E-Paper
Advertisement

ఐస్‌క్రీమ్‌కు బదులుగా ఈ కొరియన్ డెజర్ట్ ట్రై చేయండి.. టేస్ట్ అమోఘం!

ఐస్‌క్రీమ్‌కు బదులుగా ఈ కొరియన్ డెజర్ట్ ట్రై చేయండి.. టేస్ట్ అమోఘం!
Advertisement

Korean Bingsu Recipe: వాతావరణం వేడిగా ఉన్నప్పుడైనా లేదంటే సాయంత్రం వేళ ఏదైనా చల్లగా తినాలనిపించినా ఐస్‌క్రీమ్, కుల్ఫీ గుర్తొస్తాయి. కానీ ఎప్పుడూ అవే కాకుండా ఈసారి కొత్తగా, కొరియన్ స్టైల్‌లో ఓ స్వీట్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది? అదే కొరియన్ బింగ్సు. మంచులా మెత్తగా ఉండే ఐస్‌తో, పాలు, తియ్యటి పండ్లు, కండెన్స్‌డ్ మిల్క్ కలిపి తయారు చేసే ఈ డెజర్ట్ కొరియాలో ఎంతో ప్రసిద్ధి. ముఖ్యంగా స్ట్రాబెర్రీలు, మామిడి పండ్లు, స్వీట్ బీన్స్‌తో రకరకాల బింగ్సు తయారు చేస్తారు.

చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండటమే కాదు.. తినేటప్పుడు నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ డెజర్ట్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. దీన్ని తినడానికి కొరియన్ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కొన్ని పదార్థాలతో సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. చల్లచల్లని కొరియన్ బింగ్సును ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి..

కావాల్సిన పదార్థాలు:

Advertisement

పాలు – 2 కప్పులు
కండెన్స్‌డ్ మిల్క్ – 4 టేబుల్ స్పూన్లు
స్ట్రాబెర్రీలు – 8
మామిడి పండు – ఒకటి
పంచదార – 2 టేబుల్ స్పూన్లు
వెనిల్లా ఎసెన్స్ – అర టీస్పూన్
ఐస్‌క్రీమ్ – 2 స్కూపులు
బాదం పలుకులు – 2 టేబుల్ స్పూన్లు
తేనె – ఒక టేబుల్ స్పూన్

Also Read: కచ్చితమైన కొలతలతో మటన్ కచ్చి బిర్యానీ.. నోట్లో పెట్టగానే ముక్క వెన్నలా కరిగిపోద్ది!

తయారీ విధానం ఇలా:

Advertisement

ఒక గిన్నెలో పాలు, రెండు టేబుల్ స్పూన్ల కండెన్స్‌డ్ మిల్క్, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి ఫ్రీజర్‌లో పెట్టాలి. పాలు పూర్తిగా గడ్డకట్టే వరకు కొన్ని గంటలు ఉంచాలి. ఇలా పాలతో తయారు చేసిన ఐస్ ఉపయోగించడం వల్ల బింగ్సుకు మంచి రుచి, క్రీమీ ఆకృతి వస్తాయి.

ఇప్పుడు స్ట్రాబెర్రీలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి. మామిడి పండును కూడా తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీ ముక్కల్లో పంచదార కలిపి పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల పండ్ల నుంచి రసం విడుదలై తియ్యటి రుచి వస్తుంది.

పాల ఐస్ గడ్డకట్టిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి మంచులా అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా జాగ్రత్తపడాలి. ఇప్పుడు ఈ మెత్తటి ఐస్‌ను ఒక సర్వింగ్ బౌల్‌లో వేసి పైభాగాన్ని గుండ్రంగా సర్దాలి.

దానిపై మామిడి, స్ట్రాబెర్రీ ముక్కలను అందంగా అమర్చాలి. మిగిలిన కండెన్స్‌డ్ మిల్క్‌ను పైనుంచి పోసి, ఐస్‌క్రీమ్ స్కూప్ పెట్టాలి. చివరగా బాదం పలుకులు చల్లి, కొద్దిగా తేనె వేస్తే కొరియన్ బింగ్సు సిద్ధమైనట్టే.

ఈ డెజర్ట్‌ను తయారు చేసిన వెంటనే సర్వ్ చేస్తే మంచులాంటి మెత్తటి ఆకృతిని ఆస్వాదించవచ్చు. మీకు నచ్చిన పండ్లతోనూ దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే కొరియన్ స్టైల్ డెజర్ట్‌ను రుచి చూడాలనుకుంటే ఈ బింగ్సును తప్పక ప్రయత్నించండి.

Also Read: గుమ్మడికాయ అంటే ఇష్టం లేనివాళ్లు కూడా ఈ హల్వాను లొట్టలేసుకుంటూ తింటారు!

Tags

Related News

దుబాయ్‌లో ఐఫోన్ చౌక అని కొంటున్నారా? ఈ తప్పు చేస్తే మీ డబ్బులు గోవిందా!

అమ్మ బాబోయ్.. రూ.1.30 లక్షల విలువైన స్మార్ట్ టీవీ జస్ట్ రూ.64 వేలకే వచ్చేస్తోంది!

రూ.1.75 లక్షల శాంసంగ్ ఫోన్ ఇంత చౌకగానా? రూ.45 వేల డిస్కౌంట్‌తో అదిరిపోయే డీల్!

అమెజాన్ రీలోడెడ్ సేల్.. రూ.699కే బ్రాండెడ్ పవర్ బ్యాంక్.. మిస్ అయితే ఫీలవుతారు మామా!

మనిషి అనుమతి లేకుండానే ఎన్నికల డేటా యాక్సెస్ చేసిన క్లాడ్ ఏఐ..

మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఫొటో, గేమింగ్ యాప్స్ లొకేషన్ ఎందుకు అడుగుతాయి?

ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌పై బిగ్ అప్‌డేట్.. iPhone 17 కావాలంటే ఈ తేదీని అస్సలు మిస్ కావద్దు!

Big Stories

Advertisement
×