iPhone Customs Duty: దుబాయ్‌లో ఐఫోన్ కొనుక్కొని ఇండియాకు వస్తున్నారా? అయితే ఎయిర్పోర్ట్ లో మీ ఫోన్ ను కస్టమ్స్ అధికారులు ఆపొచ్చు. అంతేకాదు వేల రూపాయల కస్టమ్ డ్యూటీ కూడా అడగొచ్చు. ఇదంతా ఎందుకు? విదేశాల్లో మన సొంత డబ్బులతో కొనుక్కున్న ఫోన్ ను ఇండియాకు తీసుకురావడానికి కూడా టాక్స్ కట్టాలా? ఈ విషయంలో అసలు రూల్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎయిర్పోర్ట్ లోనే కూర్చొని నిరసన
అసలు ఏం జరిగింది? ఈ చర్చకు కారణం కేరళాలోని కొచ్చి ఎయిర్పోర్ట్ లో జరిగిన ఒక ఘటన. అజాజ్ మహమ్మద్ అనే వ్యక్తి దుబాయ్‌లో కొత్త ఐఫోన్ 18 ప్రో కొని ఇండియాకి వచ్చాడు. అయితే ఆయన దగ్గర అప్పటికే మరో ఐఫోన్ కూడా ఉంది. దీంతో కొత్త ఫోన్ పై దాదాపు 30,000 వరకు కస్టం డ్యూటీ చెల్లించాలని అధికారులు అడిగారు. అయితే ఆ ఫోన్ తన వ్యక్తిగత అవసరాల కోసమే కొనుగోలు చేశానని అంత మొత్తం చెల్లించడానికి అంగీకరించలేదని ఆజాస్ చెప్పారు. దీంతో అధికారులు కొత్త ఫోన్‌ను తమ వద్ద ఉంచుకోవడంతో ఆయన ఎయిర్పోర్ట్ లోనే కూర్చొని నిరసన తెలిపారు. ఈ ఘటనతో మరోసారి 1ప్రశ్నలు వస్తున్నాయి. విదేశాల నుంచి ఐఫోన్ తెచ్చుకుంటే నిజంగానే కస్టం టాక్స్ కట్టాలా ఇప్పుడు అసలు రూల్స్ ఏంటో చూద్దాం.
అసలు ఈ రూల్స్ ఏంటి..?
ఇండియాలో 2026 ఫిబ్రవరి 2 నుంచి కొత్త బ్యాగేజ్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం అర్హులైన భారతీయ నివాసితులు భారత సంతతికి చెందిన అర్హులైన పర్యాటకులు నిర్దిష్ట వీసా కలిగిన విదేశీ ప్రయాణికులకు విమాన మార్గంలో వచ్చే సమయంలో 75,000 వరకు సాధారణ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఉంటుంది. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది. ఒకవేళ మనం దుబాయ్‌లో లక్ష విలువైన ఐఫోన్ కొనుక్కుంటే 75,000 అలవెన్స్ ఉంది కాబట్టి మిగతా 25,000 పైన టాక్స్ కడితే సరిపోతుందా? అలా నేరుగా లెక్క వేయకూడదు. ఎందుకంటే ఈ అలవెన్స్ అనేది అర్హులైన ప్రయాణికులకు వర్తించే సాధారణ మినాయింపు అది ప్రతి వస్తువుకు విడిగా ఇచ్చే మినహాయింపు కాదు అలాగే అలవెన్స్ ని మించిన మొత్తం పైనే కస్టం డ్యూటీ పడుతుందని కూడా అనుకోకూడదు. వస్తువు రకం దాని విలువ వర్తించే కస్టం నిబంధనల ప్రకారం డ్యూటీ లెక్కించాల్సి ఉంటుంది. మరి పాత ఫోన్ తీసుకెళ్తే కొత్త ఫోన్ తీసుకొస్తే సేమ్ అవే రూల్స్ ఉంటాయా ఇప్పుడు చూద్దాం.
పాత ఫోన్ కి కొత్త ఫోన్ కి అవే రూల్స్ ఉంటాయా..?
ఇక్కడే అసలు తేడా ఉంది. మీరు ఇప్పటికే వాడుతున్న ఫోన్ ను వ్యక్తిగత అవసరాల కోసం ప్రయాణంలో తీసుకెళ్తున్నట్లయితే అది వ్యక్తిగత వస్తువుగా పరిగణించబడే అవకాశం ఉంది. కానీ, విదేశాల్లో కొత్తగా కొనుగోలు చేసిన ఫోన్ విషయంలో పరిస్థితి వేరుగా ఉండొచ్చు. ఉదాహరణకు మీ దగ్గర ఇప్పటికే ఒక పాత ఐఫోన్ ఉందనుకుందాం. దాంతో పాటు దుబాయ్‌లో కొత్త ఐఫోన్ కొనుక్కొని ఇండియాకు వస్తున్నారు. అప్పుడు కస్టమ్స్ అధికారులు కొత్త ఫోన్ ని ఎప్పుడు కొన్నారు? దాని విలువ ఎంత? ఇది ఇప్పటికీ ఉపయోగిస్తున్న వ్యక్తిగత వస్తువా లేక విదేశాల నుంచి కొత్తగా తీసుకొస్తున్న వస్తువా అనే అంశాలను పరిశీలించొచ్చు.
అయితే రెండు ఫోన్లు ఉన్నంత మాత్రాన తప్పనిసరిగా టాక్స్ పడుతుందని కాదు. అలాగే కొత్త ఫోన్‌ను సొంత అవసరాల కోసం తెచ్చుకుంటున్నానని చెప్తే ఆటోమేటిక్ గా టాక్స్ మినహాయింపు వస్తుందని కూడా కాదు. మరి దుబాయ్‌లో ఐఫోన్ కొనడం వల్ల ఉపయోగం ఏంటి?
Also Read: ఆలోచన లేకుండా అప్పులు చేసిన మేధావి కేసీఆర్: మహేష్ కుమార్ గౌడ్
దుబాయ్‌లో ఐఫోన్ కొనడం వల్ల ఉపయోగం ఏంటి?
దుబాయ్‌లోని కొన్ని ఐఫోన్ మోడల్స్ భారతదేశంతో పోలిస్తే తక్కువ ధరకు ఉండొచ్చు. కానీ ధర తక్కువగా ఉందని వెంటనే కొనేయకుండా రెండు దేశాలను అసలు ధరింత వారంటీ నెట్వర్క్ అనుకూలత వంటి అంశాలు ఎలా ఉన్నాయి ఇండియాకు తీసుకొచ్చేటప్పుడు కస్టం్ డ్యూటీ వర్తిస్తుందా అనే విషయాలు ముందే తెలుసుకోవాలి. ఒకవేళ కస్టమ్ డ్యూటీ వర్తిస్తే ఆ ఖర్చును కూడా కలిపి లెక్క వేసుకోవాలి. లేదంటే అక్కడ ఆదా చేసిన డబ్బు ఇక్కడ అదనపు ఖర్చుగా మారొచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం కస్టమ్స్ అధికారులు డ్యూటీ అడిగితే దాని లెక్క ఎలా వేశారో వివరాలు కూడా అడగొచ్చు. నిర్ణయంపై అభ్యంతరం ఉంటే అధికారిక ఫిర్యాదు లేదా చట్టపరమైన మార్గాలను ఆశ్రయించవచ్చు. కానీ నిరసన తెలిపే విధానం కూడా చట్టపరమైన పరిధిలోనే ఉండాలి. మరి చివరగా దుబాయ్ నుంచి ఐఫోన్ తెస్తే కస్టమ్స్ పట్టుకుంటారా ప్రతి ప్రయాణికుడి ఫోన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుంటారని కాదు. కానీ వర్తించే నిబంధనల ప్రకారం డ్యూటీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి విదేశాల నుంచి ఐఫోన్ కొనుకొచ్చుకునేటప్పుడు బిల్లు దగ్గర ఉంచుకోండి. ప్రయాణానికి ముందు అధికారిక కస్టమ్స్ నిబంధనలను తెలుసుకోండి. అవసరమైతే కస్టమ్స్ అధికారులను సంప్రదించండి. ఎందుకంటే విదేశాల్లో తక్కువ ధరకు ఫోన్ కనడం ఒక లెక్క. ఆ ఫోన్ ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇండియాకు తీసుకురావడం మరో లెక్క. ఇలాంటి విషయాలపై అవగాహన ఉంటేనే అవసరమైన ఖర్చులు ఎయిర్పోర్ట్ లో ఇబ్బందులు తప్పించుకోవచ్చు.