E-Paper
Advertisement

కాలేజ్ విద్యార్థుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్..తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్!

కాలేజ్ విద్యార్థుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్..తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్!
Advertisement

best budget student laptops 2026: ప్రస్తుత డిజిటల్ కాలంలో.. కాలేజ్ స్టూడెంట్స్‌కు నోట్‌ బుక్స్ కంటే.. ల్యాప్‌టాప్ చాలా ముఖ్యమైన డివైస్‌గా మారి పోయింది. డిగ్రీ లేదా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు రోజువారీ క్లాసులు, పిపిటి ప్రెజెంటేషన్లు, కోడింగ్ లేదా ప్రాజెక్ట్ వర్క్స్ కోసం ఉపయోగపడే ల్యాప్‌టాప్ అవసరం ఉంటుంది. అయితే.. అందరూ ఖరీదైన ఆపిల్ లేదా గేమింగ్ ల్యాప్‌టాప్‌లను కొనలేరు. అందుకే.. విద్యార్థుల బడ్జెట్‌కు సరి పోయేలా.. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు అందించే.. టాప్ 5 ల్యాప్‌ టాప్స్ గురించి వివరంగా ఇప్పుడుతెలుసుకుందాం.

1. MSI Modern 14:

ఈ ల్యాప్‌టాప్ స్టూడెంట్స్ కోసం మార్కెట్లో ప్రస్తుతం హాట్ కేకులా అమ్ముడవుతోంది. ఇది చూడటానికి చాలా స్లిమ్, స్టైలిష్‌గా ఉండటమే కాకుండా కాలేజీకి తీసుకెళ్లడానికి చాలా తేలికగా ఉంటుంది. AMD Ryzen 5 ప్రాసెసర్, 16GB RAM, 512GB SSD స్టోరేజ్‌తో ఇది వస్తుంది. అంతే కాకుండా ఇది మల్టీటాస్కింగ్‌ను చాలా ఈజీ చేస్తుంది. తద్వారా.. విద్యార్థులు ఒకే సారి వివిధ యాప్స్ రన్ చేయెచ్చు.

Advertisement

ధర: సుమారు రూ.43,200.

2. Acer Aspire Lite:

బడ్జెట్ ధరలో పెద్ద స్క్రీన్ ,మంచి పెర్ఫార్మెన్స్ కోరు కునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది తక్కువ బరువు కలిగి ఉండటంతో కాలేజ్‌కి బ్యాగ్‌లో రోజూ తీసుకెళ్లడం చాలా ఈజీ.
Intel Core i3 (లేదా Ryzen 3 ఆప్షన్స్), 8GB/16GB RAM, 512GB ఫాస్ట్ SSD స్టోరేజ్ దీనిలో ఉంటాయి.అంతే కాకుండా దీని బ్యాటరీ బ్యాకప్ కూడా.. రోజు వారీ అవసరాలకు సరి పోతుంది.

Advertisement

ధర: సుమారు రూ.42,990 నుంచి రూ.46,990 వరకు ఉంది.

3. Dell Vostro 14 :

డెల్ బ్రాండ్ అనగానే దాని క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పన వసరం లేదు. విద్యార్థులు ఎక్కువ సంవత్సరాలు.. ఎలాంటి సమస్యలు లేకుండా వాడాలనుకుంటే.. ఈ మోడల్ చాలా బాగుంటుంది.పవర్ ఫల్ ప్రాసెసర్, 8GB లేదా 16GB RAM ఆప్షన్స్, క్లియర్ డిస్‌ప్లేతో ఇది వస్తుంది. ఆన్‌ లైన్ క్లాసులు, జూమ్ కాల్స్ కోసం దీని హెచ్‌డీ వెబ్‌కామ్ బాగా పని చేస్తుంది.

ధర: సుమారు రూ.39,990.

4. Lenovo IdeaPad Slim 3:

స్మార్ట్ లుక్స్, ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ కోరుకునే కాలేజ్ కుర్రాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. కీబోర్డ్ టైపింగ్ ఫీల్ చాలా ఈజీగా.. ఉండటం వల్ల ప్రాజెక్ట్ రిపోర్ట్స్ టైప్ చేయడానికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. లేటెస్ట్ జెన్ ఇంటెల్ లేదా ఏఎండీ ప్రాసెసర్లు,ఫాస్ట్ బూటింగ్ కోసం SSD స్టోరేజ్, విండోస్ 11 సపోర్ట్ తో ఈ ల్యాప్ ట్యాప్ లభిస్తుంది.

ధర: సుమారు రూ.45,000 నుంచి రూ. 51,990 మధ్య లభిస్తుంది.

Also Read: సినిమా థియేటర్‌ను ఇంటికే తెచ్చుకోండి..రూ.5వేలలోపే బెస్ట్ ప్రొజెక్టర్లు

5. ASUS Vivobook Go 14:

తక్కువ ధరలో.. బ్రాండెడ్ ల్యాప్‌టాప్ కావాలనుకునే విద్యార్థుల మొదటి ఆప్షన్ అసూస్ వివోబుక్ సిరీస్. ఇది కాంపాక్ట్ సైజులో ఉండి విద్యార్థుల బడ్జెట్‌కు బెస్ట్ అని చెప్పొచ్చు. లైట్‌వెయిట్ బాడీ, బెస్ట్ బ్యాటరీ లైఫ్, రోజు వారీ స్టడీ యాప్స్ ఈజీగా రన్ అయ్యే హార్డ్‌వేర్ దీని ప్రత్యేకత.

ధర: సుమారు రూ. 43,890.

మీ కాలేజ్ సెమిస్టర్స్ సాఫీగా సాగిపోవడానికి, మీ బడ్జెట్ దాటిపోకుండా.. ఉండటానికి ఈ ల్యాప్‌ టాప్స్ అద్భుతమైన ఆప్షన్ అవుతుంది. మీ కోర్సు అవసరాలకు తగినట్లుగా తగిన ర్యామ్ , ప్రాసెసర్ ఉన్న మోడల్‌ను ఎంచుకోండి.

Related News

ఐస్‌క్రీమ్‌కు బదులుగా ఈ కొరియన్ డెజర్ట్ ట్రై చేయండి.. టేస్ట్ అమోఘం!

దుబాయ్‌లో ఐఫోన్ చౌక అని కొంటున్నారా? ఈ తప్పు చేస్తే మీ డబ్బులు గోవిందా!

అమ్మ బాబోయ్.. రూ.1.30 లక్షల విలువైన స్మార్ట్ టీవీ జస్ట్ రూ.64 వేలకే వచ్చేస్తోంది!

రూ.1.75 లక్షల శాంసంగ్ ఫోన్ ఇంత చౌకగానా? రూ.45 వేల డిస్కౌంట్‌తో అదిరిపోయే డీల్!

అమెజాన్ రీలోడెడ్ సేల్.. రూ.699కే బ్రాండెడ్ పవర్ బ్యాంక్.. మిస్ అయితే ఫీలవుతారు మామా!

మనిషి అనుమతి లేకుండానే ఎన్నికల డేటా యాక్సెస్ చేసిన క్లాడ్ ఏఐ..

మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఫొటో, గేమింగ్ యాప్స్ లొకేషన్ ఎందుకు అడుగుతాయి?

Big Stories

Advertisement
×