Polish Travel Creator Praises Vande Bharat Experience: భారతీయ రైల్వేలో ఆధునిక సౌకర్యాలు పెరుగుతున్న నేపథ్యంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పోలాండ్ కు చెందిన ట్రావెల్ క్రియేటర్ డొమినికా పటాలాస్ కల్రా ఈ రైలులో ప్రయాణించింది. అంతేకాదు, ఈ రైల్లో ఎక్స్ పీరియెన్స్ ను యూరప్ రైళ్లతో పోల్చింది. ముఖ్యంగా రైలులో అందించిన ఫుడ్, సీట్ల సౌకర్యం, టైమ్ మెయింటెనెన్స్ ఆమెను ఆకట్టుకున్నాయి. తన ట్రావెల్ ఎక్స్ పీరియెన్స్ ను వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వందే భారత్ రైలులో ఎక్కిన వెంటనే తనకు అందిన సర్వీసుల గురించి డొమినికా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రయాణికులకు ముందుగా వాటర్, మసాలా చాయ్, బిస్కెట్లు అందించారని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఫుడ్ కూడా ఇచ్చినట్లు వివరించింది. ఆమె వెజ్ ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నట్లు చెప్పింది. ఇందులో పోహా, రెండు కట్‌లెట్లు, పెరుగు, ఒక మఫిన్ ఉన్నాయి. రైలు ప్రయాణంలో ఇన్ని రకాల ఆహార పదార్థాలు అందించడం తనకు నచ్చిందని చెప్పుకొచ్చింది. యూరప్‌లోని కొన్ని రైళ్లలో సాధారణంగా వాటర్, చాక్లెట్ మాత్రమే ఇస్తారని చెప్పింది. ఈ విషయంలో వందే భారత్ చాలా ముందు ఉందని చెప్పుకొచ్చింది.
రైలులో ప్రయాణించేటప్పుడు సౌకర్యం కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో ఇండియన్, యూరోపియన్ రైళ్లలోని సీట్లు తనకు శుభ్రంగా, సౌకర్యవంతంగా అనిపించాయని డొమినికా చెప్పింది. అయితే, ఆమెకు నచ్చిన మరో అంశం టైమ్ మెయింటెనెన్స్. తాను ప్రయాణించిన వందే భారత్ రైలు నిర్ణీత సమయానికి చేరుకోవడం సంతోషాన్ని కలిగించిందని డొమినికా చెప్పింది. యూరప్‌లో రైళ్ల పనితీరు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని వివరించింది. ముఖ్యంగా పోలాండ్‌లో ప్రయాణించే సమయంలో తరచూ రైళ్లు లేట్ అయినట్లు చెప్పింది. అయితే, ఈ ఎక్స్ పీరియెన్స్ ఆధారంగా అన్ని భారతీయ రైళ్లు, యూరోపియన్ రైళ్లను ఒకే విధంగా పోల్చలేమని వివరించింది. రైలు సర్వీసులు, మార్గాలు, ప్రయాణ తరగతులను బట్టి సౌకర్యాలు మారుతుంటాయన్నది.
డొమినికా వీడియోపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భారతీయ రైల్వేలో వస్తున్న మార్పులను గుర్తించినందుకు కొందరు ఆమెను అభినందించారు. మరికొందరు దేశంలో అభివృద్ధి చెందుతున్న రవాణా సౌకర్యాలపై సంతోషం వ్యక్తం చేశారు. ఇంకొందరు మాత్రం వందే భారత్ వంటి ప్రీమియం రైళ్ల అనుభవాన్ని సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోల్చకూడదని సూచించారు. ప్రయాణ బడ్జెట్, రిజర్వేషన్, కోచ్ తరగతి లాంటి అంశాలు కూడాఈ ఎక్స్ పీరియెన్స్ ను ప్రభావితం చేస్తాయని వ్యాఖ్యానించారు. డొమినికా పర్యటన భారతీయ రైల్వేలోని ఆధునిక సౌకర్యాలపై మరోసారి చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఫుడ్, సౌకర్యం, టైమ్ మెయింటెనెన్స్ విషయంలో ఆమె పంచుకున్న అభిప్రాయాలు వందే భారత్‌పై ఆసక్తిని పెంచాయి.
Read Also: బుల్లెట్ రైలు ప్రయాణానికి ముహూర్తం ఖరారు.. రైల్వే మంత్రి ఏమన్నారంటే!