెట్‌లో మంచి సౌండ్, స్టైలిష్ లుక్, గేమింగ్ మోడ్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే.. వారికి పోర్ట్రానిక్స్ హార్మోనిక్స్ ట్విన్స్ S16 ఒక బెస్ట్ ఆప్షనం అని చెప్పొచ్చు. రూ.1000లోపు ధరలో.. లభించే బెస్ట్ TWS ఇయర్ బడ్స్‌లో ఇది కచ్చితంగా ముందుంటుంది.